వారసత్వ ఉద్యోగాలివ్వాలి
వారసత్వ ఉద్యోగాలివ్వాలి
Published Mon, Nov 30 2015 10:37 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
కొత్తగూడెం: డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌తో సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) మాజీ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సంస్థ ఉద్యోగాల్లో కార్మికుల పిల్లలకు అవకాశం కల్పించాలని వారు కోరారు.
Advertisement
Advertisement