ఖమ్మం: దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రగిరి సీతారాముల కల్యాణ శోభతో వెలిగిపోతుంది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం మిథిలా స్టేడియంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీడీడీ తరఫున ఈవో సాంబశివరావు పట్టు వస్త్రాలు సమర్పించారు.
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వేడుకలకు హాజరయ్యారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి పర్యటన చివరి నిమిషంలో రద్దు అయింది. అధికారులు మిథిలా ప్రాంగణంలో చలువ పందిళ్ల నిర్మాణం గావించారు. ప్రాంగణాన్ని సెక్టార్ల వారిగా విభజించి భక్తులు కనులారా తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
భద్రాచలంలో సీతారాముల కల్యాణ శోభ
Published Wed, Apr 5 2017 11:08 AM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM
Advertisement
Advertisement