సీఎంకు నివేదిక సమర్పించిన మీడియా అక్రిడిటేషన్ కమిటీ
హైదరాబాద్: పాత్రికేయుల అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ గురువారం ముఖ్యమంత్రికి తన నివేదికను సమర్పించింది. అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కమిటీ సభ్యులు కె.శ్రీనివాసరెడ్డి (మన తెలంగాణ), క్రాంతికిరణ్ (జై తెలంగాణ), గౌరిశంకర్ (దక్కన్ క్రానికల్) తదితరులు గురువారం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు త్వరగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్ దీనిపై త్వరలో ప్రభుత్వం తమ పాలసీని ప్రకటిస్తుందని చెప్పారు. సాంస్కృతిక సలహాదారు కెవి.రమణాచారి, సమాచార శాఖ కమిషనర్ బి.పి.ఆచార్య, డెరైక్టర్ సుభాష్‌గౌడ్ తదితరులు ఈ భేటీలో ఉన్నారు.
త్వరలోనే అక్రిడిటేషన్ పాలసీ: కేసీఆర్
Published Fri, May 1 2015 12:50 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement