సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్‌పీడీసీఎల్)లో కాంట్రాక్టు పనుల అప్పగింత తీరును ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్‌బుక్’తో పాటు పత్రికలో ప్రకటనలు చేసిన ఏడీఈ డి.కోటేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తున్న ట్లు సంస్థ ప్రకటించింది. సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తరపున రెండు రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి.వాటిలో పేర్కొన్న వివరాల ప్రకారం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం హెచ్‌ఆర్ విభాగం ఏడీఈ డి.కోటేశ్వర్‌రావు ఇటీవల సంస్థ ద్వారా రూ.30 కోట్లు విలువ చేసే 4,769 ట్రాన్స్‌ఫార్మర్ కంచె పనులకు ప్రదీప్ ఎలక్ట్రానిక్స్ అనే కాంట్రాక్టరుకు అప్పగించడాన్ని ప్రశ్నించారు.
రేట్లను పెంచుతూ వాటిని అప్పగించడంపై సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్‌బుక్’లో సుదీర్ఘ ప్రసం గాన్ని పోస్ట్ చేస్తూ, సంస్థకు చెందిన కొందరు ఇంజనీర్లపై ఆరోపణలు చేశారు. దీనిపై సంస్థ యాజమాన్యం మౌనం వహించడాన్ని ప్రశ్ని స్తూ చేసిన ప్రకటన ప్రచురితమైంది. ఇలా సంస్థ నియమావళిని ఉల్లంఘించారని భావి స్తూ కోటేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అభియోగాలు అమల్లో ఉన్నంత కాలం ఏడీఈ కోటేశ్వర్‌రావు హెడ్‌క్వార్టర్‌ను అనుమతి లేకుండా విడిచి వెళ్లరాదని ఆదేశించారు.
నేను నష్టపోయినా పరవాలేదు : ఏడీఈ కాంట్రాక్టు పనులను నామినేషన్ పద్ధతిలో ఒకే కాంట్రాక్టరుకు అప్పగించడాన్ని ప్రశ్నించిన తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై కోటేశ్వర్‌రావు స్పందించారు. వ్యక్తిగతంగా నష్టపోయినా సంస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో తన పనితీరుకు మెచ్చి సంస్థ విజిలెన్స్ విభాగం అవార్డు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్న తాను, ప్రస్తుతం బాధపడుతున్నానని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వాస్తవాలు చేరేలా చూడాలని ఓ ప్రకటనలో కోటేశ్వర్‌రావు కోరారు. కాగా అక్రమాలను వెలుగులోకి తెచ్చే విజిల్ బ్లోయర్స్‌కు రక్షణ కల్పిస్తూ గతంలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ యాజమాన్యం తెచ్చిన ‘విజిల్ మెకానిజమ్ పాలసీ’ని ఉల్లంఘిస్తూ కోటేశ్వర్‌రావును సస్పెండ్ చేశారని ‘విజల్ బ్లోయర్’సంస్థ విమర్శించింది.
దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ఏడీఈ సస్పెన్షన్
Published Thu, Feb 20 2020 3:09 AM | Last Updated on Thu, Feb 20 2020 3:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment