
సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని వెంటనే ఆపాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అడ్డగోలుగా భూములను వేలం వేస్తే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ఎలా చేపడతారని బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. అందుబాటు లో ఉన్న భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వ జాగాలు కనిపించవని, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యంకాదన్నారు.
వారం రోజులుగా హెచ్‌ఎండీఏ యంత్రాంగం వేలం పాట ద్వారా రూ.400 కోట్ల రియల్ వ్యాపారం సాగించిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చితే భూముల ఆవశ్యకత ఉంటుందని, రియల్ ఎస్టేట్ చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment