స్మార్ట్‌సిటీ లపై దిశానిర్దేశం చేసిన ప్రధాని
వెబ్‌కాస్టింగ్ ద్వారా బల్దియాలో ప్రసారం
కరీంనగర్‌కార్పొరేషన్ : పట్టణ ప్రజల జీవన విధానంలో మార్పు తేవడమే స్మార్ట్‌సిటీల ల క్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శని వారం మహారాష్ట్రలోని పుణే స్మార్ట్‌సిటీ ప్రా రంభోత్సవం, అమృత్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రసారం చేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వెబ్‌స్క్రీన్ ఏ ర్పాటుచేసి పాలకవర్గ సభ్యులు, అధికారు లు వీక్షించారు.
స్మార్ట్‌సిటీ, అమృత్ పథకంలో చేరిన నగరాల పాలకవర్గాలు, అధికారులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సాధ్యమన్నారు. 24 గంటల నీటిసరఫరా, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వే యాలని సూచించారు. ఈ-ఆఫీస్‌ల ద్వారా అన్ని సేవలు అందేలా చర్యలు చేపట్టాల న్నారు. మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ కృష్ణభాస్కర్, కార్పొరేటర్లు, అధికారులు పా ల్గొన్నారు. కాగా ఇంటర్నెట్‌లో ఏర్పడ్డ సాంకేతికలోపంతో కొంత నిరాశకు గురయ్యూరు. కార్యక్రమానికి ముందే అన్ని సరిచూసుకోవాల్సిన సిబ్బంది తీరా సమయానికి హడావిడి పడడం కనిపించింది.