విభజన ఫలితం.. శాఖల విలీనం!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన యువతకు, పలు శాఖల ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరం కానున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు తగ్గిపోతాయి. కొత్త రాష్ట్రంలో ఆర్థిక లోటు కారణంగా జీతాలు సకాలంలో అందుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది. పలు ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ శాఖలు సంబంధిత మాతృ శాఖల్లో విలీనం కానున్నాయి. ఇప్పటికిప్పుడు వీటిపై నిర్ణయాలు, జీవోలు వెలువడకపోయినా జూన్ రెండో తేదీ తర్వాత 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది.
అన్ని స్థాయిలో రాష్ట్రా న్ని పునర్మిర్మించాల్సి ఉంటుంది. అప్పుడు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బం దులు, అవసరాలు, పొదుపు, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా అనేక కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వీటిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జీవో నెం.67 ద్వారా రెవెన్యూ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మంగళం పాడారు. భూసేకరణ యూ నిట్లలో ఉద్యోగుల సంఖ్యనుకుదించారు. వైద్య, ఆరోగ్య శాఖ, విద్య, సంక్షేమం, తదితర శాఖలోలనూ ఉద్యోగుల కుదింపు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు నిర్ణయాలు త్వరలోనే అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాఖల విలీనం వల్ల ఉన్నతాధికార పోస్టులు, సిబ్బంది సంఖ్య కూడా తగ్గిపోతాయి.
పదోన్నతులు తగ్గి.. సర్వీసు, సీనియారిటీ సమస్యలు పెరుగుతాయి. ఉన్న ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు, శాఖల విలీనం, పోస్టుల కుదింపు నిర్ణయాల వల్ల ఉన్న రెగ్యులర్ సిబ్బందిని ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉండవు.. కొత్త నియామకాలూ ఉండవు. దాంతో నిరుద్యోగులకు అవకాశాలు తగ్గిపోతాయి. పలు శాఖల్లో సమీప భవిష్యత్తులో జరిగే మార్పు చేర్పులు ఇలా ఉండొచ్చు.
ఖజానా శాఖలో.. పే అండ్ అకౌంట్స్, వర్క్స్ విభాగాలు విలీనమవుతా యి. గణాంక శాఖ కూడా ఖజానాకు అనుబంధంగా ఉండాల్సి వస్తుంది. ఈ శాఖలకు ఒకే ఉన్నతాధికారి ఉంటా రు. దీంతో వివిధ క్యాడర్ల ఉద్యోగులకు పదోన్నతులు నిలిచిపోవడమే కాకుం డా కొంతమంది రివర్షన్ పొందవచ్చు.
సంక్షేమ శాఖలో.. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు, వికలాంగుల సంక్షేమ శాఖ, నెడ్‌క్యాప్, తదితర విభాగాలు విలీనం కాన్నాయి. ఫలితంగా సంక్షేమ పథకాలు కుంటుపడతాయి. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఐసీడీఎస్ తదితర విభాగాలు ఒక గూటి కి చేరనున్నాయి. ఇప్పటికే డీఆర్‌డీఏలో పలు విభాగాలు ఉన్నాయి. డ్వామా ద్వారా నీటి యాజమాన్య కార్యక్రమాలతో పాటు ఉపాధిహామీ, ఇందిర జలప్రభ, వంటి పథకాలు నిర్వహిస్తున్నారు. పని భారం ఎక్కువగా ఉంది. ఇవన్నీ విలీన మైతే ఒత్తిడి మరింత పెరుగుతుంది.
జిల్లా పరిషత్‌లో.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, తదితర శాఖలు విలీనం కానున్నాయి.
వ్యవసాయ శాఖలో.. హార్టికల్చర్, ఆత్మ, సెరికల్చర్, విత్తనాభివృద్ది, మార్కెటింగ్ తదితర శాఖలు, పరిశోధన కేంద్రాలు విలీనమయ్యే అవకాశం ఉంది.
విద్యా శాఖలో.. ప్రాథమిక విద్యకు ఊతమిస్తున్న రాజీవ్ విద్యా మిషన్, మాధ్యమిక విద్యకు వసతులు సమకూర్చుతున్న ఆర్‌ఎంఎస్‌ఎ తదితర విభాగాలు చేరనున్నాయి.
వెద్య ఆరోగ్య శాఖలో.. 104. 108, ఏపీ వైద్య విధాన పరిషత్, క్షయ, కుష్ఠు నియంత్రణ విభాగాలు కలిసిపోయే అవకాశం ఉంది.