హైదరాబాద్‌ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లు | Special Trains Between Hyderabad and Visakhapatnam | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లు

Published Tue, Sep 19 2017 1:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Special Trains Between Hyderabad and Visakhapatnam

సాక్షి, హైదరాబాద్ ‌: దసరా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌– విశాఖపట్నం, హైదరాబాద్‌–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌–విశాఖపట్నం (07148/ 07147) ప్రత్యేక రైలు ఈ నెల 28, 30 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, అక్టోబర్‌ 1న సాయంత్రం 7.20 గంటలకు విశాఖ పట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50కి హైదరాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌–కాకినాడ (07001/ 07002) ప్రత్యేక రైలు ఈ నెల 27, 29 తేదీల్లో సాయంత్రం 6.50కి హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.35కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, అక్టోబర్‌ 2 తేదీల్లో సాయంత్రం 5.55కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కి  హైదరాబాద్‌ చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement