మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం | ఈఏచలయ Software Engineer Missing in hyderabad | Sakshi
Sakshi News home page

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

Published Sat, Nov 1 2014 8:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

అఫ్జల్‌గంజ్: బెంగళూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఓ స్టాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యమైంది. అఫ్జల్‌గంజ్ ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం...అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన పి. మోహన్‌రావు కుమార్తె భరణి(26) బెంగళూర్‌లోని ఓ  కంపెనీలో కొంత కాలంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈనెల 26వ తేదీ రాత్రి 9 గంటలకు భరణిని తండ్రి ఎంజీబీఎస్‌లో బెంగళూర్ వెళ్లే బస్సు ఎక్కించి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకున్న వెంటనే భరణికి ఫోన్ చేయగా.. స్విచ్ఛాప్ వచ్చింది.

ఆందోళనకు గురైన ఆయన అర్ధరాత్రి వరకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మరుసటి రోజు బెంగళూర్‌లో ఆమె పని చేసే కంపెనీకి ఫోన్ చేసి వాకబు చేయగా భరణి రాలేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు నగరంతో పాటు బంధు,మిత్రుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement