TC
-
టీసీ ఇవ్వలేదని నిద్రమాత్రలు మింగిన విద్యార్థిని
సాక్షి, హైదరాబాద్: విద్యార్ధుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైతన్యపురి డివిజన్ మున్సిపల్ కాలనీలోని శకుంతల ఉన్నత పాఠశాల యాజమాన్యం కారణంగా నిద్రమాత్రలు మింగి ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న కార్పొరేటర్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాఠశాల వద్దకు చేరుకున్నారు. కరోనా కారణంగా ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఏడో తరగతి విద్యార్థిణి తల్లి టీసీ కావాలని పాఠశాల యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫీజు మొత్తం బకాయి కడితేనే టీసీ ఇస్తామని ఇబ్బందికి గురి చేయటంతో విద్యార్థిని తల్లిదండ్రులు, కాలనీలోని పిల్లల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. బాధితులకు న్యాయం చేసేవరకు ఉద్యమిస్తామని సామ రంగా రెడ్డి స్పష్టం చేశారు. మండల విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాల అక్రమాలను బయటపెట్టి సీల్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపి జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రారపు శంకర్, డివిజన్ అధ్యక్షుడు వినోద్‌యాదవ్ స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. చదవండి: ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. -
స్టేట్‌లేవల్ హాకీ ప్లేయర్.. ఏకంగా ఉపాధ్యాయుడిపైనే..
జైపూర్: విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడానికి టీచర్లు మందలిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. ఉపాధ్యాయులు ఏది చేసిన.. అది విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు కోసమే. అయితే, ఇక్కడో టీచర్.. తన స్టూడెంట్ ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రబుధ్దుడు కోపంతో.. ఏకంగా తన గురువుపైనే కాల్పులకు తెగబడ్డాడు. ఈ విషాదకర సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జైపూర్ జిల్లాలో ఉన్న పాఠశాలలో జరిగింది. నట్వర్ సింగ్ యాదవ్ అనే ఉపాధ్యాయుడు స్థానిక కోట్పుత్లిలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. కాగా, అదే పాఠశాలలో మోతిలాల్ అనే విద్యార్థి పన్నెండవ తరగతి అభ్యసించేవాడు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు నట్వర్ సింగ్ యాదవ్.. తరగతి గదిలో మోతిలాల్ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించాడు. దీన్ని మోతిలాల్.. అవమానకరంగా భావించాడు. కోపంతో టీచర్‌ను పట్టుకోని నానా దుర్భాషాలాడాడు. అంతటిలో ఆగకుండా.. టీచర్ అని విషయం మరిచిపోయి చేయి చేసుకున్నాడు. ఈ ఘటన పాఠశాలలో కలకలం రేపింది. దీంతో ఈ విషయం కాస్త పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వరకు వెళ్లింది. ఈ క్రమంలో మోతిలాల్‌ను టీసీ(ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్) ఇచ్చి పంపించి వేయడానికి పాఠశాలలో నిర్ణయించారు. దీంతో మోతిలాల్.. తన ఉపాధ్యాయుడిపై కోపంతో రగిలిపోయాడు. అదును కోసం ఎదురు చూడసాగాడు. దీంతో నిన్న (గురువారం) .. యాదవ్ పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో.. మోతిలాల్ తన మిత్రులతో కలిసి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనతో యాదవ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, కాల్పులు జరపడం వలన యాదవ్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అతను రక్తపు మడుగులో కిందపడి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని... యాదవ్‌ను జైపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాదవ్‌కు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే, నిందితుడు మోతిలాల్ స్టేట్ లెవల్ హకీ క్రీడాకారుడని , తాజాగా రాజస్థాన్ గవర్నర్చే సన్మానించ బడ్డాడని స్థానికులు తెలిపారు. కాగా, నిందితులలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జైపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
స్కూల్ అడ్మిషన్‌కు నో ‘టీసీ’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై టీసీ(ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్) లేకున్నా ప్రవేశాలు పొందవచ్చు. ఐదోతరగతి లోపు ఇప్పటివరకు టీసీ లేకున్నా ప్రవేశాలకు అవకాశం ఉండగా, ఇకపై పదోతరగతి వరకు టీసీ లేకున్నా ప్రవేశాలు కల్పించేలా విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ మెలిక పెడుతుండటంతో తల్లిదం డ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులతో ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు సిద్ధమైనా టీసీ ఇవ్వాలంటే పాత ఫీజులు, ఈ విద్యా సంవత్సరపు ఫీజు చెల్లించాలంటూ యాజమాన్యాలు మెలిక పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ.. టీసీ అవసరం లేకుండానే పాఠశాలల్లో ప్రవేశానికి వీలు కల్పించాలని ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో టీసీ లేకున్నా ప్రవేశాలు కల్పిస్తుం డగా, ఉన్నత పాఠశాలల్లో మాత్రం టీసీ తప్పనిసరి నిబంధనను అమలు చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో అయితే అన్ని తరగతుల్లో టీసీ అడుగుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా బడులు ఇంకా ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ 1 నుంచి సర్కారు డిజిటల్ పాఠాలు ప్రారంభించింది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి వందశాతం ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫీజులు కట్టే స్తోమత లేని పేరెంట్స్ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు మార్చాలని భావిస్తున్నారు. ఇందుకోసం టీసీలు కావాలని సదరు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాన్ని కోరితే ఫీజు మొత్తం కట్టాలని దబాయిస్తుండడంతో ఆయా పిల్లల తల్లిదండ్రులకు ఎటూ పాలుపోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికా రులను ఆశ్రయించారు. -
‘టీసీ’ లేకున్నా అడ్మిషన్..
