కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
Published Thu, Aug 4 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
గోదావరిఖని : బొగ్గుగని కార్మికుల పదో వేజ్‌బోర్డులో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చించి వేతన ఒప్పందాన్ని చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేశ్ డిమాండ్ చేశారు. రెండేళ్ల చర్చల ఫలితంగా దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మిక సంఘాలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఐక్య ఉద్యమం నిర్వహించడంలో ఐఎఫ్‌టీయూ విజయం సాధించిందని తెలిపారు. ఆగస్టు 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఏడు రాష్ట్రాల ధర్నాలో ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు అపర్ణ, ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్, టి.శ్రీనివాస్, ఎ.వెంకన్న. జె.సీతారామయ్య, శంకర్‌ముదిరాజ్ పాల్గొన్నారని గుర్తుచేశారు. 2013 జనవరి నుంచి అమలు కావాల్సిన హైపవర్ కమిటీ వేతనాలపై వేజ్‌బోర్డు సంఘాలు స్పందించడం లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులకు హెచ్‌పీసీ వేతనాలు అమలు జరిగిన దాఖలాలు లేవని తెలిపారు. 10 వేజ్‌బోర్డులో కాంట్రాక్టు కార్మికులకు వేతన ఒప్పందాన్ని వర్తింపజేసి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారని, ధర్నా అనంతరం కేంద్ర బొగ్గు గనుల కార్యదర్శికి వినతిపత్రం అందించారని గుర్తుచేశారు.
Advertisement