seetha rama kalyanam
-
ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. సినిమా టెంపుల్.. అమ్మపల్లి గుడిని చూశారా? (ఫొటోలు)
-
శ్రీసీతారాముల కళ్యాణ వైభోగం
-
రమణీ లలామ..నవలావణ్య సీమ ..
సాక్షి, కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఆదివారం శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీరామ.. జయరామ... జయజయ రామ.. నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. అర్చకస్వాముల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియంలో నయనానందకరంగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగింది. సీతారాములు ఆశీనులైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. అర్చకులు తెల్లవారుజామున 2 గంటలకే దేవాలయం తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, నివేదన, శాత్తుమురై, మూలవరులకు అభిషేకం, మంగళా శాసనం జరిపించారు. తర్వాత గర్భగుడిలోని మూలమూర్తులకు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఆశీనులను చేసి మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తోడ్కొని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపించారు. సీతారాముల కల్యాణోత్సవ విశిష్టతను, భద్రాద్రి ఆలయ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, భక్త రామదాసు సేవలను, ఆయన సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల ప్రాశస్త్యాన్ని వేద పండితులు భక్తులకు వివరించారు. సీతమ్మవారికి ఎక్కడైనా మంగళసూత్రాలు రెండే ఉంటాయని, కానీ భద్రాచలంలో మాత్రం మూడు సూత్రాలు ఉంటాయని, రామదాసు చేయించిన సూత్రం ఇక్కడ అదనంగా ఉంటుందని తెలిపారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఈసీ అనుమతితో స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. కాగా, సోమవారం మిథిలా స్టేడియం ప్రాంగణంలో స్వామి కల్యాణోత్సవం జరిగిన మండపంలోనే శ్రీరామ మహా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరగనుంది. ప్రభుత్వం తరఫు న గవర్నర్ నరసింహన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. -
కమనీయం...రామయ్య కల్యాణం
వైఎస్సార్ జిల్లాలోని అపర అయోధ్య ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించారు. కనులపండువగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల రామనామ స్మరణలు మార్మోగుతుండగా పురోహితులు కల్యాణ క్రతువును చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ప్రత్యేక విమానంలో కడపకు వచ్చి, అక్కడి నుంచి రోడ్డుమార్గాన ఒంటిమిట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు సంప్రదాయంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పురోహితులు అమ్మవారి మహామంగళ సూత్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. మంగళ వాయిద్యాల మధ్య పురోహితులు స్వామి పక్షాన అమ్మవారి గళసీమలో మంగళ సూత్రాలను అలంకరించారు. - సాక్షి, కడప -
‘ఆ పార్టీకి భయపడే కేసీఆర్ రాలేదా’
సాక్షి, హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడంపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీకి భయపడే ముఖ్యమంత్రి భద్రాచలం రాలేదా అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సీతారాముల కళ్యాణానికి రాకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు అవమానంగా భావిస్తున్నారని అన్నారు. నిజాం కాలం నుంచి కళ్యాణం రోజు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని ఆయన తెలిపారు. భద్రాచలంలో గులాబీ రంగు జెండాలు కట్టుకోవడం గుర్తుంది కానీ, దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించడం గుర్తు లేదా అని ప్రశ్నించారు. మజ్లిస్‌కు భయపడి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించని ముఖ్యమంత్రి, దీన్ని కూడా అలాగే చేస్తున్నారని విమర్శించారు. రాజకీయల కోసం భారీగా ఖర్చు చేసే కేసీఆర్‌కు సెలవు రోజున భద్రాద్రికి రావడానికి ఏం అడ్డం వచ్చిందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని సీఎం కేసీఆర్ తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రభుత్వ వ్యవహారాల వల్లే నిర్మల్‌లో అల్లర్లు జరుగుతున్నాయని తాము భావించాలా అని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి రాజీనామా ప్రభుత్వ వైఖరికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో వీడియో ఫుటేజ్‌ను హైకోర్టుకు అందిస్తానని అని హామీ ఇచ్చిన ప్రకాశ్‌ను ఆ కేసు నుంచి తప్పించడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఈ కేసు విషయమై సుప్రీంకోర్టు లాయర్ హరీశ్ సాల్వేను రంగంలోకి దించడంతోనే ప్రభుత్వం తప్పు చేసినట్టు పరోక్షంగా ఒప్పుకున్నట్లే అని అన్నారు. అడ్వకేట్ జనరల్ చేయలేని పనిని హరీశ్ సాల్వే ఏం చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తీరును చూసి ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారని, త్వరలోనే వాళ్లు సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని అన్నారు. -
భద్రాచలంలో సీతారాముల కల్యాణ శోభ
ఖమ్మం: దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రగిరి సీతారాముల కల్యాణ శోభతో వెలిగిపోతుంది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం మిథిలా స్టేడియంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీడీడీ తరఫున ఈవో సాంబశివరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వేడుకలకు హాజరయ్యారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి పర్యటన చివరి నిమిషంలో రద్దు అయింది. అధికారులు మిథిలా ప్రాంగణంలో చలువ పందిళ్ల నిర్మాణం గావించారు. ప్రాంగణాన్ని సెక్టార్ల వారిగా విభజించి భక్తులు కనులారా తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. -
భద్రాచలంలో సీతారాముల కల్యాణ శోభ