కాంగ్రెస్‌ది అమ్ముడు పోయిన చరిత్ర | Sitaram Naik fired on congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ది అమ్ముడు పోయిన చరిత్ర

Published Wed, Mar 1 2017 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌ది అమ్ముడు పోయిన చరిత్ర - Sakshi

కాంగ్రెస్‌ది అమ్ముడు పోయిన చరిత్ర

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కోసం పోరాడకుండా కాంగ్రెస్‌ పార్టీ నేతలు అమ్ముడుపోవడం వల్లే రాష్ట్ర సాధన ఆలస్య మైందని టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌ ధ్వజమెత్తారు. ఢిల్లీలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి సీఎం చేసిన దీక్షపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నా టీజేఏసీ ముసుగులో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి విమర్శించారు. 2016–17 ఏడాదిలో వివిధ విభాగాల్లో 5,936 పోస్టులను భర్తీ చేసిందని, మరో 11,086 ఉద్యోగాల భర్తీకి మార్చిలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నదని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రైవేటు రంగంలో 44 వేల ఉద్యోగాలు కల్పించినట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement