ఇంత నిర్లక్ష్యమా! | So carefree! | Sakshi
Sakshi News home page

ఇంత నిర్లక్ష్యమా!

Published Thu, Dec 31 2015 1:24 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

So carefree!

నాలుగు డివిజన్లలో అదే తీరు
సాగని పంచాయతీరాజ్ రోడ్ల పనులు
పట్టించుకోని ఈఈలు, డీఈలు
నాణ్యతపై దృష్టి పెట్టని అధికారులు

పీఆర్.. పూర్-2
 
వరంగల్ : ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేయడంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధ్వానంగా వ్యవహరిస్తోంది. రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ(రెన్యూవల్) విషయంలో ఈ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజలు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తోంది. రోడ్లు సరిగా లేక ప్రజలు రవాణా పరంగా చెప్పలేని కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి జిల్లాలో వరంగల్, ములుగు, మహబూబాబాద్, వరంగల్(పీఐయూ) విభాగాలు ఉన్నాయి.  జిల్లాలోని అన్ని డివిజన్లలోనూ బీటీ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ  పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ప్రభుత్వంఅనుమతి ఇచ్చి ఏడాది కావస్తున్నా... జిల్లాలో రోడ్ల పనులు ముందుకు సాగడం లేదు. తారు రోడ్డు పునరుద్ధరణ, నాణ్యత పనుల విషయంలో అధికారుల తీరు అధ్వానంగా ఉంది. కొత్తగా రోడ్డు వేసేందుకు  వీలుగా... గుంతలు పడి ఉన్న రోడ్లను ఏడాది క్రితమే పూర్తిగా తొలగించారు. అలాంటి చోట్ల ఇప్పటికీ తారు వేయలేదు. ఆ రోడ్లపై కంకర తేలడంతో పాటు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రజలు నడిచేందుకు కూడా వీలులేక ఇబ్బంది పడుతున్నా రు. పాత రోడ్లను తొలగించి, కొత్తగా వేయని చోట్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా ప్రజ లు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన రవాణా వసతి కల్పించేందుకు కొత్తగా రోడ్లు వేయాలని భావిస్తే... క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. తమ కష్టాలను పట్టించుకోని పం చాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారుల్లో ఇప్పటికైనా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

పునరుద్ధరణ ఇలా...
మహబూబాబాద్ డివిజన్ పరిధిలో 514.42 కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణకు రాష్ట్రఫ్రభుత్వం రూ.75.70 కోట్లు మంజూరు చేసింది. 159 పనులుగా పేర్కొంటూ అధికారు లు ఏడాది క్రితం టెండర్లు పూర్తి చేశారు. అరుుతే వారి నిర్లక్ష్యంతో ఈ డివిజన్‌లో పనులు సక్రమంగా సాగ డం లేదు. 68 కిలో మీటర్ల మేర 14 పనులే పూర్తయ్యాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోడ్ల పనుల్లో 13.26 శాతమే చేపట్టారు. వరంగల్ ప్రాజెక్టులో అమలు విభాగం(పీఐయూ) డివిజన్ లో 490 కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 65.52 కోట్లు మంజూరు చేసింది. 119 పనులుగా గుర్తించి టెండర్లు పూర్తి చేశారు. ఇప్పటి వరకు 134 కిలోమీటర్ల రోడ్ల నే పునరుద్ధరించారు. ఇంకా 90 పనులు చేపట్టాల్సి ఉంది.

ములుగు డివిజన్ పరిధిలో 345 కిలో మీటర్ల రోడ్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం రూ.46.76 కోట్లు మంజూరు చేసింది. 99 పనులుగా వీటిని మొదలు పెట్టారు. అందులో ఇప్పటికి 98 కిలో మీటర్ల మేర మాత్రమే బీటీ రోడ్లను పునరుద్ధరించారు. అధికారుల నిర్లక్ష్యంతో 28 శాతమే పనులు పూర్తయ్యాయి.వరంగల్ డివిజన్ పరిధిలో 326 కిలోమీటర్ల రోడ్ల పునురుద్ధరణకు ప్రభుత్వం రూ.42.35 కోట్లు మంజూరు చేసింది. 86 పనులుగా విభజించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత పనుల తీరును అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికి 183.29 కిలోమీటర్ల మేర 49 పనులే పూర్తి చేశారు.
 
కొత్త రోడ్లదీ అదే తీరు...

ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 396 కిలో మీటర్ల మేర కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.185.71 కోట్లు మంజూరు చేసింది. 152 పనులుగా గుర్తించిన అధికారు లు.. ఏడాది క్రితమే టెండర్లు పూర్తి చేశారు. అరుుతే ఇప్పటి వరకు 14.61 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
   
ములుగు డివిజన్ పరిధిలో 101 కిలో మీటర్ల మేర కొత్తగా బీటీ రోడ్లను నిర్మించేందుకు రూ.101 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏడాదిగా జరుగుతున్నా ఇప్పటికి 6 కిలోమీటర్ల పనులే పూర్తయ్యాయి. వరంగల్ డివిజన్‌లో 53 కిలో మీటర్ల మేర కొత్త బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.24.30 కోట్లు మంజూరయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికి కేవలం మూడు కిలోమీటర్ల పనులే పూర్తయ్యాయి. ఈ డివిజన్‌లో అధికారుల పనితీరు మరీ అధ్వానంగా ఉంది.

మహబూబాబాద్ డివిజన్‌లో 97 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.45.70 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికి 40 కిలోమీటర్ల మేరకే రోడ్డు వేశారు. ఈ డివిజన్ పరిధిలో 41 పనులు మొదలైతే ఇప్పటికి తొమ్మిది మాత్రమే పూర్తయ్యాయి.వరంగల్ ప్రాజెక్టుల అమలు విభాగం(పీఐయూ) డివిజన్ పరిధిలో 144 కిలోమీటర్ల మట్టి రోడ్డును బీటీగా మార్చేం దుకు ప్రభుత్వం రూ.64.23 కోట్లు  మంజూరు చేసింది. ఈ డివిజన్‌లో ఇంజనీరింగ్ అధికారులు విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఆరు కిలోమీట ర్ల మేరకే బీటీ రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement