ఎన్టీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దేశంలోని వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి, ఆ దిశగా అడుగులేస్తోంది.
టవర్‌సర్కిల్ : ఎన్టీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దేశంలోని వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి, ఆ దిశగా అడుగులేస్తోంది. గతేడాది జూలైలో కేంద్రం స్మార్ట్‌సిటీల సన్నాహక జాబితా విడుదల చేసింది. జాబితాలో తెలంగాణలోని ఐదు సిటీలుండగా అందులో కరీంనగర్ పేరును పొందుపరిచారు. అయితే తెలంగాణలోని రెండు సిటీలను మాత్రమే స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది.
దీంతో ఇక్కడి ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నగరానికి స్మార్ట్‌సిటీ హోదా తీసుకురావడం కోసం ప్రయత్నిస్తామని చెప్పడంతో నగర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్మార్ట్‌సిటీల జాబితాల్లో కరీంనగర్‌ను కూడా ఎంపిక చేశా రు. కరీంనగర్‌తోపాటు హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, ని జామాబాద్ కూడా స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్నారుు.
నిధుల వరద
స్మార్ట్‌సిటీగా ఎంపికైతే నగరం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ప్రఖ్యాత నగరాలకు దీటుగా తీర్చిదిద్దుతారు. నగరం మొత్తం శాటిలైట్ అనుసంధానంగా, వైఫై నగరంగా మారుతుంది. ఇంటి పన్నులు రెండిం తలుగా పెరుగుతాయి. అన్ని రంగాల్లో నగరం అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇందుకోసం కేంద్రం నుం చి దశల వారీగా రూ.వెయ్యి కోట్ల వరకు నిధులు వస్తాయని తెలుస్తోంది. పారి శుధ్యం, రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినే జీ, నిరంతర నీటి సరఫరా వంటి మౌ లిక సదుపాయాలు మెరుగుపడతాయి.
నెరవేరనున్న కల
స్మార్ట్‌సిటీ హోదా దక్కుతుందనే నమ్మకంతోనే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీని పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత చూపించినట్లు తెలుస్తోంది. గతంలో మంజూరు చేసిన రూ.77 కోట్లకు మరో రూ.50 కోట్లు అదనంగా నిధులను మంజూరు చేసి యూజీడీని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. అందుకు తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ రోడ్ల పునర్నిర్మాణం కోసం రూ.46 కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారు. ఇక స్మార్ట్‌సిటీ హోదా దక్కితే నగరం రూపురేఖలు మారనున్నాయి. స్మార్ట్ సిటీ హోదా విషయమై స్థానిక కార్పొరేషన్ అధికారులకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిసింది.