న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని బొగ్గు క్షేత్రం నుంచి ఉత్పత్తి చేసే కోల్–బెడ్ మీథేన్ (సీబీఎం) గ్యాస్‌ను యూనిట్‌కు (ఎంబీటీయూ) 23 డాలర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ విక్రయించింది. ఈ రేటుకు 0.65 ఎంసీఎండీ (రోజుకు మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లు) మేర గ్యాస్‌ను గెయిల్, జీఎస్‌పీసీ, షెల్ తదితర సంస్థలకు సరఫరా చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రెంట్ క్రూడాయిల్ బేస్ ధరకు 13.2 శాతం ప్రీమియంతో రిలయన్స్ బిడ్లను ఆహ్వానించింది. దీని ప్రకారం ఎంబీటీయుకి బేస్ ధర 15.18 డాలర్లుగా నిర్ణయించగా, గెయిల్ తదితర సంస్థలు మరో 8.28 డాలర్ల ప్రీమియం కోట్ చేయడంతో తుది ధర 23.46 డాలర్లకు చేరింది.
మరోవైపు, హిందుస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ (హెచ్‌వోఈసీ) తమ గ్యాస్‌ను యూనిట్‌కు 25.3 డాలర్లకు విక్రయించింది. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్‌పీసీ) ఈ రేటుకు 0.3 ఎంసీఎండీని కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment