శిక్షణ కష్టం.. అధిగమిస్తే సుఖం
► భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా
సత్తుపల్లిరూరల్: ‘‘బెటాలియన్‌లో శిక్షణ కొద్దిగా కష్టంగా ఉంటుంది. దీనిని అధిగమిస్తే అంతా సుఖమే.. మీ భవిష్యత్తంతా బంగా రమే’’ అని, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన 195 మందికి శిక్షణ కార్యక్రమం సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఆవరణలో జరుగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమంలో సోమవారం ముఖ్య అతిథిగా ఎస్పీ పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. కష్టంతో కూడుకున్న శిక్షణను అధిగమించాలని కోరారు. ‘‘ఈ ఉద్యోగం రాక ముందు మీరు ఎలా ఉన్నప్పటికీ.. ఈ ఉద్యోగంలో చేరిన తరువాత మాత్రం మీ ప్రవర్తన సక్రమంగా ఉండా లి. క్రమశిక్షణతో ఉండాలి. ఎదుటి వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. తెలివితేటలతో ఉండాలి’’ అన్నారు. కార్యక్రమంలో కల్లూరు ఏఎస్పీ బల్లా రాజేష్, గంగారం 15వ ప్రత్యేక పోలీస్ కమాండెంట్ బి.రామ్‌ప్రకాష్, డీఎస్పీ చత్రియనాయక్ పాల్గొన్నారు.