మహబూబ్‌నగర్ వ్యవసాయం,న్యూస్‌లైన్: రబీ సీజన్ ముగిశాక అధికారులు తీరిగ్గా స్ప్రింక్లర్ల పంపీణికి సిద్ధమయ్యారు.దీంతో అవి అవసరానికి దక్కే అవకాశం లేకుండా పోయింది.రబీ ప్రారంభం కాకముందునుంచీ అధికారులు వీటి పంపిణీకి చొరవ చూపకపోవడంతో ఇప్పుడు అవి అన్నదాతలకు ఎందుకూ ఉపయోగ పడలేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందనే చందంగా రైతుల పరిస్థితి తయారైంది. వ్యవసాయానికి రూ.కోట్ల బడ్జెట్ కేటాయించినా అది రైతుల అవసరాలను తీర్చడం లేదు. నూనెగింజలు,మొక్కజొన్న పంటల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2004-05 వార్షిక సంవత్సరంలో సమగ్ర నూనెగింజలు,పప్పుధాన్యాలు పామాయిల్ మరియు మొక్కజొన్న అభివృద్ధి పథకాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించారు.ఈ పథకానికి 75శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం,25శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు.
అందులో భాగంగానే చిన్నసన్నకారు రైతులకు 50శాతం సబ్సిడీతో స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్,నీటి సరఫరా పైపులను ఇవ్వవలసిఉంటుంది.జిల్లాలో వేరుశనగ రైతులకు ఈ పథకం కింద 2011-12వార్షిక సంవత్సరంలో 7వేలకు పైగా యూనిట్లు పంపిణీ చేయగా 2012-2013వార్షిక సంవత్సరం 2వేల యూనిట్లు తగ్గించి 5వేల యూనిట్లకు పైగా స్ప్రింకర్లను పంపిణి చేశారు. కాగా ప్రభుత్వం మరోఅడుగు ముందుకేసి ఈ ఏడాది 2వేల యూనిట్లకు కోత విధించి 3 యూనిట్ల పంపీణికి ప్రభుత్వం సిద్ధపడింది. రబీముగిసిన తరువాత పిబ్రవరి మాసం చివరివారంలో స్ల్రింక్లర్ల పంపిణీకి అధికారులు పూనుకున్నారు. మార్చి నెల మొదటివారంలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ పథకం డబ్బులు ట్రెజరీ ఫ్రీజ్ అయ్యాయి.చివరకు వెనక్కు వెళ్లాయి.
పెరిగిన రేటుతో గందరగోళం
ఒక్కో స్ప్రింక్లర్ హెక్టర్ యూనిట్‌లో ఒక హెక్టార్‌లోపు సాగు చేసే రైతులకు 8 రకాల వస్తువులకు గతేడాది రూ.14804 పూర్తిధర కాగా అందులో రూ.7402 50శాతం సబ్సిడీగా పోగా రూ. 7402 రైతు భరించాలి.అంతేకాకుండా ఈ ధరలో 30 పైపులను ఇచ్చేవారు.దాంతోపాటు 5శాతం వ్యాట్ రూ.740 కలుపుకొని మొత్తం రూ.8,142 చెల్లించేవారు. ఇలా రెండు హెక్టార్ల లోపు సాగుచేసిన రైతులు రూ.9,652 చెల్లించేవారు. ఈ ఏడాది మాత్రం రైతులకు కోలుకోలేని దెబ్బను కొ ట్టింది.
గతేడాది కంటే అధికంగా హెక్టారుకు రూ. 2775 పెరిగిందన్నమాట. గతంలో ఉన్న ధరలకు స్ప్రిం క్లర్లు పంపిణీ చేసే కంపెనీలు ముందుకు రావడం లేదనే సాకుతో ఇలా భారం వేశారు. ఈ ఏడాది పెంచిన ధరల ప్రకారం యూనిట్ ఖరీదు రూ.18,417లు కాగా పూర్తిధర రూ.7,500 మాత్రమే 50శాతం సబ్సిడీగా భరిస్తోం ది. అయిదు శాతం వ్యాట్ కలుపుకొని రూ.10,917 ల ను రైతులు చెల్లించారు. ఇలా రెండు హెక్టార్ల లోపు సాగుచేసిన రైతులు రూ.10,974 చెల్లించాల్సి వచ్చింది. కానీ అధికారులు వీటి పంపిణీపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో 59 యూనిట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగునీటి పైపుల ధరలను కూడా గతేడాది కంటే ఎక్కువ ధర నిర్ణయించినా ఫలితం లేకుండా పోయింది.
4వేల దరఖాస్తులకు 62 మాత్రమే అందజేత...
ప్రభుత్వం ఈ ఏడాది 3170 స్ప్రింక్లర్లు, 750 సాగునీటి పైపుల పంపీణీకి సిద్దపడింది.కాగా రబీ సీజన్ ప్రారంభం కాకముందే వీటి పంపిణీపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో లక్ష్యం నీరుగారిపోయింది. రైతులు తమకు స్ప్రింక్లర్లకోసం రబీ సీజన్ ప్రారంభం కాకముందు నుంచే వ్యవసాయశాఖ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది.కొందరు రైతులు డీడీలు కట్టి సంబంధిత అధికారులకు అందజేశారు.రైతుల నుండి అధికారులు 4వేలకు పైగా దరఖాస్తులను తీసుకొని తమ వద్ద ఉంచుకున్నారు.కాగా స్ప్రింక్లర్ల రేటును నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలాయపన చేయడంతో అసలుకే మోసం వచ్చినట్లయింది. రబీ సీజన్ ముగిసే నెల ఫిబ్రవరిలో వీటి ధరను నిర్ణయించి, రాష్ట్రం అంతటికి ఒకే కంపెనీకి వీటి పంపిణీ భాద్యతను అప్పగించింది. అధికారులు 59 స్ప్రింక్లర్ యూనిట్లు,3 సాగునీటి పైపుల యూనిట్లను మాత్రమే పంపిణీ చేశారు. అధికారుల నుండి ఉత్తర్వులు వెలువడి వీటి పంపిణీకి శ్రీకారం చుట్టేలోగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. దీంతో నిధులు ట్రెజరీలో ఫ్రీజ్ అయ్యాయి.ఇలా రూ. 74 లక్షల చివరకు వెనక్కి వెళ్లాయి.
ఏదో ఇచ్చారు...!
Published Wed, Apr 30 2014 3:21 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement