
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికలసంఘం కసరత్తు ముమ్మరం చేసింది. హైకోర్టు తీర్పు అమలులో భాగంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రణాళికను శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 25న ప్రకటించిన అసెంబ్లీ స్థానాల వారీ ఓటరు జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీ లు, వార్డుల వారీగా ఎలక్టోరల్ జాబితాను నవంబర్ మొదటి వారం నుంచి మూడో వారం వరకు పోలింగ్ స్టేషన్ల వారీగా తయారు చేయనుంది. జిల్లా పంచా యతీ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పీఆర్ అండ్ ఆర్‌డీ విస్తరణ అధికారి, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించింది.
కొత్త ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలని, నవంబర్ నాలుగో వారం నుంచి డిసెం బర్ మొదటి వారంలోగా ఈ ప్ర క్రియ పూర్తి చేయాలని, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల జాబితా తయారీ, స్టేజీ–1, స్టేజీ–2 అధికారులకు ఉత్తర్వుల జారీ, శిక్షణలకు సైతం సమయాన్ని ఖరారు చేసింది. స్టేజీ–1 అధికారులకు నవంబర్ నాలుగో వారంలో, స్టేజీ–2 అధికారులకు డిసెంబర్ మొదటి వారంలో శిక్షణ పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలింగ్ సిబ్బంది సమాచారం, ఎంపిక, నియామకాల జారీని సైతం నవంబర్ రెండో వారంలో పూర్తి చేయాలని, డిసెంబర్ రెండోవారంలోగా శిక్షణ కార్య క్రమాలన్నీ పూర్తి చేయాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలిస్తూ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment