Coal reserves
-
ఉక్కులో నిండుకున్న ముడి పదార్థాలు
ఉక్కునగరం (విశాఖ జిల్లా): విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ప్లాంట్‌లో ముడి పదార్థాల నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయం అందకపోతే స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోతుంది. సీఎం చంద్రబాబు కల్పించుకొని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. స్టీల్‌ప్లాంట్ గత కొన్ని నెలలుగా ముడి పదార్థాల కొరతతో సతమతమవుతోంది. మూడు బ్లాస్ట్ఫర్నేసుల్లో ఒక దానిని నిలిపివేసి అంతంత మాత్రం హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తున్నారు. గత నెలలో స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామి ప్లాంట్‌కు అవసరమైన ముడి పదార్థాలు సెయిల్, ఎన్ఎండీసీ ద్వారా సమకూరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి నెల దాటినా ఇంతవరకు ముడి పదార్థాలు రాలేదు. ముఖ్యంగా బొగ్గు నిల్వలు తరిగిపోయాయి. ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం లేని విధంగా నిల్వలు చేరుకున్నాయి. ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ (ఐసీసీ) మూడు రోజులకు మాత్రమే సరిపోయేలా ఉంది. దీంతో కోక్ ఓవెన్స్ బ్యాటరీల పుషింగ్స్ 300 నుంచి 200కు తగ్గించారు. విశాఖ ఉక్కు కొనుగోలు చేసిన ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ గంగవరం పోర్టులో 1.40 లక్షల టన్నులు ఉంది. దానిపై కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ ఉండటంతో పోర్టులోనే నిలిచిపోయింది. ఉక్కు మంత్రి పర్యటనలో మూడు షిప్మెంట్ల కోల్ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు మూడు రేక్‌లు మాత్రమే సెయిల్ నుంచి అందాయి. అవి దాదాపు వినియోగించారు. మరోవైపు ఐరన్ ఓర్ లంప్స్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి. సైజ్డ్ ఓర్, ఐరన్ ఓర్ ఫైన్స్ నిల్వలు ఐదు రోజులకు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా బాయిలర్ కోల్ నిల్వలు కూడా జీరో స్ధాయికు చేరుకున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోతుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీని విస్మరించిన కూటమి నాయకులు స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా నేతలంతా ఆ హామీలను పూర్తిగా విస్మరించారు. తక్షణం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉక్కు ఉద్యోగ కార్మిక నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు శనివారం ప్రధానితో భేటీ కానున్నారు. ఈ భేటీలో విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై స్పష్టమైన హామీను కోరాలని, ప్లాంట్‌కు కావాల్సిన ముడి పదార్థాలు, ఆర్థిక ప్యాకేజీలపై చర్చించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం సెక్రటేరియట్‌కు మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు తెలిపారు. -
AP: ‘బొగ్గు’ భయం లేదు.!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు వల్ల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ నిరాటంకంగా నడిచాయి. విద్యుత్ సంస్థలు సమర్థవంతంగా కరెంటు అందించాయి. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గును సమకూర్చుకుంటున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క రోజు బొగ్గు కోసమే నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతో పాటు, విదేశీ బొగ్గునూ దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో వారానికి సరిపడా నిల్వలు ఉంటున్నాయి. కొరత లేకుండా నిల్వలు వీటీపీఎస్‌కి రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం 1,24,324 మెట్రిక్ టన్నులు ఉంది. ఆర్టిపీపీకి 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా.. 60,203 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నం ప్లాంటుకు 29 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,66,606 మెట్రిక్ టన్నులు ఉంది. హిందూజాలో 19,200 మెట్రిక్ టన్నులు ఒక రోజుకి వాడుతుండగా, ఇక్కడ 1,04,891 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు మూడు రోజుల నుంచి వారం రోజులకు సరిపోతాయి. ఈ బొగ్గు వాడుతూనే, తర్వాతి రోజుల్లో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది రాకుండా నిత్యం మరింత బొగ్గును రాష్ట్రం దిగుమతి చేసుకుంటోంది. సాధారణంగా 65 నుంచి 75 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) వద్ద 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఈ మేరకు డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టిపీపీ) కోసం 8 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు ఏపీ జెన్కో టెండర్ ఖరారు చేసింది. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి ఈ బొగ్గు వస్తుంది. విదేశీ బొగ్గుతో స్వదేశీ బొగ్గును కలిపి విద్యుత్ ఉత్పత్తికి వాడాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఇప్పటికే 7.5 లక్షల విదేశీ బొగ్గు టెండర్‌ను జెన్కో ఖరారు చేసింది. ఆర్టీపీపీకి 2 లక్షల టన్నులు, వీటీపీఎస్‌కు 3 లక్షల టన్నుల చొప్పున మరో 5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం మరో టెండర్‌ను పిలిచింది. పూర్తి విదేశీ బొగ్గుతో నడిచే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)కు 7.5 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. అవసరాలకు తగ్గట్టు.. రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నది ఏపీ జెన్కో లక్ష్యం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక ఉత్పత్తి నమోదు చేస్తూ రాష్ట్ర అవసరాల్లో దాదాపు 40 శాతం విద్యుత్‌ను అందిస్తోంది. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల యూనిట్, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్లు విద్యుత్ వాణిజ్య ఉత్పత్తి ఈ ఏడాది ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకి 78.677 మిలియన్ యూనిట్ల విద్యుత్ జెన్కో థర్మల్ యూనిట్ల నుంచి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికి కొరత రాకుండా బొగ్గు సమకూర్చుకుంటున్నాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీజెన్కో -
ర్యాక్‌లు కొనుక్కోండి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పలు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఖాళీ అయ్యాయి. బొగ్గు రవాణాలో జాప్యం కారణంగా రోజువారీ అవసరాలకు సరిపడా మాత్రమే బొటాబొటిగా అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం సరుకు రవాణా రైళ్లకు నెలకొన్న డిమాండ్ దృష్ట్యా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బొగ్గు తరలింపు కోసం కనీసం 10 రైల్వే ర్యాక్‌లను సొంతంగా కొనుగోలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల సెప్టెంబర్ వరకూ విద్యుదుత్పత్తి సాఫీగా సాగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. అయితే ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా పెనుభారంగా మారుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 70 ర్యాక్‌లు నిల్వ ఉంచండి.. కొరత దృష్ట్యా కనీసం 70 ర్యాక్‌ల బొగ్గును నిల్వ ఉంచాలని ఎన్టీపీసీ లిమిటెడ్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలకు కేంద్ర విద్యుత్ శాఖ లేఖలు రాసింది. బొగ్గు తరలింపు కోసం పూర్తిగా రైల్వేలపై ఆధారపడొద్దని లేఖలో పేర్కొంది. ఇదీ పరిస్థితి.. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తెలంగాణలోని సింగరేణి కాలరీస్, ఒడిశాలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. రెండు చోట్లా కలిపి రోజూ దాదాపు 10 నుంచి 12 ర్యాక్‌ల బొగ్గు వస్తోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా అక్కడ ప్రస్తుతం 98,566 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇవి సుమారు 3, 4 రోజులకు సరిపోతాయి. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్(కృష్ణపట్నం)లో రోజుకి 19 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగిస్తుండగా 2,99,947 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. దీంతో దాదాపు 15 రోజుల పాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 21,000 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇక్కడ ప్రస్తుతం కేవలం 7,997 మెట్రిక్ టన్నులే ఉంది. వర్షాకాలం కావడంతో డిమాండ్ తగ్గి రోజుకు 196.27 మిలియన్ యూనిట్లు మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతోంది. హిందూజా పవర్ ప్లాంట్ నుంచి కూడా రాష్ట్రానికి విద్యుత్ అందుతోంది. ఇక్కడ రోజుకి 9,600 మెట్రిక్ టన్నులు బొగ్గు వినియోగిస్తుండగా ప్రస్తుతం 30,917 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ నిల్వతో మూడు రోజులు విద్యుదుత్పత్తి చేయవచ్చు. బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు 20 ర్యాక్‌ల వరకూ కేటాయింపులు పెంచాలని ఏపీ జెన్కో కోరుతోంది. పెరిగిన ఉత్పత్తి, డిమాండ్ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి 27 శాతం పెరిగింది. గతేడాది జూన్ నాటికి 12,428.41 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా ఈ ఏడాది జూన్ నాటికి 15,913.37 మిలియన్ యూనిట్లకు పెరిగింది. మరోవైపు దీనికి తగ్గట్లు బొగ్గుకు డిమాండ్ ఏర్పడింది. ఆర్థికంగా భారమే.. ‘ర్యాక్‌లు సొంతంగా కొనుగోలు చేసుకోవాలని కేంద్రం గతంలోనూ చెప్పింది. సొంతంగా ర్యాక్‌లు కొనుగోలు చేస్తే రవాణా ఖర్చుల్లో దాదాపు 10 శాతం రాయితీ కూడా అందిస్తామంటోంది. అయితే ఇదేమీ తప్పనిసరి కాదు. ర్యాక్‌లను కొనుగోలు చేయడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. వాటి నిర్వహణ మరింత భారంగా మారుతుంది. ప్రభుత్వ రంగ థర్మల్ కేంద్రాలు సొంతంగా ర్యాక్‌లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కేంద్రం సూచన మేరకు బొగ్గు దిగుమతి చేసుకునే ప్రైవేట్ సంస్థలు ర్యాక్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉంది’ –బి.శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం
ఎండవేడిమి పెరిగిపోతోంది. ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం ఎక్కువైపోయింది. కరోనా అదుపులోనికి రావడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో విద్యుత్ వాడకం ఎక్కవైపోయింది. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లయ్ చేయడానికి థర్మల్ కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా కోల్ ఇండియా దగ్గర సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ కేంద్రంలో శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు ఉక్కబోత, విద్యుత్ కోతతో జనాలు అల్లాడిపోవాల్సిందే. దేశంలోని విద్యుత్ అవసరాలను 70% థర్మల్ పవర్ కేంద్రాలే తీరుస్తూ ఉంటే ఆయా కేంద్రాల్లో బొగ్గుకి కొరత ఏర్పడడంతో చాలా రాష్ట్రాలు పవర్ కట్లు విధిస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, బిహార్ జమ్మూ కశ్మీర్, తమిళనాడు, కర్ణాటకలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విద్యుత్ కోతల ప్రభావం పరిశ్రమలపై పడి ఆర్థిక రంగం కూడా కుదేలైపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. వేసవికాలం కావడంతో హఠాత్తుగా దేశవ్యాప్తంగా పెరిగిపోయిన విద్యుత్ వినియోగంతో పాటు బొగ్గు పంపిణీలో లోపాలు సమస్యని మరింత పెంచాయి. విద్యుత్‌కి డిమాండ్ ఎలా పెరిగింది ? ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు విద్యుత్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్నాళ్లూ రోజుకి సగటున 187 గిగావాట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉంటే ఏప్రిల్ 1–12 తేదీ మధ్యలో సగటున రోజుకి 194 గిగావాట్లకు పెరిగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో రోజుకి ఎనిమిది గంటలు విద్యుత్ కోతలు విధించే పరిస్థితులు వచ్చాయి. బొగ్గు కొరత ఎలా ఉంది ? దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రాను రాను బొగ్గుకి కొరత ఏర్పడింది. నేçషనల్ పవర్ పోర్టల్ గణాంకాల ప్రకారం ఇంపోర్టెడ్ కోల్ బేస్డ్ (ఐసీబీ) విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పాతాళానికి పడిపోయాయి. అదే విధంగా 79 దేశీయ పవర్ ప్లాంట్లు కూడా తీవ్ర బొగ్గు కొరతని ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ 19 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 700కిపైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2.2 కోట్ల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇవి కేవలం తొమ్మిది రోజులకే సరిపోతాయి. శాఖల మధ్య సమన్వయ లోపం గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారీ వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు నిలిచిపోవడంతో దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు బొగ్గు తవ్వకాలు సమృద్ధిగా జరుగుతున్నప్పటికీ కేంద్రంలోని శాఖల మధ్య సమన్వయ లోపమే దేశంలో విద్యుత్ కోతలకి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ మొదట్లో కోల్ ఇండియా 27% అదనంగా బొగ్గు తవ్వకాలు జరిపింది. విద్యుత్, బొగ్గు గనులు, రైల్వే శాఖ అధికారులతో కూడిన ఒక అంతర్గత కమిటీ బొగ్గు పంపిణీ వ్యవహారాలు చూస్తుంది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ బొగ్గు పంపిణీకి సరిపడనంత రాక్స్‌ని కేటాయించడం లేదని ఆరోపిస్తూ ఉంటే, లోడింగ్, అన్‌లోడింగ్‌లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అవకతవకలకు పాల్పడుతోందని రైల్వే శాఖ ఎదురుదాడికి దిగింది. ► థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 17 నుంచి 26 రోజులకు సరిపడే నిల్వలుంటేనే అవి పూర్తయ్యేలోగా తిరిగి బొగ్గు నిల్వలు చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం తొమ్మిది రోజులకి సరిపడా నిల్వలు మాత్రమే ఉండడం ఆందోళనకరంగా మారింది. ► ప్రతిరోజూ రైల్వే శాఖ 453 రాక్స్‌ను కేటాయిస్తేనే విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు సరిపడా బొగ్గు పంపిణీ సాధ్యమవుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కేవలం 412 రాక్స్ ద్వారా మాత్రమే బొగ్గుని పంపిణీ చేస్తూ ఉండడంతో కొరతకి దారి తీసింది. ► ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, హరియాణాలలో బొగ్గు నిల్వలు కేవలం ఆరు రోజులకు సరిపడా ఉన్నాయని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే వెల్లడించారు. ► రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఇన్నాళ్లుగా టన్ను బొగ్గుకి 100 డాలర్లు ఇస్తే, ఇప్పుడు అది ఏకంగా 300 డాలర్లకు చేరుకుంది. ► విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుని వాడే విద్యుత్ ప్లాంట్లలో 6.6 కోట్ల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం 2.2 కోట్ల టన్నులు మాత్రమే ఉంది. ► విదేశీ బొగ్గు కొరతని అధిగమించడానికి కేంద్రం రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకి బొగ్గుని దిగుమతి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రపంచంలో బొగ్గు ఎగుమతుల్లో మూడో స్థానంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో యూరప్ దేశాలు బొగ్గు దిగుమతులపై నిషేధం విధించారు. దీంతో భారత్ రష్యా నుంచి బొగ్గుని దిగుమతి చేసుకొని సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రిలయన్స్ సీబీఎం గ్యాస్‌కు 23 డాలర్ల రేటు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని బొగ్గు క్షేత్రం నుంచి ఉత్పత్తి చేసే కోల్–బెడ్ మీథేన్ (సీబీఎం) గ్యాస్‌ను యూనిట్‌కు (ఎంబీటీయూ) 23 డాలర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ విక్రయించింది. ఈ రేటుకు 0.65 ఎంసీఎండీ (రోజుకు మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లు) మేర గ్యాస్‌ను గెయిల్, జీఎస్పీసీ, షెల్ తదితర సంస్థలకు సరఫరా చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రెంట్ క్రూడాయిల్ బేస్ ధరకు 13.2 శాతం ప్రీమియంతో రిలయన్స్ బిడ్లను ఆహ్వానించింది. దీని ప్రకారం ఎంబీటీయుకి బేస్ ధర 15.18 డాలర్లుగా నిర్ణయించగా, గెయిల్ తదితర సంస్థలు మరో 8.28 డాలర్ల ప్రీమియం కోట్ చేయడంతో తుది ధర 23.46 డాలర్లకు చేరింది. మరోవైపు, హిందుస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ (హెచ్వోఈసీ) తమ గ్యాస్‌ను యూనిట్‌కు 25.3 డాలర్లకు విక్రయించింది. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్పీసీ) ఈ రేటుకు 0.3 ఎంసీఎండీని కొనుగోలు చేసింది. -
సింగరేణిలో కొత్త ఓసీపీ
గోదావరిఖని: సింగరేణిలో శనివారం మరో ఓపెన్ కాస్ట్‌గని (ఓసీపీ) ప్రారంభం కానుంది. పెద్దపల్లి జిల్లాలోని ఈ గనిలో 33 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. 11 సంవత్సరాల పాటు ఏటా 3 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీయనున్నారు. రూ.471 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అధికారులు ప్రభావిత గ్రామాలైన సుందిళ్ల, ముస్త్యాల, జనగామల్లో ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేశారు. ఇప్పటికే ఓబీ పనులు ప్రారంభమయ్యాయి. సంస్థలో ప్రస్తుతం 18 ఓసీపీలు ఉన్నాయి. కొత్త ఓసీపీ ఏర్పాటుతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు చేతులమీదుగా గనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా ఓసీపీలో పేలుళ్ల కారణంగా ఇబ్బందులు వస్తాయని, అలాగే భూగర్భ జలాలు అడుగంటి పోతాయనే ఆందోళన ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో నెలకొంది. కాగా, సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
రాష్ట్రంలో ఇక బొగ్గు తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో అత్యధికంగా బొగ్గు నిల్వలున్న చింతలపూడి సెక్టార్–1, కృష్ణా జిల్లాలోని సోమవరం వెస్ట్ బ్లాక్‌లో తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర బొగ్గు గనుల శాఖ.. సెక్టార్–1, సోమవరం వెస్ట్ బ్లాక్‌లను వేలం వేసేందుకు వీలుగా బిడ్లను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 99 బొగ్గు బ్లాక్‌ల వేలానికి బిడ్లు ఆహ్వానించగా వాటిలో ఏపీకి చెందిన ఈ రెండు ఉన్నాయి. విభజనతో ఏపీ కోల్పోయిన సింగరేణి బొగ్గు లోటును చింతలపూడి తీర్చనుంది. అత్యంత నాణ్యమైన బొగ్గు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు సర్వేల్లో స్పష్టమైంది. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, కృష్ణా బేసిన్లో అపారమైన బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో బొగ్గు నిల్వల కోసం సుదీర్ఘకాలం సర్వేలు, పరిశోధనలు జరిగాయి. 1964 నుంచి 2006 వరకు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడితో పాటు.. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, తడికలపూడి ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 1996–2001 మధ్య కాలంలో ఖనిజాన్వేషణ సంస్థ సర్వే నిర్వహించి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో బొగ్గు నిల్వలున్నట్టు నిర్ధారించింది. తక్కువ లోతులో.. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 3,000 మిలియన్ టన్నుల నాణ్యమైన డీ, ఎఫ్ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అది కూడా భూ ఉపరితలానికి 200 నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నట్టు తేల్చింది. చింతలపూడిలో 300 మిలియన్ టన్నులు, రాఘవాపురంలో 997 మిలియన్ టన్నులు, సోమవరంలో 746 మిలియన్ టన్నులున్నట్టు నిర్ధారించింది. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో పుష్కలంగా బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి మండలం గురుభట్లగూడెం, రాఘవాపురం చుట్టు పక్కల గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు 1,000 అడుగుల మందంలో, వెంకటాపురం, నామవరం, సుబ్బారాయుడుగూడెం గ్రామాల్లో 70 అడుగుల లోతులో నాణ్యమైన బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి సెక్టార్–1.. పట్టాయిగూడెం, నామవరం, వెంకటాద్రిగూడెం, లక్ష్మీనారాయణపురం తదితర గ్రామాల్లో సుమారు 12.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే సోమవరం వెస్ట్ కోల్ బ్లాక్.. చాట్రాయి మండలం సూర్యాపల్లి, చెక్కపల్లి, అక్కిరెడ్డిగూడెం, రమణక్కపేట పరిధిలో 15.11 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వేలానికి బ్లాక్‌లు ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశంలోని వివిధ బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వేలం వేస్తోంది. దీని కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో కృష్ణా జిల్లా సోమవరం బ్లాక్‌ను కూడా వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. బిడ్లు దాఖలు కాకపోవడంతో సోమవరం బ్లాక్ కేటాయింపులు జరగలేదు. ఈ క్రమంలో మళ్లీ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఈ నెల 16న దేశంలోని 99 బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో చింతలపూడి సెక్టార్–1తో పాటు సోమవరం వెస్ట్ బ్లాక్‌ను కూడా చేర్చింది. బొగ్గు మైనింగ్‌పై వచ్చే రెవెన్యూలో వాటా ఆధారంగా వేలం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేస్తారు. -
రాష్ట్రంలో పెరిగిన బొగ్గు నిల్వలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు మెరుగుపడ్డాయి. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 52,800 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఇది నాలుగు రోజుల ఉత్పత్తికి సరిపోతుంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్న 35,300 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక రోజుకే సరిపోతున్నప్పటికీ.. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో 76 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండటంతో ఇక్కడ ఐదు రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి ఆటంకం లేకుండా జరపవచ్చు. ప్రతిరోజూ దాదాపు 22 ర్యాకుల బొగ్గు రాష్ట్రానికి వస్తుండగా.. మరికొంత నిల్వలు జత చేరుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి బొగ్గు కొరత చాలావరకూ తగ్గినట్టేనని ఏపీ జెన్కో అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి, ఇతర మార్గాల్లో భవిష్యత్ అవసరాల కోసం దాదాపు 10 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు. ఏపీ జెన్కో భాగస్వామ్యం 36 శాతం 2020–21 ఆర్థిక సంవత్సరంలో గ్రిడ్ వినియోగం 62,080 మిలియన్ యూనిట్లు. అంటే రోజుకి సగటున 170 మిలియన్ యూనిట్లు. ఇందులో ఏపీ జెన్కో 35 శాతం విద్యుత్‌ను అందించింది. ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో 71,252 మిలియన్ యూనిట్ల గ్రిడ్ డిమాండ్ ఉంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది. ఇది రోజువారీగా చూస్తే సగటున 195 మిలియన్ యూనిట్లు. ఇందులో గత సెప్టెంబర్ వరకూ ఏపీ జెన్కో 90 మిలియన్ యూనిట్లు (46 శాతం) సమకూర్చేది. తరువాత బొగ్గు కొరత ఏర్పడి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఇబ్బందులు తలెత్తడంతో జెన్కో భాగస్వామ్యం తగ్గింది. ప్రస్తుతం 36 శాతం విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు ఏపీ జెన్కో అందించగలుగుతోందని ఇంధన శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనూ మెరుగుపడుతోంది బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా మూతపడ్డ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. విద్యుత్ ఉత్పతి రంగాలకు మినహా ఇతర అవసరాలకు ఇప్పటికే బొగ్గు సరఫరా నిలిపివేసిన కేంద్రం, పరిస్థితి పూర్తిగా మెరుగుపడకపోవడంతో ఇంకా సరఫరా పునరుద్ధరించలేదు. మరోవైపు కోల్ ఇండియా లిమిడెడ్ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరా మొదలుపెట్టడంతో పాటు విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖల కేంద్ర మంత్రులు స్వయంగా ప్రతిరోజూ థర్మల్ కేంద్రాలకు బొగ్గు కేటాయింపులు జరుపుతున్నారు. మొత్తం 135 థర్మల్ కేంద్రాల్లో 93 కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. వీటిలో 14 కేంద్రాల్లో ఒక రోజు, 23 కేంద్రాల్లో రెండు రోజులు, 15 కేంద్రాల్లో 3 రోజులు, 16 కేంద్రాల్లో 4 రోజులు, 12 కేంద్రాల్లో 5 రోజులు, 12 కేంద్రాల్లో 6 రోజులు, ఒక కేంద్రంలో 7 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. 8 కేంద్రాలు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. అన్ని కేంద్రాలకు ఎంతోకొంత బొగ్గు అందించేలా కేంద్ర విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖ మంత్రులు నేరుగా పంపకాలు చేపడుతున్నట్టు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. సొంత బొగ్గు గనులున్న 16 కేంద్రాల్లో ప్రస్తుతానికి 6 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. వీటినుంచే ఇతర కేంద్రాలకు సర్దుబాటు చేస్తుండటంతో ఎక్కడా ఆరేడు రోజులకు మించి నిల్వలు ఉండటం లేదు. గతంలో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు దిగుమతి చేసుకుని నిల్వ ఉంచే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రస్తుతం ఆ అవకాశాన్ని కేంద్రం ఇవ్వడం లేదు. ఏడు రోజులకు మించి ఎక్కడైనా నిల్వలు ఉంటే వాటిని ఇతర ప్లాంట్లకు మంత్రుల సూచనలతో అధికారులు తరలిస్తున్నారు. -
అవన్నీ అనవసరమైన భయాందోళనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వస్తుందని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పలు రాష్ట్రాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సంక్షోభ నివారణకు కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా అవసరమైన అన్ని వనరులు వినియోగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.కె.సింగ్ ఎన్టీపీసీ, రిలయెన్స్ ఎనర్జీ సహా వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సరఫరా కంపెనీలు, విద్యుత్ అధికారులతో ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్‌కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు. సమాచార లోపమే కారణం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), ఢిల్లీలోని డిస్కమ్‌ల మధ్య సమాచార లోపం వల్లే అనవసర ఆందోళనలు తలెత్తాయని చెప్పారు. ఢిల్లీ డిస్కమ్‌లకి, గెయిల్‌కి మధ్య కాంట్రాక్టు పూర్తి అయిపోవడంతో ఇక గ్యాస్ సప్లయ్ చేయలేమని గెయిల్ రాసిన లేఖతో విద్యుత్ ప్రమాదం ముంచుకొస్తోందన్న భయం తలెత్తి ఉండవచ్చునని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖపై లెఫ్ట్‌నెంట్ జనరల్ నాతో మాట్లాడారు. అలాంటి పరిస్థితి రాదని వాళ్లకి చెప్పాను. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే గ్యాస్ సరఫరా చేయమని గెయిల్ సీఎండీని ఆదేశించాం. సరఫరా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు’అని మంత్రి తెలిపారు. బొగ్గు గనులున్న ప్రాంతాల్లో భారీ వర్షాలతో తవ్వకాలు నిలిచిపోవడం, సరఫరా మందగించడం, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరగడంతో భరించలేని కంపెనీలు ఉత్పత్తిపై చేతులెత్తేస్తున్నాయి. గుజరాత్లో టాటా పవర్ ఉత్పత్తి నిలిపివేత విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపైనే ఆధారపడిన టాటా పవర్ అధిక ధరలకు బొగ్గు కొనలేక గుజరాత్‌లోని ముంద్రా ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపేసింది. ఈ ప్లాంటు ద్వారా గుజరాత్‌కు 1,850 మెగావాట్లు, పంజాబ్‌కు 475, రాజస్తాన్‌కు 380, మహారాష్ట్రకు 760, హరియాణాకు 380 మెగావాట్లు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయంటే.. బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ, క్యాప్టివ్ కోల్‌మైన్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అన్నీ కలుపుకుంటే అక్టోబర్ 9న మొత్తంగా 19.2 లక్షల టన్నులు సరఫరా చేస్తే , విద్యుత్ ప్లాంట్లలో 18.7 లక్షల టన్నులు వినియోగించారు. అంటే వినియోగానికి మించి సరఫరా ఉందని, కొన్ని రోజులు గడిస్తే బొగ్గు నిల్వలు పెరుగుతాయని విద్యుత్ శాఖ వెల్లడించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా 72 లక్షల టన్నులున్నాయని, ఇవి నాలుగు రోజులకి సరిపోతాయని పేర్కొంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) దగ్గర 400 లక్షల టన్నుల స్టాకు ఉందని, విద్యుత్ ప్లాంట్లకు దానిని సరఫరా చేస్తున్నట్టుగా వివరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకి రోజుకి 18.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం రోజుకి 17.5 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నామని, వర్షాల కారణంగా పంపిణీ కాస్త నెమ్మదించిందని అంగీకరించింది. గత ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు దేశీయంగా లభించే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి 24 శాతం పెరిగిందని వివరించింది. అప్పట్లో ఆక్సిజన్‌కూ కొరత లేదన్నారు: సిసోడియా కేంద్రం ప్రతీ సమస్యని తేలిగ్గా తీసుకుంటోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. బొగ్గు సంక్షోభం తరుముకొస్తున్నా ఏమీ లేదని అంటోందని మండిపడ్డారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆస్పత్రులు, డాక్టర్లు ఆక్సిజన్‌కి కొరత ఉందని మొరపెట్టుకున్నా అలాంటిదేమీ లేదని మభ్యపెట్టిందని, ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసరంగా లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే. సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో సిసోడియా విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర విద్యుత్ మంత్రి బొగ్గుకి కొరత లేదని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధానికి అలా లేఖ రాసి ఉండకూడదని కూడా అన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఆయన చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’’అని సిసోడియా అన్నారు. సమస్య నుంచి పారిపోవాలని కేంద్రం భావిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతని, ఇప్పటి బొగ్గు సమస్యతో పోలుస్తూ కేంద్రంపై సిసోడియా విరుచుకుపడ్డారు. -
‘థర్మల్’కు డిమాండ్
సాక్షి, అమరావతి: ఏపీ జెన్కో ముందస్తు వ్యూహం ఇప్పుడు మంచి ఫలితాన్నిస్తోంది. పవన, సౌర విద్యుదుత్పత్తి పడిపోయినప్పటికీ విద్యుత్ సరఫరాలో జెన్కో కీలకపాత్ర పోషిస్తోంది. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలతో అన్ని యూనిట్లనూ క్రమంగా ఉత్పత్తిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందించేందుకు జెన్కో సన్నద్ధమవుతోంది. ఏం జరుగుతోంది? ► గత మూడు రోజులుగా వాతావరణం మారడంతో పవన, సౌర విద్యుదుత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఇవి రెండూ కలిపి 7 వేల మెగావాట్ల ఉత్పత్తి చేస్తుండగా మూడు రోజులుగా క్రమంగా తగ్గుతోంది. మంగళవారం 1,900 మెగావాట్లకే పరిమితమైంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల సౌరశక్తి, గాలి లేకపోవడం వల్ల పవన విద్యుదుత్పత్తి పడిపోయింది. ► రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజుకు 9 వేల మెగావాట్ల నుంచి 7 వేలకు తగ్గింది. అయితే విండ్, సోలార్ పడిపోవడంతో విద్యుత్ సరఫరాలో క్లిష్ట పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలను ముందే ఊహించిన లోడ్ డిస్పాచ్ సెంటర్ ఏపీ జెన్కోను అప్రమత్తం చేసింది. ► కొంతకాలంగా నిలిపివేసిన కృష్ణపట్నం, వీటీపీఎస్, ఆర్టీపీపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలను క్రమంగా ఉత్పత్తిలోకి తెచ్చారు. ప్రస్తుతం ఏపీ జెన్కో 4,500 మెగావాట్లకుగానూ 2 వేల మెగావాట్ల వరకు ఉత్పత్తిలోకి తెచ్చింది. ఇతర విద్యుత్ లభ్యత తగ్గితే తక్షణమే ఉత్పత్తి పెంచగల సమర్థత జెన్కోకు ఉందని అధికారులు తెలిపారు. బొగ్గు నిల్వలు పుష్కలం.. ► ఏపీ జెన్కో వద్ద ప్రస్తుతం 15 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. అన్ని థర్మల్ ప్లాంట్లకు కలిపి రోజుకు 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. దీన్నిబట్టి మూడు వారాలకు సరిపడా బొగ్గు అందుబాటులో ఉంది. రోజూ గనుల నుంచి బొగ్గు అందుతోంది. ► లాక్డౌన్ కాలంలో విద్యుత్ డిమాండ్ తగ్గడంతో పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వాడకం పూర్తిగా ఆగిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ లభించింది. ఈ సమయంలోనే జెన్కో అప్రమత్తమైంది. ఉత్పత్తిని నిలిపివేసి బొగ్గు నిల్వలు పెంచుకుంది. ప్లాంట్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టింది. ముందుచూపుతో వ్యవహరించడం ఇప్పుడు కలసి వస్తోంది. ► మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. క్రమంగా వ్యవసాయ విద్యుత్ వాడకం పెరిగే వీలుంది. అయినప్పటికీ ఎక్కడా చిన్న అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు జెన్కో ముందస్తు వ్యూహాలు ఉపకరిస్తున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. వర్షాకాలంలో బొగ్గు వెలికితీత, రవాణా కష్టమైనప్పటికీ నిరంతరాయంగా విద్యుదుత్పత్తికి జెన్కో సిద్ధమైందని పేర్కొంటున్నారు. -
ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో లాభదాయక బొగ్గు నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 6 నుంచి 10 బ్లాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. వీటిని కేటాయిస్తే రానున్న ఐదేళ్లలో సింగరేణి ఏడాదికి 85 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో గుర్తింపు కార్మిక సంఘం నేతలతో జరిగిన 37వ సీఎండీ స్థాయి స్ట్రక్చర్డ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడతూ రానున్న 5 ఏళ్ల కాలంలో బొగ్గు పరిశ్రమ కొత్త సవాళ్లను ఎదుర్కోనుందని, 50కి పైగా ప్రైవేటు బొగ్గు సంస్థలతో సింగరేణి, కోలిండియా సంస్థలు పోటీ పడాల్సి వస్తుందని అన్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గించుకుంటేనే మార్కెట్లో నిలబడి మనుగడ సాధించగలమని తెలిపారు. సింగరేణి సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్‌తోపాటు సోలార్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయడానికి రంగం సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా 130 మెగావాట్లు, వచ్చే ఏడాది మరో 80 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేశామన్నారు. సంస్థ మనుగడ, వృద్ధికి సహకరించాలి.. కార్మికులకు కంపెనీకి సంబంధించిన వాస్తవాలు వివరించాలని, తద్వారా నిర్మాణాత్మక ఆలోచనలతో కంపెనీని ముందుకు తీసుకుపోవాలని కార్మికులకు, కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై ఎప్పుడూ సానుకూల వైఖరితోనే ఉంటుందన్నారు. గత ఐదేళ్లలో అనేక దీర్ఘకాలిక సమస్యలపై పలు చారిత్రక ఒప్పందాలు చేసుకుని అమలు చేసిందని తెలిపారు. ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గుర్తింపు కార్మిక సంఘంతో కొత్త కేడర్ స్కీం, బదిలీ రెగ్యులరైజేషన్, అలవెన్సుల పెంపుదల వంటి వాటిపై చారి త్రక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఒప్పం దాల్లో అన్ని అంశాలు వెంటనే అమలు చేశామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే మెడికల్ బోర్డు ద్వారా అన్‌ఫిట్ అయిన కార్మికుల వారసులు దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలిచ్చామని తెలి పారు. సీఎండీ ముందు డిమాండ్లు.. గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు, జనరల్ సెక్రటరీ మిరియాల రాజి రెడ్డి మాట్లాడుతూ దేశంలో నంబర్ 1గా నిలిచిన సింగరేణిని ఇలాగే ముందుకు తీసుకెళ్లడంలో కార్మికులను సమాయత్తం చేస్తామన్నారు. పెర్కు మీద ఇన్‌కంటాక్స్ రీయింబర్స్మెంట్, సర్ఫేస్కు అన్‌ఫిట్ మీద వచ్చిన ఉద్యోగులకు డిపెండెంట్ ఉద్యోగాల అవకాశం, సీపీఆర్ఎంఎస్ స్కీంకు డబ్బు చెల్లింపును కార్మికుడి ఇష్టానికి వదిలేయడం వంటి డిమాండ్లను కార్మిక నాయకులు వినిపించారు. -
బొగ్గు బుగ్గి
► 5 లక్షల టన్నులకుపైగా అగ్నికి ఆహుతి ► సింగరేణికి రూ.125 కోట్లకు పైగా నష్టం ► యూర్డుల వద్ద 64 లక్షల టన్నుల నిల్వలు ► నిల్వ కేంద్రాలలో కాలిపోతున్న నల్ల బంగారం ► ఏరియూల్లో ఉత్పత్తి తగ్గించిన యాజమాన్యం గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో బొగ్గు నిల్వలు భారీగా పేరుకుపోయా యి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టినప్పటికీ దానిని వినియోగదారులకు రవాణా చేయకపోవడంతో నిల్వలు పెరిగిపోయాయి. విదేశాల నుంచి నాణ్యమైన బొగ్గు చౌకగా లభించడం.. సింగరేణి బొగ్గులో బూడిద శాతం ఎక్కువగా ఉండడం వల్ల సిమెంట్, విద్యుత్ పరిశ్రమలు సింగరేణి బొగ్గు వినియోగించడానికి వెనకంజ వేశాయి. దీంతో రైల్వే నుంచి వ్యాగన్లు రాక నిల్వలు పెరిగిపోయూరుు. దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నెలలో నిర్దేశించిన లక్ష్యం కన్నా తక్కువ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. కంపెనీ వ్యాప్తంగా బొగ్గు నిల్వలను పరిశీలిస్తే.. గురువారం నాటికి ఇల్లెందు ఏరియూలో 3.77 లక్షల టన్నులు, మణుగూరులో 9.60లక్షల టన్నులు, బెల్లంపల్లి లో 3.50 లక్షల టన్నులు, మందమర్రిలో 6.53 లక్షల టన్ను లు, శ్రీరాంపూర్‌లో 5.60 లక్షల టన్నులు, ఆర్జీ-1లో 7.94 లక్షల టన్నులు, ఆర్జీ-2లో 12.90 లక్షల టన్నులు, ఆర్జీ-3 ఏరియాలో 3.50 లక్షల టన్నులు, భూపాలపల్లిలో 9.95 లక్షల టన్నులు, అడ్రియాల ప్రాజెక్టులో 99వేల టన్నులు మొత్తం 64.28 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయాయి. బూడిదవుతున్న బొగ్గు బొగ్గు వెలికితీసిన వెంటనే రవాణా చేయాల్సి ఉంటుంది. గని లేక ప్రాజెక్టుల ఉపరితలంలో నిల్వ చేసిన బొగ్గు ముక్కలకు మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడి అందులోకి గాలిలో ఉన్న ఆక్సిజన్ చేరుతుంది. దానికి బొగ్గులో ఉన్న కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు వేడి చేరి బొగ్గు మండుతుంది. ఈ పరిస్థితి ప్రతి సీజన్లో ఉంటుంది. వేసవి కాలంలో మాత్రం వేడి ఎక్కువ గా ఉండడంతో ఇక్యూబేషన్(బొగ్గును నెమ్మదిగా మం డిం చే) పీరియడ్ తక్కువగా ఉండి త్వరగా బొగ్గు కాలిపోతుంది. ప్రస్తుత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిల్వ బొగ్గులో సుమారు 8 శాతం వరకు కాలిపోతున్నట్లు అధికారులు అంచనా వేశారు. అంటే 5 లక్షలకు పైగా టన్నుల బొగ్గు అగ్నికి ఆహుతవుతున్నట్టు తెలుస్తోంది. టన్నుకు సుమారు రూ.2,500 ధర నిర్ణయిస్తే రూ.125 కోట్లకు పైగా విలువైన నల్లబంగారం కాలిపోతున్నట్లు స్పష్టమవుతోంది. తగ్గిన ఉత్పత్తి వేగం బొగ్గు నిల్వలు అగ్నికి ఆహుతవుతుండడంతో యాజమాన్యం ఏప్రిల్ ప్రారంభం నుంచే ఉత్పత్తి వేగాన్ని తగ్గించింది. గడిచిన 20 రోజులలో కంపెనీ వ్యాప్తంగా 33.61 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 28.98 లక్షల టన్నులు మాత్రమే వెలికితీశారు. రానున్న రోజుల్లో నిల్వ కేంద్రాలలోని బొగ్గును రవాణా చేయకుండా దానిపైనే ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న బొగ్గు పోస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. -
బొగ్గు బుగ్గి
5 లక్షల టన్నులకుపైగా అగ్నికి ఆహుతి సింగరేణికి రూ.125 కోట్లకు పైగా నష్టం యూర్డుల వద్ద 64 లక్షల టన్నుల నిల్వలు నిల్వ కేంద్రాలలో కాలిపోతున్న నల్ల బంగారం ఏరియూల్లో ఉత్పత్తి తగ్గించిన యాజమాన్యం గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో బొగ్గు నిల్వలు భారీగా పేరుకుపోయా యి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టినప్పటికీ దానిని వినియోగదారులకు రవాణా చేయకపోవడంతో నిల్వలు పెరిగిపోయాయి. విదేశాల నుంచి నాణ్యమైన బొగ్గు చౌకగా లభించడం.. సింగరేణి బొగ్గులో బూడిద శాతం ఎక్కువగా ఉండడం వల్ల సిమెంట్, విద్యుత్ పరిశ్రమలు సింగరేణి బొగ్గు వినియోగించడానికి వెనకంజ వేశాయి. దీంతో రైల్వే నుంచి వ్యాగన్లు రాక నిల్వలు పెరిగిపోయూరుు. దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నెలలో నిర్దేశించిన లక్ష్యం కన్నా తక్కువ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. కంపెనీ వ్యాప్తంగా బొగ్గు నిల్వలను పరిశీలిస్తే.. గురువారం నాటికి ఇల్లెందు ఏరియూలో 3.77 లక్షల టన్నులు, మణుగూరులో 9.60లక్షల టన్నులు, బెల్లంపల్లి లో 3.50 లక్షల టన్నులు, మందమర్రిలో 6.53 లక్షల టన్ను లు, శ్రీరాంపూర్‌లో 5.60 లక్షల టన్నులు, ఆర్జీ-1లో 7.94 లక్షల టన్నులు, ఆర్జీ-2లో 12.90 లక్షల టన్నులు, ఆర్జీ-3 ఏరియాలో 3.50 లక్షల టన్నులు, భూపాలపల్లిలో 9.95 లక్షల టన్నులు, అడ్రియాల ప్రాజెక్టులో 99వేల టన్నులు మొత్తం 64.28 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయాయి. బూడిదవుతున్న బొగ్గు బొగ్గు వెలికితీసిన వెంటనే రవాణా చేయాల్సి ఉంటుంది. గని లేక ప్రాజెక్టుల ఉపరితలంలో నిల్వ చేసిన బొగ్గు ముక్కలకు మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడి అందులోకి గాలిలో ఉన్న ఆక్సిజన్ చేరుతుంది. దానికి బొగ్గులో ఉన్న కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు వేడి చేరి బొగ్గు మండుతుంది. ఈ పరిస్థితి ప్రతి సీజన్లో ఉంటుంది. వేసవి కాలంలో మాత్రం వేడి ఎక్కువ గా ఉండడంతో ఇక్యూబేషన్(బొగ్గును నెమ్మదిగా మం డిం చే) పీరియడ్ తక్కువగా ఉండి త్వరగా బొగ్గు కాలిపోతుంది. ప్రస్తుత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిల్వ బొగ్గులో సుమారు 8 శాతం వరకు కాలిపోతున్నట్లు అధికారులు అంచనా వేశారు. అంటే 5 లక్షలకు పైగా టన్నుల బొగ్గు అగ్నికి ఆహుతవుతున్నట్టు తెలుస్తోంది. టన్నుకు సుమారు రూ.2,500 ధర నిర్ణయిస్తే రూ.125 కోట్లకు పైగా విలువైన నల్లబంగారం కాలిపోతున్నట్లు స్పష్టమవుతోంది. తగ్గిన ఉత్పత్తి వేగం బొగ్గు నిల్వలు అగ్నికి ఆహుతవుతుండడంతో యాజమాన్యం ఏప్రిల్ ప్రారంభం నుంచే ఉత్పత్తి వేగాన్ని తగ్గించింది. గడిచిన 20 రోజులలో కంపెనీ వ్యాప్తంగా 33.61 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 28.98 లక్షల టన్నులు మాత్రమే వెలికితీశారు. రానున్న రోజుల్లో నిల్వ కేంద్రాలలోని బొగ్గును రవాణా చేయకుండా దానిపైనే ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న బొగ్గు పోస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. -
జీడీకే-3 మూసివేతకు నిర్ణయం
పూర్తయిన బొగ్గు నిల్వలు ఐదు దశాబ్దాల పాటు సాగిన బొగ్గు ఉత్పత్తి గోదావరిఖని :సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాల్లో 1962లో ప్రారంభించిన జీడీకే-3వ గనిని మూసివేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. మరో రెండు మూడు రోజుల్లో ఈ గనిలో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిపివేయనున్నారు. ఇప్పటికే రెండు ఎస్డీఎల్ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసిన యాజమాన్యం వాటిని బయటకు తీసుకువస్తోంది. గతంలో ఆర్జీ-1 ప్రాంతంలో జీడీకే 6, జీడీకే 6ఏ, జీడీకే 6బీ, జీడీకే 5ఏ గనులను మూసివేయగా...వాటి జాబితాలోకి జీడీకే 3వ గని చేరనున్నది. గోదావరి పరివాహక ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు గుర్తించిన అనంతరం రెండో దశలో భాగంగా మూడో గనిని ప్రారంభించారు. గడిచిన 54 ఏళ్లలో ఒకటో పొర, రెండో పొరల్లో నిక్షిప్తమైన 7.6 మిలియన్ టన్నుల బొగ్గును ఈ గని ఉత్పత్తి చేశారు. గనిలో గడిచిన మూడేళ్ల వరకు పూర్తిగా తట్టా చెమ్మస్ విధానం ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయగా...ఆ తర్వాత పాక్షికంగా యాంత్రీకరణను ప్రవేశపెట్టారు. కాగా ప్రస్తుతం ఈ గనిలో బొగ్గు నిల్వలు అంతరించి పోవడంతో అధికారులు మూసి వేసేందుకు నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో అందులోని ముఖ్యమై యంత్రాలు, పరికరాలు వెలికి తీసి మూసివేయనున్నారు. మూడో గనిగా ప్రస్థానం మొదలు పెట్టిన ఈ గనిలో దాదాపు 1000 మంది కార్మికులు మొదట్లో పనిచేశారు. ఇసుక నింపే (సాండ్ స్టోవింగ్) విధానంతో బొగ్గు ఉత్పత్తి చేపట్టారు. మూడో గనిగా ప్రస్థానం సాగించిన ఈ గనిని 2006లో జీడీకే-1వ గనిలో విలీనం చేశారు. అప్పటి వరకు ఒకటో సీమ్‌లో 3.3 మిలియన్ టన్నులు, రెండో సీమ్‌లో 4.2 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు గుర్తించి వెలికితీసారు. అయితే ఏ గనినైనా మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నప్పటికీ దాదాపుగా గనిలో గుర్తించి నిల్వలలో 60 శాతం మాత్రమే వెలికితీస్తారు. కానీ.. జీడీకే మూడో గనిలో దాదాపు 90 శాతం మేర బొగ్గును వెలికితీయడం గమనార్హం. -
హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు
-
హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల వేలంలో గురువారం జిందాల్ పవర్ రెండు, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ ఒకటి చొప్పున బ్లాకులను దక్కించుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో గనులకు జిందాల్ పవర్ రూ. 1,679 కోట్లు, గెరె పామా బ్లాకు కోసం హిందాల్కో రూ. 14,858.9 కోట్లు వెచ్చించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. గెరె పామా 4/5 బ్లాకులో 42.43 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. టన్నుకు రూ. 3,502 మేర బిడ్డింగ్ చేసి హిందాల్కో దీన్ని దక్కించుకున్నట్లు అనిల్ స్వరూప్ పేర్కొన్నారు. ఈ బ్లాకు కోసం దాదాపు 12 గంటల పాటు సాగిన బిడ్డింగ్‌లో హిందాల్కోతో పాటు అంబుజా సిమెంట్స్, బాల్కో, హిందాల్కో తదితర సంస్థలు పోటీపడ్డాయి. ప్రభుత్వం మొదటి విడతగా 19 బొగ్గు బ్లాకులు వేలానికి ఉంచగా ఇప్పటిదాకా 15 బ్లాకులను కంపెనీలు దక్కించుకున్నాయి. బిఛర్పూర్ గనికి బిడ్డింగ్ కొనసాగుతోంది. తొలి విడత ఫిబ్రవరి 22న ముగియనుంది. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ, రిలయన్స్ సిమెంట్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్, జైప్రకాష్ అసోసియేట్స్, బాల్కొ తదితర సంస్థలు బొగ్గు గనులను దక్కించుకున్నాయి. బొగ్గు బ్లాకుల వేలం ద్వారా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రూ. 50,000 కోట్ల పైచిలుకు ఆదాయం రాగలదని అంచనా. -
కొత్త గనులకు భూసేకరణే అడ్డంకి
నూతన చట్టంతో పనులకు బ్రేక్ యైటింక్లయిన్‌కాలనీ (కరీంనగర్) : సింగరేణికి భూసేకరణ తలకుమించిన భారంగా మారింది. పాతచట్టం ప్రకారం సర్వే పూర్తి చేసిన సింగరేణికి ఈఏడాది జనవరిలో రూపుదిద్దుకున్న కొత్తభూసేకరణ చట్టంతో వాటికి బ్రేక్ పడినట్లయింది. ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం ఇప్పటికే సర్వే నిర్వహించి నిధులు సమకూర్చుకున్న యాజమాన్యానికి తాజా చట్టం ప్రతిబంధకమవుతోంది. సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్‌లోని ఓసీపీ-2 కోసం 1,200 ఎకరాలు, మందమర్రి ఏరియాలో కేకేఓసీపీ, కాసిపేటగని, కేకే-6, 7 గనుల కోసం 2వేల ఎకరాలు, ఆర్జీ-3 ఏరియాలోని ఓసీపీ-2 కోసం 800ఎకరాలు, ఇళ్లు, భూపాలపల్లి లాంగ్వాల్ కోసం 800ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా సర్వేలు కూడా పూర్తయ్యాయి. భూసేకరణ నిమిత్తం సంస్థ రూ. 3వేల కోట్లు కేటాయించుకుంది. ఆ దశలోనే కేంద్రం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, విధివిధానాలు ఖరారు చేసి జీవో కాపీలను రాష్ట్రాలకు పంపడంలో జాప్యం చోటుచేసుకుంటోంది. ఈక్రమంలో సింగరేణి భూసేకరణ పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు అడుగంటి పోవడం, కొత్తగనులకు భూ సేకరణ అడ్డంకిగా మారడంతో యాజమాన్యం డోలాయమానంలో పడింది. కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పం దించి భూసేకరణ విధివిధానాలను ప్రకటిస్తేనే యాజ మాన్యం కొత్త గనులపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. -
‘తాడిచర్ల’ రద్దు
- జెన్కోకు అచ్చిరాని బొగ్గు సేకరణ - సుప్రీంకోర్టు తీర్పుతో గనులపై నీలినీడలు - చెల్పూర్ పవర్ ప్లాంట్‌కూ ఆటంకాలు - తొమ్మిదేళ్లలో రూ.120 కోట్లకు పైగా వ్యయం మంథని : మంథని మండలం తాడిచర్లలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించిన ఎంఈసీఎల్ (మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్) సంస్థ 1989లో రెండేళ్లపాటు అన్వేషణ చేసింది. ఆ సమయంలో అప్పటి పీపూల్స్వార్ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. వారి హెచ్చరికలతో ఆ సంస్థ బొగ్గు నిక్షేపాల అన్వేషణను నిలిపివేసింది. అనంతరం రంగంలోకి దిగిన సింగరేణి సంస్థ.. 1999లో ఆగిపోయిన పనులు మొదలుపెట్టింది. ఏడాది తర్వాత 2000 సంవత్సరంలో సింగరేణికి సంబంధించిన యంత్రాలను నక్సల్స్ తగులబెట్టారు. దీంతో తాడిచెర్ల-1, 2 బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని సింగరేణి అధికారులు నిర్ణయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు 2013లో 17 రోజులపాటు సమ్మె చేపట్టాయి. దీంతో సింగరేణి సంస్థ, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. తిరిగి జెన్కో సంస్థ వరంగల్ జిల్లా భూపాలపల్లిలో నిర్మిస్తున్న కేటీపీపీ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన బొగ్గును తాడిచర్ల బ్లాక్-1 నుంచి ఉత్పత్తి చేసుకుంటామని ప్రభుత్వానికి నివేదించింది. దీనికి సర్కారు ఆమోదించడంతో 2005లో సింగరేణి సంస్థ జెన్కోకు తాడిచర్ల బొగ్గుబ్లాకును అప్పగించింది. మొదటిసారిగా చేపట్టిన ఉపరితల బొగ్గు గనుల ఏర్పాటు తమకు మంచి ఫలితాలను తీసుకొస్తాయని జెన్కో భావించినా.. లాభాల మాట అటుంచితే తలనొప్పి తెచ్చిపెట్టింది. నిర్వాసితులకు పరిహారం చెల్లింపు తాడిచర్ల-1 ప్రాజెక్టుకు మొత్తం 2,186 ఎకరాలు అవసరమైంది. ఇందులో 752.33 ఎకరాలకు పట్టాదారులున్నట్లు గుర్తించి వారికి ఎకరాకు రూ.3.80 లక్షల చొప్పున రూ.32.07 కోట్లను పరిహారంగా అందించింది. మిగిలిన 1434 ఎకరాల అసైన్డ్ భూమికి చెల్లింపు కోసం రూ.33కోట్లు డిపాజిట్ చేసింది. ఈ సొమ్మును మరో పదిహేను రోజుల్లో నిర్వాసితులకు చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన ఇన్ని చేశాక.. ఆ బ్లాక్ నుంచి బొగ్గు కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2015 మార్చి నాటికి చెల్పూర్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా.. ఆ లోపు తాడిచర్ల బ్లాక్‌లో బొగ్గు సేకరణ చేయాలనే నిబంధన ఉంది. కానీ కేటాయింపుల్లో అక్రమాలు, పనుల ఆలస్యం కారణంగా బొగ్గు బ్లాక్ రద్దు కావడంతో గనుల ఏర్పాటుకు గ్రహణం పట్టుకున్నట్లయ్యింది. బొగ్గు గనులు ఏర్పాటైతే తాడిచర్లలో పారిశ్రామిక ప్రగతి సాద్యమవుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. తాడిచర్ల ప్రాజెక్టు ప్రొఫైల్ ►1989లో ఏంఈసీఎల్ సంస్థ ఆధ్వర్యంలో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ ►అప్పటిపీపుల్స్వార్ హెచ్చరికలతో అన్వేషణ నిలిపివేత ►1999లో రంగంలోకి దిగిన సింగరేణి ►2000 సంవత్సరంలో యంత్రాలను తగులబెట్టిన మావోయిస్టులు ►1, 2 బ్లాక్‌లను ప్రైవేటు అప్పగిస్తూ సింగరేణి నిర్ణయం ►2013లో 17 రోజులు సమ్మె చేసిన కార్మిక సంఘాలు ►భూపాలపల్లిలోని కేటీపీపీ రెండోదశ విద్యుత్ కేంద్రానికి ఇక్కడి నుంచే బొగ్గు రవాణాకు జెన్కో సంసిద్ధత ►2005లో జెన్కో చేతికి తాడిచర్ల బొగ్గు బ్లాక్ ►నిర్వాసితులకు 32.07 కోట్లు చెల్లించిన జెన్కో ►1434 అసైన్డ్ భూములకూ రూ.33 కోట్లు డిపాజిట్ ►సుప్రీంకోర్టు నిర్ణయంతో తాజాగా రద్దయిన బ్లాక్‌లు -
నాలుగు రోజులకే బొగ్గు!
కేటీపీపీలో నిండుకున్న నిల్వలు గణపురం: గణపురం మండలం చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ)లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. ప్రస్తుతం కేటీపీపీ బొగ్గు యార్డ్‌లో శనివారం నాటికి 29,034 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు సరఫరాలో అంతరాయం కలిగినా.. వర్షాలు కురిసినా.. వారం రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయో ప్రమాదం పొంచి ఉన్నది. వాస్తవానికి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బొగ్గురవాణా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒక కారణమైతే, సింగరేణి సంస్థ బొగ్గును అందించకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీపీకి ప్రతిరోజు 7,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. అంటే రోజుకు 450 లారీల బొగ్గు అవసరం. కచ్చితంగా చెప్పాలంటే ప్రతి మూడు నిమిషాలకు లారీ బొగ్గు (లారీలో దాదాపు17టన్నులు ఉంటే) కావాల్సి ఉంది. విద్యుత్ కేంద్రంలో విద్యుత్ నిలిచిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు కనీసం 400 పైగా లారీల బొగ్గు ప్లాంట్‌కు సరఫరా కావాలి. బొగ్గు కాంట్రాక్టర్లు కేటీపీపీకి 450 లారీల బొగ్గును సరఫరా చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పటి వరకైతే 300 నుండి 400లారీల బొగ్గు ప్లాంట్‌కు చేరుతుంది. శుక్రవారం నాడు మాత్రం 7850 మెట్రిక్ టన్నుల బొగ్గు (సుమారుగా 450 లారీల బోగ్గు )ప్లాట్‌కు చేరుకుంది. భూపాలపల్లి బొగ్గు బావుల్లో, ఒపెన్‌కాస్ట్ బావిలోనూ టార్గెట్ మేరకు బొగ్గు ఉత్పత్తి కాకపోవడంతో కేటీపీపీకి అవసరమైన బొగ్గు రావడం లేదు. దాంతో గోదావరిఖని, రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల నుంచి సరఫరా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దశలో విద్యుత్ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలు ఆశిం చిన మేరకు లేక పోవడంతో అధికారుల్లో గుబు లు మొదలైంది. బొగ్గుకొరత ఏర్పడుతుందనే విషయాన్ని గమనించిన అధికారులు ప్రస్తుతం కొంత బొగ్గు, కొంత ఆయిల్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి కేటీపీపీలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం నాటి నుంచీ బొగ్గు సరఫరా విషయంలో క్షణంక్షణం టెన్షన్‌గానే ఉంది. బొగ్గు సరఫరా కాంట్రాక్టులు దక్కించుకున్న కాంట్రాక్టుర్లు వారి టార్గెట్ ప్రకారం బొగ్గు ను సరఫరా చేస్తే అధికారులకు తలనొప్పి ఉండేదికాదు. 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ దానిపై అధికారులు దృష్టి సారించడం లేదు. బొగ్గు సర ఫరా కాంట్రాక్టులో కొంతమందికి రాజకీయంగా పలుకుబడి ఉండటంతో టార్కెట్ పూర్తి చేయకున్నా.. వారిపై చర్యలు చేపట్టడానికి అధికారులు సహసం చేయలేక పోతున్నారు. ఏ రోజుకు.. ఆ రోజే సరఫరా భూపాలపల్లి బొగ్గు గనుల నుంచి కేటీపీపీ 4500 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా కావాల్సి ఉండగా 3500నుండి 4000 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతున్నది, గోదావరిఖని నుంచి 3వేల మెట్రిక్ టన్నులకు గాను వెయ్యి మెట్రిక్‌టన్నులు, బెల్లంపల్లి, రాంగుండం, మంచిర్యాల రైల్వేట్రాక్ ద్వారా ఉప్పల్‌కు వచ్చిన 4వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నుంచి రోజుకు రెండు వేల నుంచి ఇరైవె ఐదు వందల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫారా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ రోజుకు కావాల్సిన బొగ్గు ఆ రోజే సరఫరా అవుతున్నది. నిల్వ చేసుకోవడానికి అదనంగా ఎక్కడి నుంచి కూడా రావడం లేదు. అనివార్య కారణాల మూలంగా బొగ్గు రాక్ రాకుంటే కేటీపీపీ పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు అధికారుల దగ్గర సమధానం లేదు. -
