
వడగాడ్పులపై ఎస్‌ఎంఎస్‌లు!
నాలుగైదు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: వడగాడ్పులపై నిత్యం కోటి మందికిపైగా ప్రజలకు సెల్ ఫోన్ ద్వారా ఎస్‌ఎంఎస్‌లు పంపాలని విపత్తు నిర్వహణ శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించి పోర్టల్‌ను అభి వృద్ధి చేసి.. వాతావరణ శాఖకు అనుసం« దానం చేసింది. వాతావరణ శాఖ ఇచ్చే వడగాడ్పుల హెచ్చరికలను ఎప్పటి కప్పుడు ప్రజలకు మెసేజ్ ద్వారా పంపిస్తారు. పది రోజుల ముందస్తు హెచ్చరి కల సమాచారాన్ని కూడా పంపుతారు. ఎక్కడెక్కడ వడగాడ్పులు ఉంటాయో తెలుసుకొని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వీలుకలుగుతుంది. ఈ మేరకు వివిధ టెలికాం సంస్థలతో విపత్తు నిర్వహణ శాఖ ఒప్పందం చేసుకుంది. వడగాడ్పుల సమాచారాన్ని ప్రజలకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఉచితంగా పంపేం దుకు ఆ సంస్థలు ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాలుగైదు రోజల్లో ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే వర్షాకాలంలోనూ వర్ష సూచన, వర్షపాతం వివరాలు కూడా పంపించనున్నారు.
వడదెబ్బతో 65 మంది మృతి
రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా 65 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 14 మంది చని పోయారు. కరీంనగర్ జిల్లాలో 10 మంది, నల్లగొండ జిల్లాలో 9 మంది, కామా రెడ్డి జిల్లాలో ఐదుగురు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. రంగా రెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, జగిత్యాల, జనగామ, కొమురం భీం, మహబూబాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూలు, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సంగా రెడ్డి, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.