ambar kishor jha
-
కానిస్టేబుల్ దుశ్చర్యపై స్పందించిన ఝా
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రి తరలింపుకు నిరసనగా ఆందోళన చేపట్టిన విద్యార్థినిపై ఓ పోలీసు కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. సౌత్ జోన్ డీసీసీ అంబర్ కిషోర్ ఝా స్పందించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి తరలింపును నిరసిస్తూ ఆందోళన చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే అక్కడ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని వార్తలు వస్తున్నాయని చెప్పారు. వీడియోలు పరిశీలించి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే కానిస్టేబుల్ అది ఉద్దేశపూర్వకంగా చేశారా, లేక విధి నిర్వహణలో భాగంగా అలా జరిగిందా అనే దానిపై విచారణ జరిపి చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆ వీడియోలను టీవీల్లో ప్రసారం చేయకుండా తాత్కాలికంగా నిలపివేయాలని కోరారు. విద్యార్థులు ఆందోళన చేసేటప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. చదండి : విద్యార్థినిపై పోలీసు వికృత చర్య.. -
శిక్షణ కష్టం.. అధిగమిస్తే సుఖం
► భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా సత్తుపల్లిరూరల్: ‘‘బెటాలియన్‌లో శిక్షణ కొద్దిగా కష్టంగా ఉంటుంది. దీనిని అధిగమిస్తే అంతా సుఖమే.. మీ భవిష్యత్తంతా బంగా రమే’’ అని, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన 195 మందికి శిక్షణ కార్యక్రమం సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఆవరణలో జరుగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమంలో సోమవారం ముఖ్య అతిథిగా ఎస్పీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కష్టంతో కూడుకున్న శిక్షణను అధిగమించాలని కోరారు. ‘‘ఈ ఉద్యోగం రాక ముందు మీరు ఎలా ఉన్నప్పటికీ.. ఈ ఉద్యోగంలో చేరిన తరువాత మాత్రం మీ ప్రవర్తన సక్రమంగా ఉండా లి. క్రమశిక్షణతో ఉండాలి. ఎదుటి వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. తెలివితేటలతో ఉండాలి’’ అన్నారు. కార్యక్రమంలో కల్లూరు ఏఎస్పీ బల్లా రాజేష్, గంగారం 15వ ప్రత్యేక పోలీస్ కమాండెంట్ బి.రామ్‌ప్రకాష్, డీఎస్పీ చత్రియనాయక్ పాల్గొన్నారు.