bhuvanEshvarI
-
విమానంలో చంద్రబాబు భార్య.. గాల్లో 20 నిమిషాలు గందరగోళం
విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మంగళవారం ఇండిగో విమానంలో గందరగోళం నెలకొంది. ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే పైకి వచ్చిన విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానంలో చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఉండడంతో సోషల్ మీడియా ఈ వార్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఏం జరిగింది.? హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉదయం ఇండిగో విమానం వచ్చింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఇండిగో విమానాన్ని లాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే టేకాఫ్ సమయంలో విమానం చక్రాలు ఉన్న ప్యానెల్ తెరుచుకోలేదు. రెండు మార్లు ప్రయత్నించినా.. వీల్ ప్యానెల్ ఓపెన్ కాకపోవడంతో పైలట్ విమానాన్ని మళ్లీ పైకి లేపాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు (ATC) సమాచారం ఇవ్వడంతో పాటు ప్రయాణీకులకు కూడా విషయాన్ని వివరించాడు. సుమారు 20 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే తిప్పి.. వీల్ ప్యానెల్‌ను చెక్ చేసుకున్నాడు. అంతా ఓకే అయిన తర్వాత రెండో సారి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించాడు పైలట్. ఎలాంటి ప్రమాదం జరక్కుండా క్షేమంగా దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణీకులు. భువనేశ్వరీ ప్రయాణం ఇవ్వాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు నిజం చెబుతానంటూ నారా భువనేశ్వరీ పర్యటనలను షెడ్యూల్ చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో కొందరు చనిపోయారని అప్పట్లో ఎల్లోమీడియా ప్రచారం చేసింది. ఆ కుటుంబాలను పరామర్శిస్తానని అప్పట్లో భువనేశ్వరీ ఓ రెండు రోజులు పర్యటించి సుదీర్ఘ విరామం ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ పర్యటనలు పునఃప్రారంభించారు. ఇవ్వాళ్టి నుంచి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. కేరాఫ్ హైదరాబాద్ హైదరాబాద్‌లో చంద్రబాబు కుటుంబం జూబ్లీహిల్స్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంది. కేవలం సభలు, సమావేశాలు, పర్యటనలున్నప్పుడే మాత్రమే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం పరిపాటే. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వస్తున్నప్పుడు విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురక్షితంగా విమానం లాండవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
‘కాన్వాయ్’ బాబోయ్
‘నారా’ వారి కారు బకాయిలు రూ.35 లక్షలు లోకేష్.. భువనేశ్వరిలకూ కార్లు పెట్టిన వైనం గవర్నర్ వాహనాల పేరిటా అప్పులు రూ.అర కోటి దాటిన కాన్వాయ్ బకాయిలు మూడేళ్లుగా చిల్లిగవ్వ విడుదల చేయని కలెక్టర్ జిల్లాకు వచ్చే ప్రముఖులకు కాన్వాయ్ సమకూర్చే నిర్వాహకులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.అర కోటికి పైగా కాన్వాయ్ బకాయిలు పేరుకున్నాయి. వీవీఐపీల సేవలకు ఇక తమను పిలవొద్దని వాహన యజమానులు చెయ్యెత్తి దండం పెడుతున్నారు. వాహన శ్రేణిలో పాల్గొనడం మా తరంకాదంటూ హడలెత్తిపోతున్నారు. చిత్తూరు (అర్బన్): జిల్లాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్లు (వీవీఐపీ) వచ్చినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం కాన్వాయ్ (వాహన శ్రేణి) పెడుతున్నారు. ప్రముఖులు జిల్లాకు వచ్చి, వెళ్లేంత వరకు అద్దె వాహనాలను వాళ్ల వెంటే ఉంచుతారు. వీవీఐపీల పర్యటన పూర్తవగానే వాహనాలకు బాడుగ చెల్లిం చాలి. 2014నుంచి ఇప్పటివరకు కాన్వాయ్ అద్దెలు ఇవ్వకపోవడంతో బకాయిలు రూ.50 లక్షలకు చేరుకున్నాయి. కాన్వాయ్ కోసం జిల్లా రవాణాశాఖను రంగంలోకి దింపే అధికారులు పని పూర్తవగానే ఎవరినీ లెక్కచేయడంలేదు. దీంతో వాహన యజమానులు, ట్రావెల్స్ నిర్వాహకులు కాన్వాయ్ పేరెత్తితే భయపడుతున్నారు. రా ష్ట్రపతి పర్యటనకు చెన్నై నుంచి తెలుపురంగు ఇన్నోవా వాహనాలు తెప్పించి వాటికి అప్పటికప్పుడే అద్దెలు చెల్లిస్తున్న జిల్లా యం త్రాంగం మన వాహనాలకు పైసా విదల్చడంలేదు. ఫైలు కలెక్టర్ వద్దకు పంపినా ఆయన పట్టించుకోవడంలేదనే ఆరోపణ వినిపిస్తోంది. దీనికి తోడు ఇటీవల వీవీఐపీల కాన్వాయ్‌కు వెళ్లే డ్రైవర్ల ఇళ్ల వద్దకు పోలీసులు విచారణ పేరిట అర్థరాత్రులు వెళ్లడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పగటిపూట రాకుండా అర్థరాత్రులు మందీ మార్బలంతో వస్తే చుట్టుపక్కల పరువు పోతోందని డ్రైవర్లు వాపోతున్నారు. ‘ మా అప్పు ఇవ్వకపోతే ఇకమీదట ఒక్క బండిని కూడా కాన్వాయ్‌కు పెట్టం. మూడేళ్లుగా ఏం తిని బతకాలి..?’ అని తిరుపతి చెందిన ట్రావెల్స్ నిర్వాహకులు ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నారా’వారిదే రికార్డు... 2014లో 12సార్లు సీఎం హోదాలో చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ప్రొటోకాల్ కాన్వాయ్ (వాహన శ్రేణి)కి రూ.3.75 లక్షలు బకాయిలు పడ్డారు. 2015లో 14సార్లు రావడంతో రూ.13. 32 లక్షలు, ఈ ఏడాది 12 సార్లు రావడంతో 15.78 లక్షలు కాన్వాయ్ పెట్టిన వాళ్లకు అద్దెలు రూపంలో బకాయి ఉన్నారు. ఇది చాలదన్నట్లు 2014 సెప్టెంబరు 26న సీఎం సతీమణి నారా భువనేశ్వరికి కాన్వాయ్ పెట్టినందుకు రూ.3600, గత నెల 16న సీఎం తనయుడు నారా లోకేష్‌కు వాహనాలు పెట్టినందుకు రూ.13,500 బకాయిలు పడ్డారు. కాన్వాయ్ బకాయిల్లో ఒక్క సీఎం కుటుంబమే రూ.35 లక్షల వరకు బకాయి పడింది. వీవీఐపీలు మరెందరో... వీళ్లు కాకుండా సింగపూర్ ప్రధాన మంత్రి, శ్రీలంక అధ్యక్షులు, ప్రధాన మంత్రి, తమిళనాడు, మేఘాలయ గవర్నర్లు, రాష్ట్ర డెప్యూటీ సీఎం, పశు సంవర్థక శాఖా మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మాజీ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నాయకులు జిల్లాకు వచ్చినప్పుడు కాన్వాయ్‌లు ఏర్పాటు చేస్తే చిల్లి గవ్వ విడుదల కాలేదు. రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టు, ఇతర రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల పేరిట కూడా కాన్వాయ్ బకాయిలు పేరుకున్నాయి. గవర్నర్‌కూ ఓ కోటా... రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పేరిట కూడా కాన్వాయ్ బకాయిలు పేరుకున్నాయి. 2014లో గవర్నర్ పేరిట రూ.15,300, గత ఏడాది నాలుగు సార్లు జిల్లాకు వచ్చినందుకు రూ.1.16 లక్షలు, ఈ ఏడాది 5 సార్లు జిల్లాకు వచ్చిందుకు కాన్వాయ్ బకాయిల కింద రూ.1.38 లక్షలు అప్పులు పేరుకుపోయాయి. -
బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. మహిళ మృతి
అతివేగంగా ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న వివాహిత మృతిచెందింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని హుక్కుంపేట వద్ద సోమవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన భువనేశ్వరి(22) భర్తతో కలిసి బైక్‌పై రాజమండ్రి వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో భువనేశ్వరి తలకు బలమైన గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనలో ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికాని తల్లి
సీకేఎం ఆస్పత్రిలో విద్యార్థిని ప్రసవం ఎంజీఎం : ఓ కీచక టీచర్ నిర్వాకంతో పదోతరగతి విద్యార్థిని సోమవారం రాత్రి సీకేఎం ఆస్పత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం చిన్న వంగర సమీప చిన్న బంగారి తండాకు చెం దిన జాటోతు భువనేశ్వరి వంగరలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యనుభ్యసిస్తోంది. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు రామ్మూర్తి విద్యార్థిని లొంగదీసుకోవడంతో పాటు గర్భం దా ల్చడానికి కారణమయ్యాడు. ఏడు నెలల క్రి తం ఈ సంఘటన వెలుగులోకి రావడంతో వెంటనే విద్యార్థిని కుటుంబ సభ్యులతో పా టు తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ విద్యార్థినీ సీకేఎం ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. నెలలు నిండకముందు జ న్మించడంతో శిశువు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో నవజాత శిశు సంరక్షణ కేం ద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే విద్యార్థినీ పరిస్థితితో పాటు శిశువు వైద్య పరిస్థితిని వివరించడానికి సీకెఎం వైద్యులు నిరాకరించారు. కాగా, ఈకేసు లో నిందితుడు పరారీలో ఉన్నాడు. -
క్యూట్ లవ్‌స్టోరీ
ప్రిన్స్, రేష్మీ జంటగా సూర్య చక్ర ఫిలింస్ పతాకంపై తాడి గనిరెడ్డి, కె. భువనేశ్వరి నిర్మిస్తున్న ‘నువ్వక్కడ నేనిక్కడ’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘అందాల రాముడు’ చిత్రం ద్వారా దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పి. లక్ష్మీనారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రం పాటల రికార్డింగ్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ - ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరీతో ఈ చిత్రం ఉంటుంది. యూత్, ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ చిత్రం. ఇందులో ఓ ముఖ్య పాత్రను బ్రహ్మానందంగారు చేస్తున్నారు. ఈ నెల 26న చిత్రీకరణ మొదలుపెడతాం.’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు: గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: జోషి, సంగీతం: చిన్ని చరణ్, ఎడిటింగ్: నందమూరి హరి. -
బుక్కైతే లక్కే!
సి.ఐ.ప్రకాశ్ కన్నుగప్పి ఎవరూ తప్పించుకోలేరు. అది కాదు విశేషం. ప్రకాశ్ కంట్లో పడ్డాక ఎవరూ తప్పించుకోవాలని చూడరు! ఎనీ టైమ్, ఎనీ సెంటర్... యూత్ హస్క్ కొడుతుంటే అతడి బైక్ వచ్చి ఆగుతుంది. అందర్నీ ఒక్క చూపు చూస్తాడు... దగ్గరికి రమ్మంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ‘నేనేరా పోలీస్’ అంటాడా? అనడు! ‘కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అంటాడా? అనడు! మరేం చేస్తాడు? న్యూసెన్స్ కేస్ బుక్ చేస్తాడా? చేస్తాడు. కానీ న్యూసెన్స్ కేస్ కాదు... ‘న్యూ’సెన్స్ క్లాసుకు బుక్ చేస్తాడు! ఒకసారి ఆ క్లాస్‌కి బుక్కయ్యారా... ఆర్మీలో పోస్టుతోనే ఎవరైనా తిరిగి బయటికి రావడం! అవును. ప్రకాశ్ లాంటి పోలీస్ ఉంటే... ఊర్లో పోలీస్ ఫోర్సు ఉన్నట్లే. ఈ స్టోరీ చదవండి. బుక్కైతే లక్కే అని మీకూ అనిపిస్తుంది. అర్ధరాత్రిపూట పీకలదాకా మద్యం తాగి రోడ్డుపై అల్లరిచిల్లరగా తిరుగుతున్న కుర్రాళ్లు పోలీసుల కంటపడితే ఏం చేస్తారు? సాధారణంగా చేసేది ఏమిటంటే... అలాంటి వారిని తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో పడేసి వార్నింగ్‌లు, కౌన్సెలింగ్‌లు... ఇలా వారి డ్యూటీ వారు చేస్తారు. అయితే సీఐ ప్రకాశ్ అలా చేసి ఊరుకోలేదు. దారితప్పుతున్న యువత భవితవ్యం గురించి ఆలోచించారు. అలాంటి వారి కోసం ఓ వెలుగు బాట వేయాలనుకున్నారు. లాఠీ పట్టుకున్న చేత్తోనే గురువుగా బెత్తం పట్టుకున్నారు. దగ్గరుండి మరీ వారికి పాఠాలు చెప్పించారు. గ్రౌండ్‌కి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. అలా 142 మంది యుతకు రక్షణశాఖలో ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తే... వారిలో 72మందికి రక్షణశాఖలో వివిధ రంగాల్లో ఉద్యోగాలు వచ్చాయి. దాంతో ప్రకాశ్ తన పై అధికారులతోనే కాదు ప్రపంచ పోలీసు విభాగం నుంచి ప్రశంసలందుకున్నారు. కిందటివారం అమెరికాలో ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆ్‌ఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్’ ఆధ్వర్యంలో ‘కమ్యునిటీ పోలీస్’ అవార్డు అందుకున్న కరీంనగర్ జిల్లా గోదావరిఖని సీఐ ఆర్. ప్రకాశ్ చేస్తున్న సేవాకార్యక్రమాలే ఈవారం ‘జనహితం’ ‘‘మూడేళ్లక్రితం ఒకరోజు రాత్రి పెట్రోలింగ్ చేస్తుంటే... సింగరేణి దగ్గర ఒక స్టేడియం కింద ఓ ఎనిమిదిమంది కుర్రాళ్లు మద్యం సేవిస్తూ నా కంటపడ్డారు. అందరినీ జీపెక్కించుకుని స్టేషన్‌కి తీసుకెళ్లి విచారిస్తే వారిలో ఆరుగురు ఇంజినీరింగ్, ఒకరు ఫార్మసీ పూర్తిచేసినవారు. మరొకరు సింగరేణిలో ఉద్యోగి. నాకు వారిని చూసి కోప్పడాలో, జాలిపడాలో అర్థంకాలేదు. ఇలాంటి వారిని ఎలా దారిలో పెట్టాలో అని ఆలోచిస్తుండగా ఒక స్నేహితుడిచ్చిన సలహా మేరకు రక్షణ విభాగంలో ఉద్యోగాలకు వారికి శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందనిపించింది’’ అని గుర్తుచేసుకున్నారు ప్రకాశ్. రక్షణ విభాగంలో శిక్షణ తీసుకోడానికి మొదటి అర్హత పదోతరగతి పాస్ అవ్వడం, రెండోది పద్ధెనిమిది నుంచి ఇరవై రెండు ఏళ్ల వయసులోపు వారై ఉండాలి. మొదట ఓ ఎనిమిదిమంది కుర్రాళ్లకు ఏడాదిపాటు శిక్షణ ఇచ్చారు ప్రకాశ్. వారిలో ఇద్దరికి ఆర్మీలో పోస్టింగ్‌లు వచ్చాయి. మూడు జిల్లాల్లో... తన శిక్షణలో ఆర్మీలో ఉద్యోగాలు పొందిన యువకుల గురించి చెబుతూ... ‘రక్షణ విభాగంలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న యువతకు ఆహ్వానం’ అంటూ ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పత్రికాప్రకటనలు ఇచ్చారు. నాలుగు జిల్లాల నుంచి వచ్చిన యువతలో అర్హతని బట్టి 142 మంది యువతను ఎంపిక చేశారు. వారిలో 12మంది అమ్మాయిలు కూడా ఉన్నారు.‘‘ నా మొదటి బ్యాచ్‌లో ఆర్మీ ఉద్యోగాలు సంపాదించిన ఇద్దరు కుర్రాళ్లను చూపించడంతో రెండోబ్యాచ్లో చేరడానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. ఇంచుమించు వీరంతా ఖాళీగా తిరుగుతూ నా దృష్టిలో పడ్డవారే. వీరిలో చాలామంది పేదవారున్నారు. వీళ్లందరికీ ఉచితంగా ఆశ్రయం కల్పించడానికి ఏర్పాట్లు చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నేను సాయం కోసం ఎవరినీ డబ్బు రూపంలో అడగలేదు. అన్నీ వస్తురూపంలోనే సేకరించాను. సింగరేణి కాలరీస్ కంపెనీవాళ్లు ఈ యువతకి ఉచితంగా ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారం, మిగతా అవసరాలకోసం దాతల్ని ఆశ్రయించాను. నా పై అధికారులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు...ఎవరు సాయం చేస్తామని ముందుకొచ్చినా బియ్యం, ఉప్పు, పప్పులు.. అంటూ భోజనం తయారీకి కావాల్సిన సరుకుల జాబితానే ఇచ్చేవాడ్ని. వాళ్లు సరుకుల్నే నేరుగా పంపేవారు’’ అని చెప్పారు ప్రకాశ్. పోలీసులపై ఉన్న అపోహల వల్ల ప్రకాశ్ దాతల వివరాలను పారదర్శకంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఉపాధ్యాయుల సహకారం... ‘‘మొదటి బ్యాచ్‌లో ఆర్మీకి ఎంపికైన విద్యార్థులకు పాఠాలు చెప్పిన హైస్కూల్ హెడ్మాస్టార్ రామ్‌గోపాల్‌తో పాటు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా వచ్చి మరీ మా విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం, సైన్స్, వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పారు. ఇక గ్రౌండ్ పాఠాల విషయానికొస్తే పొద్దునే ఐదుగంటలకల్లా నిద్రలేపి ఎగ్, పాలు, అరటిపండు ఇచ్చి 5 కిలోమీటర్లు రన్నింగ్‌కి తీసుకెళ్లేవాడ్ని. తర్వాత లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ వంటివి నేర్పేవాళ్లం. ఏడాదిపాటు సాగిన ఈ శిక్షణకాలంలో నాకు ఎన్నో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. అయినాసరే శిక్షణతీసుకున్న యువతకు మంచి ఉద్యోగాలొచ్చే తీపి క్షణాలకోసం ఏడాదికాలం ఓపిగ్గా ఎదురుచూశాను. ’’ అని చెబుతున్నప్పుడు ప్రకాశ్‌లో పోలీసుకి బదులు ఉపాధ్యాయుడు కనిపించాడు. 72మందికి ఉద్యోగాలు... ‘‘శిక్షణ పూర్తయ్యాక అందరితో రక్షణవిభాగంలోని అన్ని శాఖల్లో ఉద్యోగాలకోసం దరఖాస్తు చేయించాం. ఆర్మీలోని సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్ సెక్యురిటీ ఫోర్స్, పోలీస్ విభాగంలో సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లలో మొత్తం 72మందికి ఉద్యోగాలొచ్చాయి. ఈ విజయం వెనక నాకు నాపై అధికారులు డి.ఎస్.పి డి. ఉదయ్‌కుమార్‌గారు, ఎస్పి వి. రవీందర్గారి సహకారం చాలా ఉంది’’ అని ముగించారు ప్రకాశ్. ఒకచేతితో లాఠీ పట్టుకుని పోలీసు ఉద్యోగం చేసుకునే ప్రకాశ్ మరో చేత్తో యువతకు పాఠాలు చెప్పి రక్షణశాఖకు బహుమతిగా ఇద్దామనుకోవడం వెనక ఆయన మంచిమనసుతో పాటు జీవితం విలువతెలిసిన ఒక ఉపాధ్యాయుడి పెంపకం కూడా ఉంది. ప్రకాశ్ తండ్రి బక్కన్న ఓ స్కూల్ టీచర్. ప్రకాశ్‌ని పోలీస్‌గానే కాదు సమాజానికి తన వంతుసాయం చేసే సేవకునిగా కూడా చూడాలనుకున్నారాయన. ఆయన కోరికతో పాటు ప్రకాశ్ లక్ష్యం కూడా నెరవేరినందుకు మనం కూడా సంతోషిద్దాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ‘‘నాపై అధికారుల ప్రోత్సాహంతోనే ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్’ (ఐఎసిపి) వారికి నా ప్రాజెక్ట్ వివరాలు పంపాను. వారు నా సేవల్ని గుర్తించి ‘కమ్యూనిటీ పోలీస్’ అవార్డు ఇచ్చారు. గత వారంలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన 120 ఐఎసిపి సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కడినే వెళ్లాను. మూడురోజులపాటు జరిగిన ఆ సమావేశాలకు ప్రపంచవ్యాప్తంగా 162 దేశాల నుంచి 1600మంది పోలీసులు వచ్చారు. ఈ అవార్డుకోసం 400మంది నామినేషన్లు వచ్చాయి. మూడురోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రజల రక్షణకోసం పోలీసులు ఎదుర్కోవాల్సిన సవాళ్ల గురించి విస్తృతమైన చర్చలు జరిగాయి’’. - ఆర్. ప్రకాశ్, సీఐ, గోదావరిఖని -
దులిపేశారు.. వదిలించారు
సెటిల్మెంట్. పెద్దమాట! వీళ్లు చేస్తున్నదీ సెటిల్మెంటే అయినా ఇక్కడ ఆ మాట వాడేందుకు వీల్లేదు. వీళ్లేమీ తుపాకీ చేతబట్టిన వాళ్లు కాదు. బెదిరించి, నాలుగు పీకే వీర నారీమణులూ కారు. అధికారం ఉన్నవారు అసలే కాదు. మరెవరు? మామూలు మహిళలు. సాటి మహిళ కష్టానికి స్పందించే మనసున్నవాళ్లు. ఆ కష్టానికి కారణమైన మగవాళ్ల వ్యసనాలను ప్రశ్నించినవారు. మొదట పేకల్ని దులిపేశారు. తర్వాత మద్యం మత్తును వదిలించారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. సాధారణ మహిళల్లోని ఈ అసాధారణ ఉద్యమశక్తే ఈవారం మన ‘ప్రజాంశం’. పల్లెటూళ్లలో భర్తని పోగొట్టుకుని లేదా భర్త నుంచి విడిపోయి ఆర్థికంగా నష్టపోయిన మహిళల గురించి ఆలోచించేవారు ఎవరూ ఉండరు. అదే పట్టణాల్లో అయితే కేసులు, కోర్టులు అంటూ ఎంతో కొంత పోరాటం చేసే అవకాశం ఉంటుంది. పైగా పల్లెల్లో భర్తలేని మహిళ ఏం మాట్లాడినా, ఏం అడిగినా తప్పు. అలాంటివారికి ఆసరాగా నిలిచి తమ ప్రత్యేకతను చాటుకున్నారు వెల్టూరు గ్రామం మహిళలు. పెద్దగా చదువులేక పోయినా...అన్యాయానికి ఎదురునిలబడి పోరాడే శక్తిని సంపాదించుకున్న ఆ మహిళల వెనక ఉద్యమశక్తి దాగి ఉంది. ఏడాదికిత్రం వరకూ వెల్టూరు అన్ని గ్రామాలలాంటిదే. అన్యాయం, ఆస్తి...గురించి కాదు కదా సాయంత్రం అయితే మగవాళ్లతో మాట్లాడే ధైర్యమే ఉండేది కాదు. మద్యం, పేకాట కలిసి వెల్టూరుకి వెలుగుని దూరం చేశాయి. ఆరే ఆరు నెలల్లో అన్ని సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు మహిళావికాసం కోసం ముందు నిలబడ్డారు ఆ ఊరి మహిళలు. ‘‘మా ఊళ్లో ఒకతను భార్యని వదిలేసి, రెండోపెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య బాగోగులు, కష్టాసుఖాలు పట్టించుకోవడం లేదు. ఆ కేసుని మేం తీసుకుని అతనికున్న రెండెకరాల పొలాన్ని ఇద్దరు భార్యలకూ చెరో ఎకరం రాయించాం. ఎవరి పంట వారు తీసుకునేలా ఒప్పందం కుదిర్చాం. అలాగే మరో అమ్మాయి గర్భిణిగా ఉండి అత్తింటినుంచి పుట్టింటికి వచ్చేసింది. ఏళ్లు గడిచిపోతున్నా ఆమెను తీసుకెళ్లడానికి భర్త రావడంలేదు. మేం అతని దగ్గరికి వెళ్లి భార్యని తీసుకెళ్లనందుకు ఆస్తిలో సగం వాటా రాయమని చెప్పి న్యాయపరంగా ఆ అమ్మాయికి రావాల్సిన వాటా ఆమెకు రాయించాం. ఇలా...