ఖనిజం ఫుల్... ‘ఖజానా’ నిల్..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సహజ సంపదకు జిల్లా పెట్టింది పేరు. బొగ్గు నిల్వలు మొదలుకుని అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న వివిధ రకాల ఖనిజాల వరకు అనేకం ఇక్కడ లభ్యమవుతాయి. జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ కావడంతో ఇతర ప్రాంతాల్లో దొరకని ఖనిజాలు సైతం ఇక్కడ లభ్యమవుతుంటాయి. బొగ్గు నిల్వలు, బారైట్స్, ఐరన్ ఓర్, డోలమైట్, మైకా వంటి ఖనిజాలతో పాటు రాష్ట్ర అవసరాలు తీర్చే స్థాయిలో నిల్వల గల ఇసుక రీచ్‌లు అనేకం ఉన్నాయి. ఇలా సహజ సంపదకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జిల్లాలో మైనింగ్ శాఖ పరిస్థితి మాత్రం కొంత దయనీయంగా ఉంది. వేలకోట్ల విలువైన సహజ సంపద ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోకపోవడం, పూర్తిస్థాయిలో అజమాయిషీ లేకపోవడంతో వాటన్నింటినీ పర్యవేక్షించే మైనింగ్ శాఖకు ఆదాయం నామమాత్రంగానే ఉంది. జిల్లాలో సుమారు 12 రకాలకు పైగా వివిధ రకాల లోహాలు, నిల్వలు ఉన్నాయి. వీటికి సంబంధించి లీజు కేటాయింపులన్నీ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో అనుకున్నంత ఆదాయం రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని మైనింగ్ శాఖ అతి కష్టం మీద అధిగమించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోగల గనులను పరిగణలోకి తీసుకుని జిల్లాకు ఈ ఏడాది కేవలం రూ.37 కోట్ల వార్షిక లక్ష్యాన్ని మాత్రమే ప్రభుత్వం నిర్దేశించగా... రూ.40 కోట్లు వసూలైంది. జిల్లాలోని ఖనిజ వనరులన్నిటినీ సక్రమంగా వినియోగంలోకి తీసుకొస్తే ఇంతకంటే రెండింతల ఆదాయం సాధ్యమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. గతంలో మైనింగ్ శాఖ పరిధిలో ఉండే ఇసుక రీచ్‌లను జిల్లా పరిషత్‌లకు కట్టబెట్టడంతో ఈ వ్యవహారం అక్రమాలకు కేంద్రబిందువుగా మారింది. జిల్లాలో మేజర్ మినరల్స్ కేటగిరిలో మొత్తం 12 రకాల లోహాలకు గాను, 15,037 హెక్టార్లలో 65 లీజ్‌లు కేటాయించారు. ఇందులో ఖమ్మం మైనింగ్ అసిస్టెంట్ై డెరెక్టర్ పరిధిలో 694.887 హెక్టార్ల విస్తీర్ణంలో లభ్యమయ్యే బారైట్, రంగురాళ్లు, డోలమైట్, ఐరన్‌ఓర్, అబ్రకం, పలుగురాళ్లు, బొగ్గు నిల్వలకు సంబంధించి 22 లీజులు ఉన్నాయి. కొత్తగూడెం మైనింగ్ ఏడీ పరిధిలో వీటితోపాటు అత్యధికంగా 12 బొగ్గు గనులు, 43 ప్రైవేట్ లీజ్‌లు ఉన్నాయి. వాస్తవానికి జిల్లాలో బొగ్గుతోపాటు ఐరన్‌ఓర్ గనులు పుష్కలంగా ఉన్నాయి. గత కొంతకాలంగా ఐరన్ఓర్కు సంబంధించి సమస్యలు ఉత్పన్నం అవడంతో కేటాయించిన మూడు లీజులు కూడా పనిచేయడం లేదు. అనేక సమస్యలను అధిగమించి నేలకొండపల్లి ప్రాంతంలో 17 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న లో గ్రేడ్ ఐరన్‌ఓర్ ఇటీవలే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతోపాటు బయ్యారం ప్రాంతంలో 70 హెక్టార్లు, భధ్రాచలం డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 3 వేల హెక్టార్లలో ఐరన్‌ఓర్ నిల్వలు ఉన్నప్పటికీ అటవీ చట్టాలు, పర్యావరణ సమస్యలు వంటి రకరకాల కారణాలతో అవన్నీ నిలిచిపోయాయి. అయితే వీటన్నింటినీ సక్రమంగా వినియోగంలోకి తెస్తే ఏటా రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వానికి రాయల్టీ వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు మైనర్ మినరల్స్ కేటగిరిలో 305 లీజులు ఉన్నాయి. ఇవి 478.350 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా నల్లరాయి లీజులే 205 ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం కూడా మైనర్ మినరల్స్ నుంచే అధికంగా ఉంది. ప్రసుత్తం వస్తున్న ఆదాయంలో 30 శాతం గ్రానైట్ నుంచి, 20 శాతం డోలమైట్ నుంచి, 50 శాతం స్టోన్ మెటల్ నుంచి సమకూరుతోంది. పుష్కలంగా ఇసుక నిల్వలు... జిల్లాలో 45కు పైగా ఇసుక రీచ్‌లున్నాయి. వీటిలో భద్రాచలం పరిధిలోని 11 ఇసుక రీచ్‌లను గతంలో ఎస్టీలకు కేటాయించారు. వాటిలో 7 రీచ్‌లు ఇప్పటికే మూతపడ్డాయి. గోదావరి నదీ తీరప్రాంతంలో ఉన్న రీచ్‌ల్లో వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. రెండేళ్ల క్రితం వరకు ఇసుక రీచ్‌ల కేటాయింపు వ్యవహారం మైనింగ్‌శాఖ ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత వీటిని జిల్లా పరిషత్‌కు కేటాయించడం, రీచ్‌ల్లో భారీగా అక్రమాలు జరగడంతో ప్రస్తుతం అన్ని రీచ్‌లూ మూతపడ్డాయి. అయితే వందల లారీల ఇసుక నిత్యం అక్రమంగా రవాణా అవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వం రూ. కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ప్రభుత్వానికి నివేదిక పంపాం : ఏడీ జిల్లాలో సహజ సంపద నిల్వలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపామని ఖమ్మం డివిజన్ మైనింగ్‌శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎస్.వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పలు కేటాయింపుల్లో సాంకేతిక సమస్యలు, కోర్టు ఇబ్బందులు ఉండటంతో జరగలేదని, త్వరితగతినే అన్నీ పూర్తవుతాయని వివరించారు. -
నేడో, రేపో విద్యుత్ ప్లాంట్ల మూత
సింహాద్రి, రామగుండంలో నిండుకున్న బొగ్గు 4,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ జెన్కో ప్లాంట్లకూ బొగ్గు ఇబ్బందులు తుపానులు, ఎంసీఎల్లో స్థానిక గొడవల ఫలితం అప్రకటిత విద్యుత్ కోతలు అమలయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)కి చెందిన రెండు విద్యుత్ ప్లాంట్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఎన్టీపీసీకి చెందిన ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటడమే ఈ పరిస్థితికి కారణం. ప్రస్తుతం ఈ ప్లాంట్లలో ఒక్క రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. బొగ్గు కొరత కారణంగా తక్కువ సామర్థ్యంతో విద్యుత్‌ను ఎన్టీపీసీ ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు తుపానుతో పాటు ఒడిశాలో స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యేని పోలీసులు అరెస్టు చేయడంతో మహానది కోల్ ఫీల్డ్స్(ఎంసీఎల్)లో శుక్రవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం కూడా బొగ్గు ఉత్పత్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీకి చెందిన రెండు ప్లాంట్లలో నేడో, రేపో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేజరిగితే 4,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. రాష్ట్రంలో ఎన్టీపీసీకి విశాఖపట్నం సమీపంలోని 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింహా ద్రితో పాటు రామగుండంలో 2,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ ఉంది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుండటంతో రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో) ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. జెన్కోకు చెందిన విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)తో పాటు వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీపీ)లో ఐదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి. ఇక వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ)తో పాటు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో కూడా ఒక రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. ఎంసీఎల్ నుంచి ఎన్టీటీపీఎస్తో పాటు ఆర్టీపీపీకి కూడా బొగ్గు సరఫరా అవుతుంది. ఎంసీఎల్ నుంచి బొగ్గు సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ఆర్‌టీపీపీలోనూ ఒక రోజుకు సరిపడా నిల్వే ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాస్తవానికి కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) నిబంధనల ప్రకారం పిట్ హెడ్ ప్లాంట్ల (బొగ్గు గని పక్కనే ఉండే విద్యుత్ ప్లాంట్లు)లో 12 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అలాగే బొగ్గు గనులకు దూరంగా ఉండే విద్యుత్ ప్లాంట్లలో 15 రోజులకు సరిపడే నిల్వలు ఉండాలి. ఈ లెక్కన రాష్ట్రంలో కొత్తగూడెం మినహా అన్ని విద్యుత్ ప్లాంట్లలోనూ 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే బొగ్గు నిల్వలు ఉంచుకోవడంలో అధికారుల వైఫల్యం వల్లే ప్లాంటు మూతపడే పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి.