
తెలంగాణలో ఆరుగురు న్యాయమూర్తుల బదిలీ
హైదరాబాద్:తెలంగాణలో ఆరుగురు జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ కోర్టు జడ్జిగా వెంకరమణను, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బాలయోగిని నియమించింది.
నిజామాబాద్ జిల్లా జడ్జిగా అరవింద్ రెడ్డి, వరంగల్ జిల్లా చీఫ్ జడ్జిగా విజయసారథి, నాంపల్లి నాలుగో అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తిగా సాంబశివరావు నాయుడు, నాంపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తిగా తిరుమలరావులను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.