టీసీ ఇవ‍్వలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి
Published Wed, Jul 19 2017 1:24 PM | Last Updated on Fri, Nov 9 2018 4:32 PM
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో ఓ యువకుడు బుధవారం వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ఓ ప్రైవేటు కాలేజీలో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న యువకుడు టీసీ(ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కళాశాల యజమాన్యం తనకు టీసీ ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. బాధిత విద్యార్థి వాటర్ ట్యాంకు ఎక్కాడు. టీసీ ఇవ్వకపోతే ట్యాంక్ పైనుంచి దూకుతానని విద్యార్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
Advertisement
Advertisement