వేగంగా పనులు | speed up to Road construction | Sakshi
Sakshi News home page

వేగంగా పనులు

Published Mon, Jan 4 2016 1:43 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM

speed up to Road construction

వరంగల్ : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం, విస్తరణ పనుల తీరు అధ్వానంగా ఉందనే అంశాలపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలతో కలెక్టర్ వాకాటి కరుణ స్పందించారు. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

వేసవిలోపు అన్ని పనులు పూర్తి చేసేందుకు ఈ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. రోడ్ల పనుల్లో నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రోడ్ల పనుల తీరుపై త్వరలోనే సమగ్ర సమావేశం నిర్వహించి కాలపరిమితో లక్ష్యాలు నిర్ణయించేలా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement