విద్యార్థిని బలిగొన్న రూ.500 వివాదం | Student killed in a dispute Rs 500 | Sakshi
Sakshi News home page

విద్యార్థిని బలిగొన్న రూ.500 వివాదం

Published Tue, Feb 23 2016 7:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

విద్యార్థిని బలిగొన్న రూ.500 వివాదం - Sakshi

విద్యార్థిని బలిగొన్న రూ.500 వివాదం

తనపై అకారణంగా నిందవేశారు.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు.
రెండు రోజులకు కాలిన గాయాలతో కృష్ణా జిల్లాలో ప్రత్యక్షమయ్యాడు.
కిడ్నాప్ చేసి కాల్చేశారంటూ పోలీసులకు గాయం నాగార్జునరెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు.
విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలొదిలాడు.  

 
హుజూర్‌నగర్‌లో మాయం.. కృష్ణా జిల్లాలో ప్రత్యక్షం
విజయవాడలో చికిత్సపొందుతూ మృత్యువాత
ఇంకా వీడని మిస్టరీ
విద్యార్థిని బలిగొన్న రూ.500ల చోరీ వివాదం
పొంతన లేని మరణవాంగ్మూలం, సూసైడ్ నోట్
కుమారుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రి


హుజూర్‌నగర్ :  పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యనభ్యసిస్తూ అదే పాఠశాలలోని హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థి నాగార్జునరెడ్డి సూసైడ్‌నోటు రాసి  ఈనెల 18న అదృశ్యమైన విషయం తెలిసిందే.అయితే 500ల నోటు చోరీ విషయంలో తనకు సంబంధంలేని.. దొంగతనాన్ని తోటివిద్యార్థులు తనపై మోపారని, అందుకే  నువాక్రాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్నానని సూసైడ్ నోటులో పేర్కొన్నాడు.

అయితే  విద్యార్థి ఆచూకీ కోసం ఈనెల 19న తల్లిదండ్రులు, బంధువులు, పాఠశాల యాజమాన్యం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేదు.  ఊహించని విధంగా ఈనెల 20న కృష్ణాజిల్లా చిల్లకల్లు వద్ద ఒక పెట్రోల్ బంక్ సమీపంలో తీవ్రంగా కాలిన గాయాలతో అపస్మారకస్థితిలో ప్రత్యక్షమయ్యాడు. అటువైపుగా వెళుతున్న పలువురు ప్రయాణికులతో పాటు బంక్ సిబ్బంది నాగార్జునరెడ్డిని 108 ద్వారా జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలకు  తరలించారు.  వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించగా అక్కడిపోలీసులు  నాగార్జునరెడ్డిద్వారా తన చిరునామా రాబట్టి  తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

తనను పాఠశాల వద్ద ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో ఒకరోజంతా మత్తు మాత్రలు మింగించి పడుకోబెట్టారని, మరుసటిరోజు ఉదయం తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని నాగార్జురెడ్డి వివరించాడు. ఇదే విషయాన్ని ఆరోజంతా మెజిస్ట్రేట్‌తో పాటు తనను పలకరించిన ప్రతి ఒక్కరికీ చెప్పాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడకు తరలించగా అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
 
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రి
మేళ్లచెరువు మండలం తమ్మారం గ్రామపంచాయతీ పరిధి  కొత్తూరులోని  మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంకు చెంది న గాయం నర్సిరెడ్డి కుమారుడైన నాగార్జునరెడ్డి అంతు చిక్కని వ్యవహారంతో మృతి చెందటం  తీవ్ర చర్చనీయాంశంగా మా రింది. కౌలు రైతుగా వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తూ తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కగానొక్క కు మారుడిని బాగా చదివించాలని, పెద్ద ఉద్యోగం సాధించాలని కల లు గన్న తల్లిదండ్రుల ఆశలు ఆడియాశలుగానే మారాయి. అం తేగాక తల్లిదండ్రులు కుమారుడి మరణవార్త విని కన్నీరుమున్నీర వుతూ రోదించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది. అయినప్పటికీ విద్యార్థి మృతి మాత్రం మిస్టరీగానే మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement