కొత్తగూడెం: రూ. రెండు వేలు అడిగితే ఇవ్వనన్నందుకు కన్నతల్లిని గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశాడో ప్రబుద్ధుడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని చిట్టిరామవరంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు.. చిట్టిరామవరానికి చెందిన అజ్మీరా సక్కుబాయి(65) సింగరేణిలో కాంట్రాక్టు లేబర్‌గా పని చేస్తోంది. ఈమె కొడుకు రాంచందర్ కొత్తగూడెంలోని స్వీట్‌షాపులో పని చేస్తున్నాడు. తల్లి సొంత ఇంట్లోనే ఓ గదిలో ఉంటుండగా, మరో పోర్షన్‌లో రాంచందర్ ఉంటున్నాడు.
మద్యానికి బానిసైన రాంచందర్ డబ్బుల కోసం తల్లిని తరచూ వేధించేవాడు. శనివారం రాత్రి సైతం రూ. 2 వేలు ఇవ్వాలని తల్లి సక్కుబాయిని అడిగాడు. ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న గొడ్డలి తీసుకొని తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో సక్కుబాయి మెడ, చేయిపై తీవ్రగాయాలయ్యాయి. అరుపులకు స్థానికులు వచ్చి సక్కుబాయిని 108లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మరణించింది. ఆదివారం ఉదయం పత్తి చేనులో నిందితుడు రాంచందర్ పడుకొని ఉండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డబ్బులివ్వలేదని కన్నతల్లిని కడతేర్చిన కొడుకు
Published Mon, Feb 23 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement