కరీంనగర్: కాలేజీకి ఎందుకు రాలేదని లెక్చరర్ మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ సంఘన కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మట్టపల్లిలో చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిని కాలేజీకి ఎందుకు రాలేదని అడగడంతో అవమానంగా భావించిన విద్యార్థిని పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితురాలిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.