Panchayati Raj Engineering Department
-
రూ.1,045 కోట్లతో కొత్త రోడ్లు
సాక్షి, అమరావతి/దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా పెద్దఎత్తున కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ప్రధానంగా పట్టణాలతో వాటి సమీపంలోని గ్రామాలను కలిపే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. 20 రోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే 202 రోడ్లను రూ.784.22 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులతో పాటు పునర్నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీటికి అదనంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 916.22 కిలోమీటర్ల పొడవున మరో 115 తారు రోడ్లను కొత్తగా నిర్మించనుంది. వీటికితోడు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రోడ్ల మార్గమధ్యంలో ఉండే 72 పెద్దస్థాయి వంతెనలను కూడా పునర్నిర్మించనుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెండ్రోజుల క్రితం ఆదేశాలు జారీచేశారు. ఈ 72 వంతెనల పొడవే 6.670 కిలోమీటర్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇక కొత్తగా నిర్మించ తలపెట్టిన 916.22 కి.మీ. రోడ్ల నిర్మాణానికి రూ.576.15 కోట్లు.. 72 వంతెనల నిర్మాణానికి ఇంకో రూ.469.29 కోట్లు కలిపి ఈ విడతలో మొత్తం రూ.1,045.44 కోట్లు ఖర్చుకానుంది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ: డిప్యూటీ సీఎం ఇక కొత్తగా 115 తారురోడ్ల నిర్మాణంతో పాటు 72 పెద్దస్థాయి వంతెనల పునర్నిర్మాణానికి సంబంధించి మొత్తం 187 అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పనులకు సంబంధించి ఆర్థి క శాఖ నుంచి పరిపాలన ఆమోదం లభించిన అనంతరమే ఉత్తర్వులు వెలువడ్డాయని, టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేసి వీలైనంత త్వరగా పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రోడ్ల అభివృద్ధికి ఒకేసారి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. రోడ్ల అభివృద్ధి పనులతోపాటు వంతెనల నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ప్రజలకు రహదారి కష్టాలు తీరుతాయన్నారు. -
కాంట్రాక్టర్ ఎక్సెస్ వేస్తే ‘రీ టెండరే’
సాక్షి, అమరావతి: టెండర్లలో సంబంధిత పనికి ముందుగా అధికారులు నిర్ధారించిన దానికన్నా కాంట్రాక్టర్ అధిక ధరకు కోట్ చేస్తే.. మరోసారి అదే పనికి రీ టెండర్లు నిర్వహించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పెంపొందించడంతోపాటు ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల రుణాలతో చేపట్టే పనుల్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం, ఆయా సంస్థల నియమ నిబంధనల మేరకే టెండర్లు నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఆయా పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలంటే నిబంధనలు ఆటంకంగా మారాయి. ► గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) మూడో దశ అమల్లో రాష్ట్రానికి ఈ ఏడాది కొత్తగా 3,285 కి.మీ రోడ్డు పనులు మంజూరయ్యాయి. ► ఈ పనులకయ్యే ఖర్చును 60–40 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ► 935 కి.మీ పొడవునా రూ.535 కోట్లతో చేపట్టే 129 రోడ్ల పనులకు అన్ని అనుమతులు పూర్తయి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ► ఇందులో రూ.150 కోట్ల విలువ చేసే 39 పనులకు పంచాయతీరాజ్ విభాగం టెండర్ పూర్తి చేసింది. వీటిలో 30 పనులకు కాంట్రాక్టర్లు పని అంచనా విలువ మీద 5% దాకా అధిక రేటుకు కోట్ చేశారు. ► పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలంటే కేంద్ర నిబంధనలు అడ్డొస్తున్నాయని అధికారులు చెప్పారు. ► దీంతో ఆ 30 పనులకు మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధిక ధర కోట్ చేసిన ఆ 30 పనులకు అధికారులు తిరిగి రెండో విడత టెండర్లు నిర్వహించే ప్రక్రియను చేపట్టారు. ► ప్రభుత్వ తాజా నిర్ణయంతో రూ.150 కోట్లు విలువ చేసే పనుల్లోనే రూ.7.5 కోట్ల మేర ప్రజాధనం ఆదా కాగా.. 3,285 కి.మీ పొడవునా చేపట్టే పనుల్లో దాదాపు రూ.85 కోట్లకు పైబడి ఆదా చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
పీఆర్‌పై నిఘా
రోడ్ల పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యతపై ఆరోపణలు ఉన్నతాధికారులు సమీక్షించినా మారని తీరు.. ఇంజనీరింగ్ శాఖపై ఏసీబీ నజర్ సర్వత్రా కొనసాగుతున్న చర్చ వరంగల్ : ప్రజల అవసరాలను తీర్చే రోడ్ల నిర్మాణంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. స్వయంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ వచ్చి సమీక్షించినా ఆ శాఖ అధికారుల తీరులో మార్పు రాలేదు. దీంతో ఉన్నతస్థాయిలో ఈ విభాగంపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆ శాఖలో జరుగుతున్న పనుల జాప్యం, నాణ్యత లేమిపై విజిలెన్స్ విభాగం దృష్టి పెట్టినట్లు సమాచారం. రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, పూర్తికాని పనులకు బిల్లులు చెల్లించడం వంటి విషయాలపై అవినీతి నిరోధక శాఖ సైతం ఆరా తీస్తోంది. ఇంజనీరింగ్ విభాగంలోని కార్యకలాపాలపై ప్రభుత్వ నిఘా విభాగం, అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టడంతో ఆ శాఖ అధికారుల్లో ఇదే చర్చ జరుగుతోంది. అరుుతే రోడ్ల నిర్మాణ పనుల విషయంలో మాత్రం అధికారుల్లో మార్పు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జనవరి 5న జిల్లా అభివృద్ధిపై ఉన్నతాధికారులతో నగరంలోని నందన గార్డెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల ఎంపిక, ప్రారంభించిన పనులు పూర్తి చేయడంలో ఈ శాఖ అధికారుల తీరును సమావేశంలో తప్పుపట్టారు. మేడారం జాతర ఏర్పాట్ల ప్రక్రియలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఊరట్టం-మల్యాల రోడ్డు నిర్మా ణ పనులు చేపట్టకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్.. పంచాయతీరాజ్ ఎస్ఈ సత్తయ్య పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ రోడ్డును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించిన తర్వాత సైతం జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభా గం పనితీరులో మార్పు కనిపించడం లేదు. ఇంజనీర్ ఇన్ చీఫ్ వచ్చి ఆదేశాలు ఇచ్చినా కదలిక ఉండడం లేదు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల పునరుద్ధరణ(రెన్యూవల్) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.416 కోట్లు మంజూరు చేసింది. మేడారంలో రోడ్ల పనుల కోసం మరో రూ.12.15 కోట్లను విడుదల చేసింది. రూ.230.35 కోట్లతో 1676.37 కిలోమీటర్ల పొడవైన బీటీ రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. జిల్లాలో కొత్తగా 396.83 కిలో మీటర్ల మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేసేందుకు రూ.185.71 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రోడ్ల పనులు పూర్తి చేయడంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చేపట్టిన కొన్ని పనుల్లోనూ నాణ్యత లేకపోవడంపై విమర్శలు వస్తున్నా ఈ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. -
వేగంగా పనులు
వరంగల్ : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం, విస్తరణ పనుల తీరు అధ్వానంగా ఉందనే అంశాలపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలతో కలెక్టర్ వాకాటి కరుణ స్పందించారు. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వేసవిలోపు అన్ని పనులు పూర్తి చేసేందుకు ఈ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. రోడ్ల పనుల్లో నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రోడ్ల పనుల తీరుపై త్వరలోనే సమగ్ర సమావేశం నిర్వహించి కాలపరిమితో లక్ష్యాలు నిర్ణయించేలా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. -
మీరూ చూడరా..!
* పంచాయతీరాజ్ రోడ్ల పనులపై పెద్దల ఉదాసీనత * పట్టించుకోని డిప్యూటీ సీఎం, కలెక్టర్ * శాఖ పనితీరుపై సమీక్షలు చేయని దుస్థితి సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ లక్ష్యాలకు అనుణంగా పనిచేయల్సిన శాఖలు ఆ పనులను విస్మరిస్తున్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తీరు మరీ అధ్వానంగా ఉంది. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే ప్రభుత్వ ఆశయానికి పంచాయతీరాజ్ శాఖ విఘాతం కలిగిస్తోంది. రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. జిల్లాకు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల పునరుద్ధరణకు రూ.416 కోట్లు మంజూరు చేసింది. రూ.230.35 కోట్లతో 1676.37 కిలో మీ టర్ల పొడవైన బీటీ రోడ్లు పునరుద్ధరించాలని నిర్ణయించింది. కొత్తగా 396.83 కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేసేందుకు రూ.185.71 కోట్లు విడుదల చేసింది. అయితే, నిధులను ఖర్చు చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం.. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోంది. జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పనితీరు అధ్వాన్నంగా ఉన్నదన్న విషయూన్ని గ్రహించి న ఆ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఎం.సత్యనారాయణరెడ్డి స్వయంగా జిల్లాకు వచ్చి సమీక్షలు నిర్వహించారు. జిల్లా అధికారులు పనితీరు మార్చుకోవాలని గట్టిగా చెప్పారు. అయినా అధికారుల తీరు మా త్రం మారడం లేదు. అధికారుల తరహాలోనే రోడ్ల పను లు చేసే కాంట్రాక్టర్ల తీరూ అలాగే ఉంది. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరితో జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతోంది. రూ.416 కోట్లతో చేపట్టిన పనుల విషయంలో జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లుగా ఉంటుండడంపై గ్రామీణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రోడ్ల పనులు చేయకపోవడం, చేసినా.. కొన్ని పనులు నాసిరకంగా ఉండ డం, మరికొన్ని పనులు మధ్యలోనే నిలిపివేయడం వం టివి జరుగుతున్నా... ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ వాకాటి కరుణ పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయించాల్సిన అత్యున్నత ప్రజాప్రతినిధి, పాలనాధికారి సమీక్షలు సైతం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ విభాగంలోని రోడ్ల పునరుద్ధరణ పనులు కొన్నిచోట్ల మరీ నాసిరకంగా జరుగుతున్నట్లు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా ప్రభుత్వ పరంగా ఎవరూ పట్టించుకోకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
ఇంత నిర్లక్ష్యమా!
నాలుగు డివిజన్లలో అదే తీరు సాగని పంచాయతీరాజ్ రోడ్ల పనులు పట్టించుకోని ఈఈలు, డీఈలు నాణ్యతపై దృష్టి పెట్టని అధికారులు పీఆర్.. పూర్-2 వరంగల్ : ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేయడంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధ్వానంగా వ్యవహరిస్తోంది. రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ(రెన్యూవల్) విషయంలో ఈ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజలు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తోంది. రోడ్లు సరిగా లేక ప్రజలు రవాణా పరంగా చెప్పలేని కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి జిల్లాలో వరంగల్, ములుగు, మహబూబాబాద్, వరంగల్(పీఐయూ) విభాగాలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని డివిజన్లలోనూ బీటీ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ప్రభుత్వంఅనుమతి ఇచ్చి ఏడాది కావస్తున్నా... జిల్లాలో రోడ్ల పనులు ముందుకు సాగడం లేదు. తారు రోడ్డు పునరుద్ధరణ, నాణ్యత పనుల విషయంలో అధికారుల తీరు అధ్వానంగా ఉంది. కొత్తగా రోడ్డు వేసేందుకు వీలుగా... గుంతలు పడి ఉన్న రోడ్లను ఏడాది క్రితమే పూర్తిగా తొలగించారు. అలాంటి చోట్ల ఇప్పటికీ తారు వేయలేదు. ఆ రోడ్లపై కంకర తేలడంతో పాటు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రజలు నడిచేందుకు కూడా వీలులేక ఇబ్బంది పడుతున్నా రు. పాత రోడ్లను తొలగించి, కొత్తగా వేయని చోట్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా ప్రజ లు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన రవాణా వసతి కల్పించేందుకు కొత్తగా రోడ్లు వేయాలని భావిస్తే... క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. తమ కష్టాలను పట్టించుకోని పం చాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారుల్లో ఇప్పటికైనా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పునరుద్ధరణ ఇలా... మహబూబాబాద్ డివిజన్ పరిధిలో 514.42 కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణకు రాష్ట్రఫ్రభుత్వం రూ.75.70 కోట్లు మంజూరు చేసింది. 159 పనులుగా పేర్కొంటూ అధికారు లు ఏడాది క్రితం టెండర్లు పూర్తి చేశారు. అరుుతే వారి నిర్లక్ష్యంతో ఈ డివిజన్లో పనులు సక్రమంగా సాగ డం లేదు. 68 కిలో మీటర్ల మేర 14 పనులే పూర్తయ్యాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోడ్ల పనుల్లో 13.26 శాతమే చేపట్టారు. వరంగల్ ప్రాజెక్టులో అమలు విభాగం(పీఐయూ) డివిజన్ లో 490 కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 65.52 కోట్లు మంజూరు చేసింది. 119 పనులుగా గుర్తించి టెండర్లు పూర్తి చేశారు. ఇప్పటి వరకు 134 కిలోమీటర్ల రోడ్ల నే పునరుద్ధరించారు. ఇంకా 90 పనులు చేపట్టాల్సి ఉంది. ములుగు డివిజన్ పరిధిలో 345 కిలో మీటర్ల రోడ్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం రూ.46.76 కోట్లు మంజూరు చేసింది. 99 పనులుగా వీటిని మొదలు పెట్టారు. అందులో ఇప్పటికి 98 కిలో మీటర్ల మేర మాత్రమే బీటీ రోడ్లను పునరుద్ధరించారు. అధికారుల నిర్లక్ష్యంతో 28 శాతమే పనులు పూర్తయ్యాయి.వరంగల్ డివిజన్ పరిధిలో 326 కిలోమీటర్ల రోడ్ల పునురుద్ధరణకు ప్రభుత్వం రూ.42.35 కోట్లు మంజూరు చేసింది. 86 పనులుగా విభజించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత పనుల తీరును అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికి 183.29 కిలోమీటర్ల మేర 49 పనులే పూర్తి చేశారు. కొత్త రోడ్లదీ అదే తీరు... ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 396 కిలో మీటర్ల మేర కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.185.71 కోట్లు మంజూరు చేసింది. 152 పనులుగా గుర్తించిన అధికారు లు.. ఏడాది క్రితమే టెండర్లు పూర్తి చేశారు. అరుుతే ఇప్పటి వరకు 14.61 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ములుగు డివిజన్ పరిధిలో 101 కిలో మీటర్ల మేర కొత్తగా బీటీ రోడ్లను నిర్మించేందుకు రూ.101 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏడాదిగా జరుగుతున్నా ఇప్పటికి 6 కిలోమీటర్ల పనులే పూర్తయ్యాయి. వరంగల్ డివిజన్లో 53 కిలో మీటర్ల మేర కొత్త బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.24.30 కోట్లు మంజూరయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికి కేవలం మూడు కిలోమీటర్ల పనులే పూర్తయ్యాయి. ఈ డివిజన్లో అధికారుల పనితీరు మరీ అధ్వానంగా ఉంది. మహబూబాబాద్ డివిజన్లో 97 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.45.70 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికి 40 కిలోమీటర్ల మేరకే రోడ్డు వేశారు. ఈ డివిజన్ పరిధిలో 41 పనులు మొదలైతే ఇప్పటికి తొమ్మిది మాత్రమే పూర్తయ్యాయి.వరంగల్ ప్రాజెక్టుల అమలు విభాగం(పీఐయూ) డివిజన్ పరిధిలో 144 కిలోమీటర్ల మట్టి రోడ్డును బీటీగా మార్చేం దుకు ప్రభుత్వం రూ.64.23 కోట్లు మంజూరు చేసింది. ఈ డివిజన్లో ఇంజనీరింగ్ అధికారులు విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఆరు కిలోమీట ర్ల మేరకే బీటీ రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
ప్రగతినగర్ : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గత సమావేశంలో జిల్లాకు సంబంధించి రహదారుల మ్యాప్‌ను అందించాలని చెప్పినప్పటికీ సిద్ధం చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎస్ఈ శంకరయ్య, ఈఈలు రాజేంద్రప్రసాద్, సీతారాములు, మాధవి, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఆలోచించండి.. స్వయం సహాయక సంఘాల ద్వారా కొత్తగా మార్కెటింగ్ చేసి లాభదాయక వ్యాపారాలు నిర్వహించేలా ఆలోచనలు చేయాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ డీఆర్డీఏ, మెప్మా అధికారులకు సూచించారు. ఆయా శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సంఘాలను కేవలం వరి, మొక్కజొన్న కొనుగోలుకు మాత్రమే పరిమితం చేయకుండా వారు ఏ రకమైన వ్యాపారాలు నిర్వహిస్తే లాభదాయకంగా ఉంటుందో సూచించాలన్నారు. విద్యార్థుల యూనిఫారాలు, పెన్సిళ్లు, పాదరక్షలు, నోటుపుస్తకాలు, కూరగాయలు, పాలు తదితర వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించేలా చూడాలన్నారు. మహిళ సంఘాలకు మంజూరు చేసే లింకేజీ రుణాలను ఇతర రుణాల బకాయిలను బదిలీ చేయకుండా బ్యాంకర్లకు సూచనలు చేయాలన్నారు. సంఘాలు బలోపేతం కావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం పీడీలు వెంకటేశం, సత్యనారాయణ, డీపీఎంలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి నిర్వహించాలి నిజామాబాద్‌నాగారం: ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్, మండల స్థాయిల్లో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ శుక్రవారం ఒక ప్రకటనలో సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సోమవారం తమ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు, ఆర్జీదారులు ఈ విషయాన్ని గమనించి, సంబంధిత మండలాల్లోనే తమ సమస్యలపై దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. -
నిధులకు గాలం.. పనులకు తాళం!
