రైతుకు ఎంతో భరోసా ఇచ్చే విత్తన ఉత్పత్తి నీరుగారుతోంది. పథకం ఆహా అనే చందాన ఉన్నా ఆచరణలో భిన్నంగా ఉంటోంది. అధికారులు దీనిపై చొరవ చూపని కారణంగా నాణ్యత, ధ్రువీకరణ సజావుగా సాగడం లేదు. రూ.లక్షల్లో నిధులు, విడతల వారీ శిక్షణ వృథా పద్దుల్లో జమ అవుతోంది. అన్నదాతలను ఆకర్షించలేక పోతోంది.
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: జిల్లాలోని పంటల సరళిని అనుసరించి కొత్త వంగడాలను త్వరితగతిన ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామీణ విత్తనోత్పత్తి పథకం పడకేసింది. లక్ష్యం ఘనంగా ఉన్నా అమలులో మాత్రం అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతో అసలు లక్ష్యం నీరుగారిపోతోంది.ఈ పథకం అమలుకు ప్రభుత్వం జిల్లాకు ఏటా భారీగా కేటాయిస్తున్నా నిధులు నేల పాలవుతున్నాయి.
గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకం ఉద్దేశం...?
జిల్లాలోని పంటల సరళిని అనుసరించి విడుదలైన కొత్త వంగడాలను త్వరితగతిన ఉత్పత్తి చేయడంతో పాటు అధిక దిగుబడులను ఇచ్చే నాణ్యమైన ధ్రువీకరణ విత్తనాలను సరసమైన ధరలకే రైతులకు అందించడం ఈ పథకం యొక్క ప్రధానోద్దేశం. ఈ పథకంతో రైతులకు విత్తనాల కొరత నుండి అధిగమించడానికి తోడ్పడుతుంది.
అమలు ఇలా...
ఎంపిక చేసిన గ్రామాల్లో ఒకే చోట 25 ఎకరాల(ఒక యూనిట్)లో ఒకే పంటను పండించే 25 మంది రైతులను గుర్తించి, వారికి ధ్రువీకరించిన విత్తనాలను మూల విత్తనంగా 50శాతం సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ విత్తనాలను రాష్ట్ర విత్తనోత్పత్తి క్షేత్రాలు, జాతీయ విత్తన సంస్థ, స్టేట్ ఫార్మర్స్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ, వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదలైన సంస్థల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేస్తుంటుంది. రైతులకు సాగు చేసే యూనిట్లలలో మూడు విడుతలుగా శిక్షణ కార్యాక్రమాలను రైతు శిక్షణ కేంద్రం అధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు.
1.మొదటి విడుతలో రైతులు విత్తనం వేసే సమయంలో విత్తనోత్పత్తిపై సాంకేతిక పరిజ్ఞానం, వి త్తేసమయం, విత్తే దూరం మొదలైన సాగు పద్దతులపై శిక్షణ ఇస్తారు.
2.రెండో దఫా శిక్షణలో పూతదశలో కేళీల గు ర్తింపు, ఏరి వేయడం, సస్యరక్షణ పద్ధతులు, కో త పద్ధతులు మొదలగు వాటిపై అవగాహన కల్పిస్తారు.
3. మూడో దఫా శిక్షణలో భాగంగా పంట కో సిన తరువాత విత్తనం శుభ్రం చేయడం,ప్రాసె స్ చేయడం, విత్తనం నిల్వ, గ్రేడింగ్ మొదలగు వాటిపై రైతులకు శిక్షణ ఇస్తారు. ఒక్కో దఫా కా ర్యాక్రమానికి రూ.2,500 వంతున మూడు విడుదలకు గాను రూ.7,500 ఖర్చు చేస్తారు.
ఖర్చు మోపెడు...ఫలితం మూరెడు
గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద జిల్లాకు గతేడాది ఖరీఫ్ సీజన్‌లో 150 యూనిట్లు మంజూరయ్యాయి. అందులో 95 వరి,21 కంది, 18 జొ న్న , 10 పెసర , ఆరు వేరుశనగ పంటల యూ నిట్లు ఉన్నాయి. వీటికి మూల విత్తనంపై 50 శాతం సబ్సిడీ భారాన్ని భరిస్తూ ప్రభుత్వం వి త్తనాలను సరఫరా చేసింది. అంతేకాకుండా ఒ క్కో యూనిట్‌కు రూ.7500 రైతు శిక్షణ పేరిట ఖర్చు చేసింది.ఇలా 150 యూనిట్లకు గాను శిక్ష ణ పేరిట రూ.11.25లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. అంతేకాకుండా ఈ రబీ సీజన్‌కు 301 యూనిట్లు మంజూరయ్యాయి.వీటిలో వేరుశన గ 228 ,వరి 41, 3 జొన్న ,29 శనగ పంట యూ నిట్లు మంజూరయ్యాయి.
ఇప్పటి వరకు వీటికి మూల విత్తనాన్ని 50శాతం సబ్సిడిపై ప్రభుత్వం పంపిణీ చేసింది.గతేడాది అక్టోబర్,నవంబర్ నెలలో కురిసిన అధిక వర్షాలకు 7 యూ ని ట్లలో పంటలు దెబ్బతిన్నాయి. మిగతా 294 యూనిట్లలలో ఈ పథకం కింద పంటలు సాగవుతున్నాయి. శిక్షణ నిర్వహించేందుకు దాదాపు రూ.7.50 లక్షలు జిల్లాకు మంజూరయ్యాయి. అందులో ఇప్పటి వరకు 60 శాతంపైగా యూనిట్లలో తొలి విడత శిక్షణ పూర్తి అయ్యినట్లు అధికారులు సూచిస్తున్నారు.కాగా రెండవ,మూడవ దఫాల శిక్షణ కార్యాక్రమాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులను విడుదల చేయలేకపోయారు.
కనిపించని విత్తన ధ్రువీకరణ
ఇలా పండించిన ధాన్యాన్ని పంట కోతల అనంతరం ఉత్పత్తి అయిన విత్తనాలను ప్రాసెస్ చేసి, శుభ్రం చేసి, గ్రేడింగ్ చేసిన అనంతరం సంబంధిత వ్యవసాయాధికారులు వాటిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. గతేడాది ఖరిఫ్‌లో ఈ పథకం కింద ఉత్పత్తి చేసిన విత్తనాలను ఒక్క యూనిట్‌లో కూడా ధ్రువీకరణ జరగలేదు. దీంతో ఈ పథకం అమలయ్యే గ్రామాల్లోని రైతులు వీటిని కొనుగోలు చేయాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విత్తనాన్ని ఒక్క రైతు కొంటే ఒట్టు
ఇలా ఖరీఫ్ సీజన్‌లో ఈ పథకం కింద పండించిన ధాన్యాన్ని ఒక్క రైతు కూడా కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో జిల్లాలో అదే గ్రామానికి, అదే మండలానికి చెందిన రైతులకు మూలవిత్తనంగా ఒక్క క్వింటాను కూడా పండించిన రైతులు అమ్మలేక పోయారు. ఇలా రైతులు ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని ధ్రువీకరణ అనంతరం అదే గ్రామంలోని ఇతర రైతులకు మూల విత్తనం కోసం సగటు ధరకు అమ్మాల్సి ఉంటుంది.వీటిపై ఆయా గ్రామాలోని రైతులు మక్కువ చూపకపోవడంతో రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా బహిరంగ మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో అసలు లక్ష్యం నీరుగారిపోతోంది.
ఎందుకు ముందుకురావడం లేదంటే..
ఈ పథకం కింద ఉత్పత్తి చేసిన విత్తనాలపై అదే గ్రామంలో రైతులకు అవగాహన కల్పించకపోవడంతో రైతులు మక్కువ చూపడం లేదు. అంతేకాకుండా రైతులు ఈ పథకం కింద ఉత్పత్తి చేసిన విత్తనాలను సకాలంలో విత్తన ధృవీకరణ చేయకపోవడంతో ఈ పంటను పండించిన రైతులు విసిగిపోయి బహిరంగ మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ పథకం కింద పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కోనుగోలు చేసి ఇతర రైతులకు పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఈ పథకం అమలు కోసం యూనిట్‌కు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికి ఫలితం మాత్రం దక్కడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విత్తనం.. నిర్లక్ష్యానిది పెత్తనం
Published Fri, Feb 28 2014 3:38 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement