బొగ్గు బుగ్గి | Singareni a loss of Rs 125 crore | Sakshi
Sakshi News home page

బొగ్గు బుగ్గి

Published Sat, Apr 23 2016 2:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Singareni a loss of Rs 125 crore

5 లక్షల టన్నులకుపైగా అగ్నికి ఆహుతి
సింగరేణికి రూ.125 కోట్లకు పైగా నష్టం
యూర్డుల వద్ద 64 లక్షల టన్నుల నిల్వలు
నిల్వ కేంద్రాలలో కాలిపోతున్న నల్ల బంగారం
ఏరియూల్లో ఉత్పత్తి తగ్గించిన యాజమాన్యం

 
 
 గోదావరిఖని(కరీంనగర్) :  సింగరేణిలో బొగ్గు నిల్వలు భారీగా పేరుకుపోయా యి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టినప్పటికీ దానిని వినియోగదారులకు రవాణా చేయకపోవడంతో నిల్వలు పెరిగిపోయాయి. విదేశాల నుంచి నాణ్యమైన బొగ్గు చౌకగా లభించడం.. సింగరేణి బొగ్గులో బూడిద శాతం ఎక్కువగా ఉండడం వల్ల సిమెంట్, విద్యుత్ పరిశ్రమలు సింగరేణి బొగ్గు వినియోగించడానికి వెనకంజ వేశాయి. దీంతో రైల్వే నుంచి వ్యాగన్లు రాక నిల్వలు పెరిగిపోయూరుు. దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నెలలో నిర్దేశించిన లక్ష్యం కన్నా తక్కువ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు.


 కంపెనీ వ్యాప్తంగా బొగ్గు నిల్వలను పరిశీలిస్తే..
 గురువారం నాటికి ఇల్లెందు ఏరియూలో 3.77 లక్షల టన్నులు, మణుగూరులో 9.60లక్షల టన్నులు, బెల్లంపల్లి లో 3.50 లక్షల టన్నులు, మందమర్రిలో 6.53 లక్షల టన్ను లు, శ్రీరాంపూర్‌లో 5.60 లక్షల టన్నులు, ఆర్జీ-1లో 7.94 లక్షల టన్నులు, ఆర్జీ-2లో 12.90 లక్షల టన్నులు, ఆర్జీ-3 ఏరియాలో 3.50 లక్షల టన్నులు, భూపాలపల్లిలో 9.95 లక్షల టన్నులు, అడ్రియాల ప్రాజెక్టులో 99వేల టన్నులు మొత్తం 64.28 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయాయి.


 బూడిదవుతున్న బొగ్గు
 బొగ్గు వెలికితీసిన వెంటనే రవాణా చేయాల్సి ఉంటుంది. గని లేక ప్రాజెక్టుల ఉపరితలంలో నిల్వ చేసిన బొగ్గు ముక్కలకు మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడి అందులోకి గాలిలో ఉన్న ఆక్సిజన్ చేరుతుంది. దానికి బొగ్గులో ఉన్న కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు వేడి చేరి బొగ్గు మండుతుంది. ఈ పరిస్థితి ప్రతి సీజన్‌లో ఉంటుంది. వేసవి కాలంలో మాత్రం వేడి ఎక్కువ గా ఉండడంతో ఇక్యూబేషన్(బొగ్గును నెమ్మదిగా మం డిం చే) పీరియడ్ తక్కువగా ఉండి త్వరగా బొగ్గు కాలిపోతుంది. ప్రస్తుత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిల్వ బొగ్గులో సుమారు 8 శాతం వరకు కాలిపోతున్నట్లు అధికారులు అంచనా వేశారు. అంటే 5 లక్షలకు పైగా టన్నుల బొగ్గు అగ్నికి ఆహుతవుతున్నట్టు తెలుస్తోంది. టన్నుకు సుమారు రూ.2,500 ధర నిర్ణయిస్తే రూ.125 కోట్లకు పైగా విలువైన నల్లబంగారం కాలిపోతున్నట్లు స్పష్టమవుతోంది.


 తగ్గిన ఉత్పత్తి వేగం
 బొగ్గు నిల్వలు అగ్నికి ఆహుతవుతుండడంతో యాజమాన్యం ఏప్రిల్ ప్రారంభం నుంచే ఉత్పత్తి వేగాన్ని తగ్గించింది. గడిచిన 20 రోజులలో కంపెనీ వ్యాప్తంగా 33.61 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 28.98 లక్షల టన్నులు మాత్రమే వెలికితీశారు. రానున్న రోజుల్లో నిల్వ కేంద్రాలలోని బొగ్గును రవాణా చేయకుండా దానిపైనే ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న బొగ్గు పోస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement