సీకేఎం ఆస్పత్రిలో విద్యార్థిని ప్రసవం
ఎంజీఎం : ఓ కీచక టీచర్ నిర్వాకంతో పదోతరగతి విద్యార్థిని సోమవారం రాత్రి సీకేఎం ఆస్పత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం చిన్న వంగర సమీప చిన్న బంగారి తండాకు చెం దిన జాటోతు భువనేశ్వరి వంగరలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యనుభ్యసిస్తోంది. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు రామ్మూర్తి విద్యార్థిని లొంగదీసుకోవడంతో పాటు గర్భం దా ల్చడానికి కారణమయ్యాడు. ఏడు నెలల క్రి తం ఈ సంఘటన వెలుగులోకి రావడంతో వెంటనే విద్యార్థిని కుటుంబ సభ్యులతో పా టు తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఆ విద్యార్థినీ సీకేఎం ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. నెలలు నిండకముందు జ న్మించడంతో శిశువు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో నవజాత శిశు సంరక్షణ కేం ద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే విద్యార్థినీ పరిస్థితితో పాటు శిశువు వైద్య పరిస్థితిని వివరించడానికి సీకెఎం వైద్యులు నిరాకరించారు. కాగా, ఈకేసు లో నిందితుడు పరారీలో ఉన్నాడు.
పెళ్లికాని తల్లి
Published Tue, Sep 8 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM
Advertisement