చాలా కేసులు పరిష్కరించి మా ఊరి ఆడపిల్లలకు న్యాయం జరిగేలా పోరాడాం’’ అని కమలమ్మ అనే మహిళ చెప్పింది. అంతే కాదు...ముగ్గురు బిడ్డల తల్లిని వదిలేసి ఊరొదిలి పారిపోయిన వ్యక్తిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి అతని ఆస్తిలో భార్యకు, పిల్లలకు సగభాగం రాయించారు. భార్యని వదిలేసి పారిపోయిన భర్త నుంచి పెళ్లినాడు భార్యకు పెట్టిన బంగారంతో సహా ఇప్పించారు. ఇరువర్గాలకు న్యాయం చేయడం ఈ గ్రామ మహిళల సెటిల్మెంట్ ప్రత్యేకం. సెటిల్మెంట్ సిస్టమ్... ఈ మహిళల్లో ఎవరు పెద్దగా చదువుకున్నవారు లేరు. చాలావరకూ వేలిముద్రలే. ఆస్తులు, వాటాలు అంటున్నారంటే పట్టణజ్ఞానం ఏమైనా ఉందా అంటే ఏనాడు పల్లెదాటి ఎరగరు. మరి వీరికింత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే? బాధల నుంచేనంటూ టక్కున సమాధానం చెబుతారు. కావాలంటే కాసింత సాయం చేస్తామనేవారుంటారు కాని కుటుంబవ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇంటిమనుషుల్లా న్యాయం చేసే మహిళల్ని చూడాలంటే మెదక్ జిల్లా కలెక్టరేట్‌కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్టూరు గ్రామానికి వెళ్లాల్సిందే. పత్తిని నమ్ముకుని బతుకుతున్న కుటుంబాల్లో పత్తాలు(పేకలు) చిచ్చుపెట్టాయి, కిరాణాదుకాణాల్లో కూల్‌డ్రింక్ బాటిల్స్‌తో పాటు దొరికే క్వార్టర్ బాటిల్స్ పేదల జీవితాల్ని పేకమేడల్లా కూల్చేశాయి. అలాంటి సమయంలో మహిళా సంఘాలన్నీ కలిసి కలిసి ఉద్యమం చేసి తమ ఊరిని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఏ ఉద్యమం విజయం సాధించాలన్నా... ప్రభుత్వ అధికారుల సాయం ఉండాలి. వారి దగ్గరికెళ్లి గోడు చెప్పుకుంటే అన్ని ఊళ్లలో ఉన్న బాధలే కదా అంటారు. ఆ సమయంలో వారికి తోచిన అద్భుతమైన ఆలోచన... బ్యాంకు రుణాల చెల్లింపు నిలిపి వేయడం. ‘‘మా ఊళ్లో చాలామంది మగాళ్లకు పత్తాలంటే ప్రాణం. బతుకులు కూలిపోతున్నా... వాటిని ముట్టడం మానరు. ఇక లాభం లేదని మహిళా సంఘాల మీటింగుల్లో ఈ విషయం గురించి బాగా చర్చించుకున్నాక... బ్యాంకు రుణం కట్టకుండా, గ్రామసంఘం మీటింగు రద్దు చేసి పంచాయితీ కార్యాలయం ముందు ధర్నా చేద్దామనుకున్నాం. మా ఊళ్లో 450 మంది మహిళలు పొదుపు సంఘాల్లో ఉన్నారు. వీరితో పాటు మిగతా మహిళలు కూడా ధర్నాకు దిగారు. మా ఊళ్లో ఉన్న ఆరు కిరాణాదుకాణాల్లో మద్యం అమ్మడం ఆపేయాలనేది మా మొదటి డిమాండ్. అలాగే ఎవరు పత్తాలు ఆడినా తమ పర భేదాల్లేకుండా వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. గంట రెండు గంటలు కాదు, ఏకంగా మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేశాం. ఆ మూడు దినాల్లో...ఒక్క మహిళ కూడా ఇంట్లో పొయ్యి వెలిగించలేదు. పిల్లల కోసమన్నా...వంట వండమని మగోళ్లు బతిమిలాడితే హోటళ్లలో తినిపించుకోమని చెప్పాం. మా ధర్నా సంగతి తెలిసి అధికారులు వచ్చి మా బాధలు విని మాకు సాయం చేస్తామన్నారు.’’ అని ఆర్నెల్లకిత్రం జరిగిన తమ పోరాటం మొదటిరోజుని గుర్తుచేసుకుంది వెల్టూరు గ్రామ సంఘం అధ్యక్షురాలు మల్లమ్మ. జరిమానా...బహుమతి నిరాహార దీక్ష, ధర్నా, ర్యాలీలు, షాపుల్లోకి చొరబడి సీసాలు పలకొట్టడంతో సరిపెట్టకుండా మద్యం తాగినవారికి 5000, అమ్మినవారికి 500 రూపాయల జరిమానా. తాగుతున్నప్పుడు, అమ్ముతున్నప్పుడు చూసి, ఫిర్యాదు చేసిన వారికి 500 రూపాయల బహుమతి ఇస్తామని మహిళా సంఘాల తరపున ప్రకటించారు. వివరాలు చెప్పినవారి విషయాలు గోప్యంగా ఉంచుతామన్నారు. దాంతో బహుమతుల కోసం చాలామంది అమ్మినవారి, కొన్నవారి వివరాలు వీరికి చేరవేయడంతో నేరుగా దాడులు చేసి మహిళలందరూ కూడి ఆందోళన చేయడం మొదలెట్టారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను ఇంట్లోవారు కాని, బయటివారు కాని ఏ చిన్నమాట అన్నా... వారు ఊరి మహిళలందరికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు.‘‘మేం కిరాణాషాపులపై దాడిచేసినపుడు ఆ షాపు ఓనర్లు మాతో ఒక మాట అన్నారు. ‘ముందు మీ మొగోళ్లతో పత్తాలు ఆడుడు మాన్పించండి. ఆ తర్వాత మందు...’ అన్నారు. మా మాట వినాలంటే ముందు మందు మానాలి. చాయ్‌కి బదులు మందు తాగేవాడి దగ్గర మా మాట ఏం వినిపిస్తుంది అని వాదించాం. మందు బాధ తగ్గిన తర్వాత పత్తాలపై దాడికి దిగాం’’ అని వివరించింది సంఘం ఉపాధ్యక్షురాలు లక్ష్మి. పత్తాల పని పట్టాం... వెల్టూరు గ్రామం పత్తి పంటలు పండించడంలో ప్రసిద్ధి. నేలసారమో, రైతుల కష్టమో పత్తి విపరీతంగా పండుతుంది.పత్తి ఎండబెట్టి మార్కెట్‌కి పంపే సమయానికి పొలాల్లోని పొదలన్నీ పత్తాలకు పరదాలుగా మారిపోతాయి. పంట అమ్మిన సొమ్ములేవని అడిగితే తాగొచ్చి తల్లీ, పెళ్లాం తేడా లేకుండా కొట్టడం...‘‘మాలోని చాలామంది మహిళలకు సెల్ఫోన్లు ఉన్నాయి. ధర్నా సమయంలో మా ఊరొచ్చిన ఎస్ఐ సారుతో పత్తాల విషయం చెప్పి ఆయన ఫోన్ నెంబరు తీసుకున్నాం. మా వివరాలు చెప్పకుండా ఆడేవారిని అరెస్టు చేయాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాం. పత్తాలు ఆడుతున్నట్టు ఎవరికి సమాచారం అందినా వెంటనే ఎస్ఐకి ఫోన్ చెయ్యడం మొదలుపెట్టాం. పోలీసులు వెంటనే వచ్చి వారిని జీపు ఎక్కించుకుని వెళ్లిపోయేవారు. ఇలా రెండు మూడు సంఘటనలు జరగడంతో పత్తాల ప్యాకెట్ల అమ్మకం ఆగిపోయింది. సమాచారం అందించిన మహిళలను ఆమె భర్త కొట్టబోతుంటే మా సంఘం మహిళలంతా వెళ్లి అడ్డుకుని అతనికి బుద్ధి చెప్పాం. ఈ ఊళ్లో ఏ మహిళా ఒంటరి కాదని ఆ సందర్భంగా గట్టిగా చెప్పాం’’ అంటూ మరో మహిళ వివరించింది. ‘‘ఆ రోజు వీరిలో ఎంత పట్టుదల ఉందో ఈ రోజూ అంతే ఉంది. ప్రతి గ్రామంలో మహిళ ధైర్యంగా నిలబడితే పల్లె పచ్చగా ఉంటుంది. దేశ అభివృద్ధి పల్లెల మీదే ఆధారపడి ఉంది’’ అని ఎంతో సంతోషంగా చెప్పారు సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు స్వరూప, అనూష. ఇబ్బందులకు ఎదురు నిలబడి, గెలిచిన వారి విజయాన్ని మిగతా పల్లెటూళ్లు కూడా ఆహ్వానించాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మరుగుదొడ్లు కట్టించకుంటే రేషన్ కట్..! మద్యం, పత్తాలు సమస్యలు తీరడంతో కాస్త తేరుకున్న మహిళలంతా ఊరి బాగుకోసం ఆలోచించడం మొదలెట్టారు. అందులో భాగంగా ముందుగా ఇంటింటికీ మరుగుదొడ్లు ఉంటే బాగుండుననుకున్నారు. అందుకోసం ప్రభుత్వసాయం తీసుకుని కొంత డబ్బుని పొదుపు సంఘాల నుంచి అప్పు ఇప్పించి 412 మరుగుదొడ్లు కట్టించారు. దీనికి సహకరించనివారికి రేషన్, ఫించన్ సౌకర్యాలు ఆపేస్తామని చెప్పారు. దాంతో ఊళ్లో పారిశుద్ధ్యం కూడా మెరుగయ్యేలా చేయగలిగారు. వీరికి ప్రభుత్వం తరపు నుంచి ఇందిరాక్రాంతి పథకం అధికారులు అండగా నిలిచారు.