‘విప్’..గప్‌చుప్..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పురపాలక సంఘాల చైర్మన్ల ఎన్నిక తేదీని త్వరలో ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 25వ తేదీలోగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు చైర్మన్ గిరీ దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ‘విప్’ వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు వస్తున్నా యి.జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల పరిధిలోని 206 వార్డులకు ఈ ఏడాది మార్చి 30న ఎన్నిక నిర్వహించారు.
ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరగడంతో మున్సిపల్ వార్డులకు జరి గిన ఎన్నికల ఫలితాలను మే 12వ తేదీన ప్రకటిం చారు. షాద్‌నగర్, గద్వాల మున్సిపాలిటీలు, ఐజ నగ ర పంచాయతీ మినహా మిగతా పురపాలక సంఘాల్లో ఏ రాజకీయ పక్షానికి స్పష్టమైన ఆధిక్యత లభించలే దు. దీంతో చైర్మన్, వైస్ పదవులు దక్కించుకునేం దుకు ఇతర పార్టీలపై ఆధార పడాల్సిన పరిస్థితి నెల కొంది. ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో ఎంపీ, ఎ మ్మెల్యే, ఎమ్మెల్సీలకు కూడా ఎన్నికలో ఓటు హక్కు కల్పించారు. దీంతో స్పష్టమైన సంఖ్యాబలం లేకున్నా ఎంపీ, ఎమ్మెల్యేల ఓటుతో పదవులు దక్కించుకునేలా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
గద్వా ల, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, ఐజ నగర పంచాయతీలో టీఆర్‌ఎస్ సొంతబలంపైనే ఆధార పడి పదవులు దక్కించుకోనున్నాయి. నారాయణపేటలో మెజారిటీ వార్డులు (12) దక్కించుకు న్న బీజేపీ మరో ముగ్గురు టీడీపీ సభ్యుల మద్దతు కూ డగట్టుకోనున్నది. వనపర్తి మున్సిపాలిటీలోనూ బీ జేపీ మద్దతుతో టీడీపీ చైర్మన్ పదవిని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే నలుగురు సభ్యులున్న బీజేపీ ఆ పదవిని ఆశిస్తోంది. ఇక్కడ తెలుగుదేశానికి స్వతంత్రుల మద్దతు కూడా కీలకం కావడంతో తమకూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
వింత రాజకీయ సమీకరణాలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, నాగర్‌కర్నూలు, క ల్వకుర్తి నగర పంచాయతీల్లో వింత రాజకీయ సమీకరణాలు తెరమీదుకు వస్తున్నాయి. మహబూబ్‌నగర్ లో ఎంఐఎం లేదా బీజేపీ మద్దతు తీసుకోవాల్సిన ప రిస్థితి కాంగ్రెస్‌కు తప్పేలా లేదు. ఎంపీ, ఎమ్మెల్యేకు ఓటు హక్కు వుండటంతో ఎంఐఎం మద్దతుతో పీఠా న్ని దక్కించుకోవాలని టీఆర్‌ఎస్ ఆరాట పడుతోంది. నాగర్‌కర్నూలులో కాంగ్రెస్, బీజేపీ నడుమ లోపాయికారీ ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది.
నాగర్‌కర్నూలు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బీజేపీ మద్దతు ఇస్తే, తెల్కపల్లి ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నికలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలనే షరతు విధించుకున్నట్లు తెలిసింది. కల్వకుర్తిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు సమాన సంఖ్యలో కౌన్సిలర్లు ఉండటంతో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన నలుగురు సభ్యుల మద్దతు కీలకం కానున్నది. అయితే స్పష్టమైన సంఖ్యాబలం లేని చోట పా ర్టీలకు అతీతంగా కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు చైర్మన్ అభ్యర్థులు గాలం వేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎ న్నికలో విప్ వర్తిస్తుందని ఈసీ స్పష్టం చే యడంతో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి.
మార్గదర్శకాలు జారీ
మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో విప్ వర్తిస్తుందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం మే 23న మార్గదర్శకాలు జారీ చేసింది. గుర్తింపు పొందిన 14 రాజకీయ పార్టీలకు విప్‌ను నియమించుకునే అధికారాన్ని కల్పిస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఒక వేళ సభ్యుడు పార్టీ విప్ ఉల్లంఘించి ఓటు వేస్తే చెల్లుతుంది. ఉల్లంఘించిన కౌన్సిలర్‌పై విప్ అధికారం కలిగిన వ్యక్తి మూడు రోజుల్లోగా ఎన్నికల అధికారికి పిర్యాదు చేయాల్సి ఉంటుంది. వారం రోజుల్లోగా సదరు కౌన్సిలర్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే విచారణ అనంతరం చర్యలు తీసుకుంటారు. విప్ వర్తిస్తుందనే వార్తల నేపథ్యంలో స్వతంత్రంగా గెలిచిన కౌన్సిలర్ల డిమాండ్లు పెరిగాయి.