ఒక నిర్మాణాన్ని మొదలు పెట్టేముందు.. అందుకు సంబంధించి ముడిసరుకు, పని, వ్యయం తదితర అంచనాలు వేసి ఆ తర్వాత పని ప్రారంభిస్తాం. సాధారణంగా అందరూ ఇదే తరహా ప్రణాళికతో రంగంలోకి దిగుతారు. కానీ మన పంచాయతీరాజ్ ఇంజినీర్ల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ముందుగా పనులు మొదలుపెట్టి.. కొంత మొత్తాన్ని ఖర్చు చేసిన తర్వాత అంచనాలు వేశారు. నిర్మాణానికి కేటాయించిన మొత్తం చాలడం లేదంటూ చేతులెత్తేశారు. మరిన్ని నిధులిస్తేనే పనులు చేస్తామని మెలిక పెట్టి నిధులను అట్టిపెట్టుకోవడం గమనార్హం. సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం తయారీకిగానూ కిచెన్ షెడ్ల ఏర్పాటుకు సర్కారు సిద్ధ్దమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని 1,147 పాఠశాలలకు కిచెన్ షెడ్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించింది. ఈ తంతు జరిగి మూడేళ్ళు కావస్తున్నా.. పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ మూడేళ్ల కాలంలో కేవలం 56 కిచెన్‌షెడ్లను పూర్తి చేసి ఇంజనీర్లు మమ అనిపించడం గమనార్హం. ఎందుకీ జాప్యం.. ఒక్కో కిచెన్ షెడ్డుకు రూ.75వేల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మొత్తంతో నిర్దేశిత విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టవచ్చని ప్రభుత్వం భావించి ఈమేరకు నిధులు విడుదల చేసింది. అయితే జిల్లా పంచాయతీరాజ్ అధికారులకు మాత్రం ఈ నిధులు చాలడం లేదట. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా రూ.75వేలకో కిచెన్ షెడ్డు నిర్మించడం సాధ్యం కాదని ఇంజినీర్లు తేల్చిచెప్పారు. దీంతో పనులు గ్రౌండ్ చేసిన 205 నిర్మాణాలను ఎక్కడికక్కడ వదిలేశారు. నిర్మాణ వ్యయం రూ.25 వేలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఇంజనీర్లు.. ఆ మొత్తాన్ని ఇస్తేనే పనులు చేస్తామంటూ స్పష్టం చేయడంతో యంత్రాంగం తలపట్టుకుంది. సర్దుకు పోరట.. నిధులు విడుదల చేసి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిపై ఇటీవల కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిధుల పెంపు అంశాన్ని ఇంజినీర్లు ప్రస్తావించారు. నిధులు పెంచే అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున కొంత సర్దుబాటు చేసి పనులు చేస్తే సరిపోతుందని విద్యాశాఖ సలహా ఇచ్చింది. పాఠశాలలో ఇప్పటికే నిర్మించి ఉన్న ప్రహరీ సపోర్టు తీసుకొని.. స్లాబుకు బదులుగా రేకులు వేసి నిర్మాణాలు పూర్తి చేస్తే మేలు జరుగుతుందని సూచించింది. అయితే ఈ సూచన పంచాయతీరాజ్ ఇంజనీర్లకు రుచించలేదు. దీంతో అలా సర్దుకుపోబోమని స్పష్టం చేసిన ఇంజనీర్లు.. తమ మాటే నెగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద నిర్మాణాలు నిలిచిపోగా మూడేళ్ల పాటు ఖజానాలో రూ.కోట్లు మురుగుతుండడం కొసమెరుపు. -
విభజన ఫలితం.. శాఖల విలీనం!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన యువతకు, పలు శాఖల ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరం కానున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు తగ్గిపోతాయి. కొత్త రాష్ట్రంలో ఆర్థిక లోటు కారణంగా జీతాలు సకాలంలో అందుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది. పలు ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ శాఖలు సంబంధిత మాతృ శాఖల్లో విలీనం కానున్నాయి. ఇప్పటికిప్పుడు వీటిపై నిర్ణయాలు, జీవోలు వెలువడకపోయినా జూన్ రెండో తేదీ తర్వాత 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. అన్ని స్థాయిలో రాష్ట్రా న్ని పునర్మిర్మించాల్సి ఉంటుంది. అప్పుడు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బం దులు, అవసరాలు, పొదుపు, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా అనేక కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వీటిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జీవో నెం.67 ద్వారా రెవెన్యూ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మంగళం పాడారు. భూసేకరణ యూ నిట్‌లలో ఉద్యోగుల సంఖ్యనుకుదించారు. వైద్య, ఆరోగ్య శాఖ, విద్య, సంక్షేమం, తదితర శాఖలోలనూ ఉద్యోగుల కుదింపు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు నిర్ణయాలు త్వరలోనే అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాఖల విలీనం వల్ల ఉన్నతాధికార పోస్టులు, సిబ్బంది సంఖ్య కూడా తగ్గిపోతాయి. పదోన్నతులు తగ్గి.. సర్వీసు, సీనియారిటీ సమస్యలు పెరుగుతాయి. ఉన్న ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు, శాఖల విలీనం, పోస్టుల కుదింపు నిర్ణయాల వల్ల ఉన్న రెగ్యులర్ సిబ్బందిని ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉండవు.. కొత్త నియామకాలూ ఉండవు. దాంతో నిరుద్యోగులకు అవకాశాలు తగ్గిపోతాయి. పలు శాఖల్లో సమీప భవిష్యత్తులో జరిగే మార్పు చేర్పులు ఇలా ఉండొచ్చు. ఖజానా శాఖలో.. పే అండ్ అకౌంట్స్, వర్క్స్ విభాగాలు విలీనమవుతా యి. గణాంక శాఖ కూడా ఖజానాకు అనుబంధంగా ఉండాల్సి వస్తుంది. ఈ శాఖలకు ఒకే ఉన్నతాధికారి ఉంటా రు. దీంతో వివిధ క్యాడర్ల ఉద్యోగులకు పదోన్నతులు నిలిచిపోవడమే కాకుం డా కొంతమంది రివర్షన్ పొందవచ్చు. సంక్షేమ శాఖలో.. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు, వికలాంగుల సంక్షేమ శాఖ, నెడ్‌క్యాప్, తదితర విభాగాలు విలీనం కాన్నాయి. ఫలితంగా సంక్షేమ పథకాలు కుంటుపడతాయి. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఐసీడీఎస్ తదితర విభాగాలు ఒక గూటి కి చేరనున్నాయి. ఇప్పటికే డీఆర్డీఏలో పలు విభాగాలు ఉన్నాయి. డ్వామా ద్వారా నీటి యాజమాన్య కార్యక్రమాలతో పాటు ఉపాధిహామీ, ఇందిర జలప్రభ, వంటి పథకాలు నిర్వహిస్తున్నారు. పని భారం ఎక్కువగా ఉంది. ఇవన్నీ విలీన మైతే ఒత్తిడి మరింత పెరుగుతుంది. జిల్లా పరిషత్‌లో.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, తదితర శాఖలు విలీనం కానున్నాయి. వ్యవసాయ శాఖలో.. హార్టికల్చర్, ఆత్మ, సెరికల్చర్, విత్తనాభివృద్ది, మార్కెటింగ్ తదితర శాఖలు, పరిశోధన కేంద్రాలు విలీనమయ్యే అవకాశం ఉంది. విద్యా శాఖలో.. ప్రాథమిక విద్యకు ఊతమిస్తున్న రాజీవ్ విద్యా మిషన్, మాధ్యమిక విద్యకు వసతులు సమకూర్చుతున్న ఆర్ఎంఎస్ఎ తదితర విభాగాలు చేరనున్నాయి. వెద్య ఆరోగ్య శాఖలో.. 104. 108, ఏపీ వైద్య విధాన పరిషత్, క్షయ, కుష్ఠు నియంత్రణ విభాగాలు కలిసిపోయే అవకాశం ఉంది.