సాక్షి, చెన్నై: ప్రైవేటు స్కూళ్లలో ఇదివరకు చదువుకుని ఉన్న పక్షంలో, ఆ విద్యార్థులు టీసీలు సమర్పించకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే వెసులుబాటను విద్యాశాఖ కల్పించింది. ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల ఒత్తిడి తీసుకొస్తుండడంతో చర్యలు తప్పవని విద్యాశాఖా మంత్రి సెంగోట్టయన్ హెచ్చరించారు. కరోనా కష్టాలు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిప్పి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అనేక మంది ప్రస్తుతం మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలల్లో అడ్మిషన్లు హోరెత్తుతున్నాయి. అయితే, ఇది వరకు తమ పిల్లలు చదువుకున్న పాఠశాలలు టీసీలు ఇవ్వడంలో జాప్యం చేయడం, ఫీజులు చెల్లిస్తేనే టీసీ అంటూ వేధిస్తున్నట్టుగా విద్యాశాఖకు ఫిర్యాదులు పెరిగాయి. అదే సమయంలో ఒక తరగతి నుంచి మరో తరగతిలో చేరాలంటే ప్రభుత్వ పాఠశాలలో టీసీ సమర్పించాల్సి ఉంది. అయితే, ప్రైవేటు విద్యా సంస్థలు టీసీలు ఇవ్వకుండా వేధిస్తుండడంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పలేదు. దీనిపై విద్యాశాఖకు ఫిర్యాదులు హోరెత్తాయి. దీంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు టీసీ సమర్పించకుండానే అడ్మిషన్లు పొందేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తిరుచ్చి విద్యాశాఖ అధికారి శాంతి పేర్కొంటూ ఫిర్యాదులను పరిగణించి టీసీ లేకున్నా అడ్మిషన్లపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. కాగా, ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులను ఈరోడ్‌లో శాలువతో సత్కరించి మరీ ఉపాధ్యాయులు ఆహ్వానిస్తుండడం విశేషం. ఇక, అడ్మిషన్లను పరిగణించి ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లోనే ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. చర్యలు తప్పవు.. ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యాశాఖా మంత్రి సెంగోట్టయన్ హెచ్చరికలు జారీ చేశారు. ఫీజుల పేరిట తల్లిదండ్రుల్ని వేధిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తే, ఆయా విద్యా సంస్థలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఒకటో తరగతిలో లక్షా 72 వేల మంది కొత్తగా చేరారని, సెప్టెంబరులోనూ అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలల్లో సాగుతాయని తెలిపారు. పాఠ్యపుస్తకాలన్నీ సిద్ధంగానే ఉన్నాయని, కొత్తగా చేరే విద్యార్థులకు 14 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు తగ్గ చర్యలపై సీఎంతో సమీక్షించనున్నామన్నారు. ఇదిలాఉండగా వివిధ కళాశాల్లో చదువుతూ అరియర్స్ రాయడం కోసం ఫీజులు కట్టిన విద్యార్థులందరూ ఆల్‌పాస్ అని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఈ దృష్ట్యా, వీరిని కూడా పాస్ చేయాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. -
సాక్షి కథనంపై స్పందించిన మంత్రి సబితా
సాక్షి, మర్పల్లి : సాక్షి దినపత్రికలో ప్రచురితమైన పశువులు కాస్తున్న విద్యార్థి కథనంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. జామకాయలు దొంగతనం చేశాడన్న కారణంగా పాఠశాల హెడ్ మాస్టర్ ఒక విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించగా, సదరు విద్యార్థి పశువులను కాస్తున్నాడంటూ సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి వెంటనే సదరు విద్యార్థిని తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ వ్యవహారం మొత్తంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. ఆ బాలుడి పేరు కిషన్. వికారాబాద్ జిల్లా మర్పల్లి ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి చదువుతున్నాడు. ఈ నెల 11న తోటి విద్యార్థులతో కలసి పాఠశాల పక్కనున్న తోటలో జామకాయలు తెంపాడు. దాంతో జామకాయలు దొంగతనంగా కోయడాన్ని తెలుసుకున్న హెడ్ మాస్టర్ నర్సింగ్‌రావు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆంగోత్ శంకర్, చాందీబాయిని పిలిచి.. ‘మీ అబ్బాయి దొంగతనాలు చేస్తున్నాడు. గతంలో కూడా అతను తండాలో దొంగతనాలు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. తీసుకెళ్లండి’ అంటూ టీసీ చేతిలో పెట్టి పంపించారు. టీసీ ఇస్తే ఎలా అని, చదువు ఆగిపోతుందంటూ ఈ ఏడాది పాఠశాలలోనే ఉంచాలని తల్లిదండ్రులు వేడుకున్నా హెచ్ఎం వినిపించుకోలేదు. దాంతో చేసేది లేక కిషన్ పశువుల కాపరిగా మారాడు. -
టీసీ కావాలంటే అ'ధనం' ఇవ్వాల్సిందే..!
సాక్షి, చీరాల (ప్రకాశం): ‘మా పిల్లలను వేరే పాఠశాలలో చేర్పిస్తున్నాము టీసీ కావాలంటూ ఓ విద్యార్థి తండ్రి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళాడు. టీసీ ఎందుకు..? మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తాము. టీసీ కావాలి’ అని అడిగాడు. టీసీ కావాలంటే అ‘ధనం’ ఇవ్వాలంటూ ఆ స్కూల్ యాజమాన్యం బదులిచ్చింది. ఫీజు బకాయిలు చెల్లించాము గదా, అదనపు డబ్బులు ఎందుకు అని ప్రశ్నించినా సమాధానం లేదు. టీసీ ఇవ్వాలంటే రూ.1000లు ఇవ్వాలంటూ ఆ స్కూల్ యాజమాన్యం బదులిచ్చింది. అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో తిప్పించుకుంటున్నారు. ఇదే సంఘటనలు చీరాల మండలంలో కనిపిస్తున్నాయి. టీసీలు కావాలని అడుగుతున్నా ప్రైవేటు యాజమాన్యాలు ఇవ్వడం లేదు. మండలంలోని పలు ప్రైవేటు పాఠశాలలు ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అలానే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. రాజన్న బడిబాట, అమ్మ ఒడి పథకం వంటివి నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తే రూ.15వేలు తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలు ఈ విధంగా టీసీలు ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రదక్షిణలు చేయిస్తున్నాయి. వెయ్యి రూపాయలు ఇస్తేనే టీసీ ఇస్తామని అంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ సంఘటనలపై విద్యాశాఖాధికారులు కూడా స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
టీసీ కోసం తప్పని పడిగాపులు
సాక్షి, సిటీబ్యూరో: ‘యూసఫ్‌గూడకు చెందిన జోష్న రహమత్‌నగర్‌లోని న్యూటన్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి వరకు చదివింది. ఈ ఏడాది మరో స్కూలుకు మారాల్సి వచ్చింది. దీంతో రెండు నెలల క్రితం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ)కోసం దరఖాస్తు చేసింది. అయితే ఇప్పటి వరకు ఆమెకు టీసీ ఇవ్వలేదు. అదే మంటే డీఈఓ ఆఫీసు నుంచి ఇంకా రాలేదని చెప్పుతున్నారు. దీంతో ఇక్కడ చదవలేక..మరో స్కూల్లో అడ్మిషన్ పొందలేక ఇబ్బందిపడాల్సి వస్తుంది’ ఇలా జోష్న మాత్రమే కాదు..ఇలా అనేక మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి విద్యాసంవత్సరం ప్రారంభంలో చాలా మంది విద్యార్థులు ఒక స్కూ లు నుంచి మరో స్కూల్‌కు మారుతుంటారు. వీరంతా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు(టీసీ)ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తు చేసిన వారం రోజుల్లోనే టీసీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. అడ్మిషన్ చేజారిపోకుండాముందుజాగ్రత్తలు హైదరాబాద్ జిల్లా పరిధిలో 684 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో 122510 మంది చదువుతుండగా, 294 ఎయిడెడ్ స్కూళ్లలో 56495 మంది చదువు తున్నారు. 2259 ప్రైవేటు స్కూళ్లు ఉండగా 579742 మంది చదువుతున్నారు. వీరిలో చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీపై వెళ్తుంటారు. అద్దె ఇళ్లలో ఉంటున్న మరికొంత మంది ఒక కాలనీ నుంచి మరోకాలనీకి మారుతుంటారు. ఇంకొంత మంది ఉత్తమ బోధనను అందిస్తున్న స్కూళ్లలో చేరుతుంటారు. పదోతరగతి పాసైన వారు పై చదువులకు వెళ్తుంటారు. వీరంతా టీసీల కోసం ఇప్పటికే దర ఖాస్తు చేసుకున్నారు. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆయా విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపగా, మరికొన్ని నిరాకరిస్తున్నాయి. అదేమంటే పాఠశాల వద్ద టీసీ ధృ వపత్రాల బుక్ అయిపోయిందని, కొత్తబుక్ పంపించాల్సిందిగా ఇప్పటికే జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు కూడా చేశామని, వారి నుంచి ఇంకా రాలేదని చెప్పిత ప్పించుకుంటారు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమస్య పెద్దగా లేనప్పటికీ....అడ్మిషన్ చేజారిపోకుండా అడ్డుకునేందుకు కొన్ని ప్రైవేటు పాఠశాలు ఇలా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. కొనసాగుతున్న సహాయ నిరాకరణ: హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైంది. ఈటీఆర్ల జారీపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇప్పటికే కొంత మంది అరెస్టైన సంగతి తెలిసిందే. ఎవరో ఒక్కరు చేసిన తప్పులకు అందరినీ బలిచేస్తున్నారని పేర్కొంటూ కార్యాలయ సిబ్బంది సహా డీఐఓలు, డిప్యూటీ డీఈఓలు ఉన్నతాధికారులకు సహకరించడం లేదు. దీంతో టీసీ బుక్‌ల జారీ సహా కీలకమైన ఫైళ్లన్ని పెండింగ్‌లో పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు యాజామన్యాలే కాదు, ఉపవిద్యా శాఖాధికారులు కూడా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి వెళ్లేందుకు వెనుక డుగేస్తున్నారు. ఈ పరిణామాలు ఇటు యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉపాధ్యాయులకు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన జిల్లా విద్యాశాఖాధికారి మీటింగ్‌ల పేరుతోనిత్యం వారికి దూరంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఫోన్ చేసినా కనీసంస్పందించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. -
రైల్వేలో సీటీఐల హవా!
సాక్షి, విజయవాడ: విజయవాడ స్టేషన్ పరిధిలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ల(సీటీఐ)హవా సాగుతోంది. ఉన్నతాధికారుల్ని ప్రసన్నం చేసుకుని ఇక్కడ నుంచి బదిలీ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రయాణికుల నుంచి జరిమానాలు వసూలు చేయకుండా తమ జేబులు నింపుకుంటున్నారు. రైల్వే ఆదాయానికి గండికొడుతున్నారు. ఆయన రూటే సేప‘రేటు’ విజయవాడ స్టేషన్లో పనిచేసే ఒక కీలక సీటీఐ రూటే సెప‘రేటు’. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్(టీæటీఈ)ల నుంచి ముడుపులు వసూలు చేస్తుండడంతో ఆయన్ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు రైల్వేస్టేషన్లో ప్రచారం జరుగుతోంది. ఓ టీటీఈ నెలరోజులు సెలవు అడిగితే రూ.30వేలు డిమాండ్ చేయడంతో ఆయన భార్య ఏకంగా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసింది. డ్యూటీలు వేసే విషయంలోనూ, పదోన్నతుల ఇప్పిస్తానంటూ డబ్బులు గుంజుతారనే ఆరోపణలు ఉన్నాయి. టీటీఐలపై ఏదైనా ఫిర్యాదు వస్తే వారికి పండగే. తన చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు తనకు ఇవ్వాల్సిన మామూళ్లను నగరంలోని ఒక మద్యం దుకాణంలో ఇచ్చే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. నకిలీ సర్టిఫికెట్లతో చలామణి కొంతమంది సీటీఐలు చూపిస్తున్న కుల సర్టిఫికెట్లపైన వివాదాలు ఉన్నాయి. విజయవాడ స్టేషన్ పరిధిలో చేసే కొందరు సీటీఐల కుల సర్టిఫికెట్లపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేసి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వమని కోరినా ఇవ్వలేదని తెలిసింది. ఒక సీటీఐ కుల సర్టిఫికెట్‌ను ఉన్నతాధికారులు నిలుపుదల చేయగా, ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. సీటీఐలపై ఫిర్యాదులు వస్తే చార్జిషీట్ ఇస్తారు. దీన్ని ఆరునెలల్లోపు విచారణ పూర్తిచేసి చర్యలు తీసుకోవాలి. విచారణాధికారి, ఉన్నతాధికారుల్ని ప్రలోభ పెట్టి తమపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా జాగ్రత్త సీటీఐలు జాగ్రత్త పడుతున్నారు. ఆయనకు ఎప్పుడూ ప్రొటోకాల్ డ్యూటీయే ఓ సీటీఐ ఎప్పుడూ ప్రొటోకాల్ డ్యూటీయే చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా ఉన్నతాధికారులు వస్తే ప్రొటోకాల్ ఆఫీసర్లుగా ఎస్ఎస్, ఎస్ఆర్ఎం, డీప్యూటీ ఎస్ఎస్, ఏఎస్‌ఎంలు వ్యవహరించాలి. లేకుంటే ఆయా విభాగాల నుంచే ప్రొటోకల్ అధికారిని నియమించుకోవాలని రైల్వే బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిబంధనలను తుంగలోతొక్కి ఏ ఉన్నతాధికారి వచ్చినా ఆయనే ప్రొటోకాల్ అధికారిగా వెళతారు. ఈయన డ్యూటీ కంటే ప్రొటోకాల్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఆహార పదార్థాలు అమ్ముకునే వారినీ వదలడం లేదు.. ఒక్కొక్క సీటీఐ ఐదేళ్లు మాత్రమే చేయాలి. ఉన్నతాధికారుల అనుమతితో మరొక ఏడాది చేయవచ్చు. ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకు మార్చాలంటే ఆ సీటీఐ కనీసం రెండేళ్లు రైల్వేస్టేషన్, ఎమినిటీస్ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇటువంటి నిబంధనలు విజయవాడ డివిజన్లో పాటించడం లేదని తెలిసింది. కొంతమంది సీటీఐలు దీర్ఘకాలంగా తిష్ట వేసుకుంటున్నారు. వీరికి ఇచ్చే టార్గెట్లను పూర్తిచేసే విషయంలోనూ సులభమైన మార్గాలు అన్వేషిస్తున్నారు. బీహార్, బడిశా, పశ్చిమ బెంగాల్ తదితర దూర ప్రాంతాలకు రిజర్వేషన్ దొరకనప్పుడు ప్రయాణికులు సాధారణ టికెట్ కొనుగోలు చేసి రిజర్వేషన్ బోగీలో ఎక్కేస్తారు. ఇటువంటి వారికి జరిమానాలు వేసి టార్గెట్లు పూర్తిచేసుకుంటున్నారు. అదే సమయంలో వారి జేబులు నింపుకుంటున్నారు. టార్గెట్లు పూర్తయ్యేందుకు చెన్నై తదితర నగరాలకు కూడా వెళ్లి తనిఖీలు చేసుకుని గూడూరులో కేసులు నమోదు చేసినట్లు చూపిస్తున్నారంటూ రైల్వే ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రూట్లో రైలు వద్ద ఆహార పదార్థాలు అమ్ముకునే కాంట్రాక్టును ఒక కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే కాంట్రాక్టు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. ఈ రూట్లో ప్లాట్‌ఫారంపై అనధికారికంగా ఆహారపదార్థాలు అమ్మే వారి నుంచి సీటీఐలు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం ఓ సీటీఐపై ఆరోపణలు రావడంతో నా కార్యాలయం నుంచి పంపేశాను. టీటీఈలు లేదా సిబ్బంది డబ్బు కోసం వేధిస్తే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాను. ఫోన్ నంబర్లు అందరికీ అందుబాటులో ఉంచాం. ఎస్ఎంఎస్ చేస్తేచాలు విచారించి చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేసే వారి సమాచారం రహస్యంగా ఉంచుతాం. తరచూ గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసి సిబ్బంది సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. –షిపాలీ కుమారి, సీనియర్ డీసీఎం -
టీసీ ఇవ్వలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో ఓ యువకుడు బుధవారం వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ఓ ప్రైవేటు కాలేజీలో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న యువకుడు టీసీ(ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కళాశాల యజమాన్యం తనకు టీసీ ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. బాధిత విద్యార్థి వాటర్ ట్యాంకు ఎక్కాడు. టీసీ ఇవ్వకపోతే ట్యాంక్ పైనుంచి దూకుతానని విద్యార్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. -
టీసీల కోసం విద్యార్థుల తిప్పలు
వరంగల్ చౌరస్తా: పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులు టీసీ(బదిలీ సర్టిఫికెట్) కోసం నానా తిప్పలు పడుతున్నారు. వారం రోజులుగా వరంగల్ మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాఠశాల గేటు ఎదుట పడిగాపులు కాసిన విద్యార్థులు, తల్లిదండ్రులు గురువారం హెచ్ఎం చాంబర్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 39 మంది పదో తరగతి విద్యార్థులుండగా 29 మం ది ఉత్తీర్ణులయ్యారు. ఈ నెల 3న ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. పాలిటెక్నిక్, బాసర త్రిపుల్ ఐటీ తదితర ఎంట్రెన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు టీసీల కోసం ఎదురు చూస్తున్నారు. వివిధ అర్హత పరీక్షలు రాసిన విద్యార్థులు కౌన్సెలింగ్ గడువు దగ్గర పడటంతో టీసీల కోసం ఎదురు చూస్తున్నారు. పలుమార్లు హెచ్ఎంకు ఫోన్ చేయగా ఈ నెల 14న పాఠశాలకు విచ్చేశారు. కేవలం నలుగురు విద్యార్థులకు టీసీలు జారీ చేశారు. అవి కూడా అసంపూర్తి వివరాలతో తప్పుల తడకగా ఉన్నాయి. టీసీల కోసం మిగిలిన విద్యార్థులు నానా ఇబ్బందుల పడుతున్నారు. వారం రోజులుగా పాఠశాల అవరణలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ హెచ్ఎం, సిబ్బంది జాడ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడిచినా హెచ్ఎం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ... పదో తరగతి ఫలితాలు వెలువడిన తరువాత నుంచి ఆయా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎం, సీనియర్ ఉపాధ్యాయుడు లేదా క్లర్కు, అటెండర్లు అందుబాటులో ఉండాలి. అందుకోసం ప్రభుత్వం సంపాదిత సెలవుల(ఎర్న్డ్ లీవ్స్) రూపేణా వేలాది రూపాయలు చెల్లిస్తోంది. అయినప్పటికీ కొన్ని పాఠశాలల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హెచ్ఎం పాఠశాలకు హాజరుకాకున్నా సంపాదిత సెలవు జీతాలను తీసుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. హెచ్ఎం వ్యవహార శైలితో తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు టీసీలు సమర్పించాల్సిన అవసరం ఉంది. -
రైల్వే ప్రయాణికుడిపై కానిస్టేబుల్, టీసీ దాడి
రైల్వేగేట్ : రైలు ప్రయాణికుడిపై జీఆర్పీ కానిస్టేబుల్, టీసీ దాడిచేసి డబ్బులు లాక్కున్న ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండకు చెందిన మాలోతు వెంకన్న మహబూబాబాద్ నుంచి సోమవారం శిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలులో వస్తున్నాడు. తెలియకుండా రిజర్వేషన్ బోగీలో ఎక్కగా టీసీ రాజు వచ్చి రూ.375 ఫైన్ చెల్లించాలన్నాడు. తాను అనుకోకుండా ఎక్కానని చెప్పినా వినకుండా ఖమ్మం జీఆర్పీ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌రెడ్డిని తీసుకొచ్చి ఇద్దరు కలిసి కొట్టారు. అలాగే, వెంకన్న కూతురు ఫీజు కట్టేందుకు తెచ్చుకున్న రూ.5వేలు బలవంతంగా లాక్కున్నారు. ఇంతలో వరంగల్ రైల్వేస్టేషన్‌కు రైలు రాగా దిగిన వెం కన్న జీఆర్పీలో టీసీ రాజు, కానిస్టేబుల్ చంద్రశేఖర్‌రెడ్డిపె ఫిర్యాదు చేశా డు. కాగా, ఈ ఘటనపై ఘటనపై విచారణ జరుపుతున్నామని వరంగల్ జీఆర్పీ సీఐ టి.స్వామి తెలిపారు. -
ఫూటుగా తాగి రైల్వే టీసీ వీరంగం
ప్రయాణికులను దుర్బాషలాడి, భయపెట్టిన వైనం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘటన రాజమహేంద్రవరం సిటీ : విధి నిర్వహణలోనే మద్యంమత్తులో తూగుతూ, రైల్వే ప్రయాణికులను దుర్బాషలాడి, జైలులో పెట్టిస్తానంటూ భయంకంపితులను చేసిన రైల్వే టీసీ ఉదంతమిది. ప్రయాణికులు కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది సోమవారం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో ఆ టీసీ గంగాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో టీసీ గంగాప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. మద్యం తాగి, విధులు నిర్వహిస్తున్న అతడు రైలు బయలుదేరినప్పటి నుంచి ప్రయాణికులను దుర్బాషలాడాడు. జైల్లో పెట్టిస్తానంటూ భయకంపితులను చేశాడు. ఈ మేరకు ప్రయాణికులు 182 కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేశారు. వికలాంగులు, మహిళలతోనూ ఇబ్బందికరంగా ప్రవర్తించాడంటూ ప్రయాణికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు రాజమహేంద్రవరం స్టేషన్‌కు చేరుకోగానే, గంగాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తాను తప్పు చేశానంటూ ప్రయాణికుల కాళ్లపైపడి ప్రాధేయపడ్డాడు. అయినా ప్రయాణికులు అతడిని కనికరించలేదు. రాజమహేంద్రవరం స్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అతడి వద్దనుంచి రిజర్వేషన్ చార్ట్‌ను స్వాధీనం చేసుకుని, రైలులో ఉన్న మరో టీసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. రైల్వే హెల్త్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వీఎస్ కుమారి బ్రీత్ ఎనలైజర్ ద్వారా గంగాప్రసాద్‌కు పరీక్షలు నిర్వహించి, రక్తనమూనా సేకరించారు. అతడు ఇలా ప్రవర్తించడం రెండోసారి. జూలై నెలలో అతడు మద్యంమత్తులో ప్రయాణికులతో ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో, ప్రభుత్వ రైల్వే పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. తొలి తప్పుగా క్షమించాలని కోరడంతో, ప్రయాణికులు తమ ఫిర్యాదును రద్దు చేసుకున్నారు. -
‘కస్తూర్బా’ నుంచి ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్
♦ టీసీ ఇచ్చి పంపించేసిన అధికారులు ♦ విచారణ చేపట్టిన జీసీడీవో శకుంతల ఎడపల్లి : ఎడపల్లి శివారులో గల కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులకు టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఆరో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు ఈ నెల 17న రాత్రి అనుమతి లేకుండా పాఠశాల నుంచి బయటకు వచ్చారు. ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా, అటుగా వచ్చిన కారు డ్రైవర్ వారిని గమనించి స్థానిక పోలీసుస్టేషన్లో అప్పగించారు. దీంతో పోలీసులు కాస్తుర్బా పాఠశాల ప్రిన్సిపల్‌కు సమాచారమివ్వగా, ఆమె వచ్చి విద్యార్థినులను పాఠశాలకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారం డీఈవోకు తెలియడంతో విచారణ జరపాలని బాలికల సంరక్షణ అధికారి (జీసీడీవో) శకుంతలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆమె గురువారం కస్తూర్బా పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. విద్యార్థినులు బయటకు పోతున్నా ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న వార్డెన్‌ను ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పీఈటీ మీరాబాయి, నైట్ వాచమన్ మహేరాబేగం, హెచ్ఎం కాయకాసంలను విచారించారు. ఇంత జరిగినా అధికారులకు ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముదం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించి, టీసీ ఇచ్చి పంపించేశారు. -
టీసీ ఇవ్వలేదని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కారేపల్లి: ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం టీసీ ఇవ్వలేదని..ఇంటర్ విద్యార్థిని జ్వరం టాబ్లెట్లు, కిరోసిన్ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...గుంపెళ్లగూడెం గ్రామానికి చెందిన తాటి స్వప్న కారేపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో గత ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేయగా, కొన్ని సబ్జెక్టులు తప్పాయి. అప్పటి నుంచి టీసీ, సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాల యాజమాన్యం చుట్టూ తిరిగింది. ఈ ఏడాదైన సర్టిఫికెట్లు ఇస్తారేమోననే ఆశతో స్వప్న ఈ నెల 18వ తేదీన కాలేజీకి వెళ్లగా..సోమవారం ఇస్తామని యాజమాన్యం తెలిపింది. ఉదయం స్వప్న కాలేజీకి వెళ్లగా, వ్యాను ఫీజు రూ. 2 వేలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని దబాయించారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు స్వప్నను స్థానిక ఆర్ఎంపీ వద్దకు, అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. -
కొరియర్ లో టీసీలు
♦ ఫీజు చెల్లించలేదని 22 మంది విద్యార్థులకు ఉద్వాసన ♦ అమృతా విద్యాలయం నిర్వాకం హైదరాబాద్ : ఫీజు చెల్లించలేదన్న కారణంగా నగరంలోని ఓ స్కూల్ 22 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చింది. నేరుగా ఇస్తే తీసుకోరన్న ఉద్దేశంతో కొరియర్ ద్వారా నేరుగా విద్యార్థుల ఇళ్లకు పంపడం గమనార్హం. మహేంద్రహిల్స్‌లోని అమృత విద్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న ధర్నాకు అమృత స్కూల్లో గెంటివేతకు గురైన విద్యార్థులను తీసుకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు పాఠశాలలో గత నాలుగేళ్లుగా ఏటా ఫీజులు పెంచుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఫీజులను తగ్గించాలని పట్టుబట్టినా యాజమాన్యం తిరస్కరించిందన్నారు. వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల కాగానే.. ఫీజులు చెల్లించని విద్యార్థులకు కొరియర్లో టీసీలు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీఈఓ, పాఠశాల విద్య కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అవును.. టీసీలు ఇచ్చాం: ప్రిన్సిపాల్ గతేడాది ఫీజులు చెల్లించని 22 మంది విద్యార్దులకు టీసీలను పోస్టు ద్వారా పంపించినట్లు అమృత విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీకుమారి అగీకరించారు. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ముగిసిన తరువాత వారికి ఫలితాలు వెల్లడించి టీసీలు ఇచ్చామన్నారు. నగరంలో అన్ని సీబీఎస్ఈ స్కూళ్లలోకెల్లా తామే తక్కువ ఫీజు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణలు సరికాదని, తమ స్కూల్‌కు సంబంధించిన ప్రతి రికార్డు డీఈఓ కార్యాలయంలో ఉందన్నారు. -
చదువు సరిగా రావడం లేదంటే.. టీసీ ఇచ్చారు
బెల్లంపల్లి (ఆదిలాబాద్): తమ పిల్లలకు చదువు సరిగా రావడం లేదని ఓ మహిళ స్కూల్ టీచర్‌ను నిలదీయడంతో... ఆ టీచర్ ఏకంగా టీసీ ఇచ్చి విద్యార్థులను ఇంటికి పంపించేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. సుబ్బరావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేకల రాధిక కుమారుడు వినయ్ (3వ తరగతి), హిమబిందు (5వ తరగతి) చదువుతున్నారు. వీరితో పాటు పాఠశాలలో మొత్తం ఆరుగురు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. తమ ఇద్దరు పిల్లలకు చదువు సరిగా రావడం లేదని, కనీసం జాతీయ గీతం కూడా పాడలేకపోతున్నారని ఉపాధ్యాయురాలిని శారద అడిగింది. ఇందుకు ప్రతిగా స్పందించిన ఉపాధ్యాయురాలు 'మీ పిల్లలను మీ ఇష్టం ఉన్న స్కూల్లో చదివించండని' ఏకంగా ఇద్దరు విద్యార్థులకు టీసీ ఇచ్చి ఇంటికి పంపించింది. విద్యా సంవత్సరం ముగింపు దశలో టీసీ ఇవ్వడం వల్ల తమ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తాము ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చదివించే స్థోమత లేకనే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు రాధిక పేర్కొన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటనపై బెల్లంపల్లి ఎంఈఓ మోహన్‌ను వివరణ కోరగా పక్షం రోజుల క్రితం రాధిక పిల్లలకు టీచర్ టీసీ ఇచ్చారని తెలిపారు. ఆ పిల్లల తల్లి కోరిక మేరకే టీసీ ఇచ్చినట్లు టీచర్ చెప్పారని పేర్కొన్నారు. సదరు విద్యార్థులను స్కూల్లో చేర్చుకోవాలని టీచర్‌ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. -
ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు రచ్చ..రచ్చ
మాచర్ల బస్టాండ్‌లో రెండు యూనియన్ల మధ్య ఘర్షణ పోలీసుల లాఠీచార్జ్ బస్టాండ్‌లో భారీ బందోబస్తు అధిక శాతం పోలింగ్ మాచర్ల : మాచర్ల బస్టాండ్‌లో గురువారం జరిగిన ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు ఘర్షణకు దారితీశాయి. ఎంప్లాయీస్, ఎన్ఎంయూ యూనియన్ల నేతలు ఒకరినొకరు నెట్టుకుంటూ దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 451 ఓట్లు కలిగిన డిపోలో ఉదయం 5 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. అమరావతి నుంచి వచ్చిన కార్మిక శాఖ అధికారి జి.నాగేశ్వరరావు, స్థానిక కార్మిక సహాయ అధికారి హరికృష్ణారెడ్డి, సిబ్బంది సీహెచ్ బాబు, శ్రీనివాసరావు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి 420 ఓట్లు పోలయ్యాయి. అప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన పోలింగ్ కొద్దిసేపట్లోనే ఉద్రిక్తంగా మారింది. రెండు యూనియన్లకు చెందిన కొంత మంది కార్మికులు ఆధిపత్యం పేరుతో ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. దాడులకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. రెండు యూనియన్ల నాయకులను శిబిరాల్లోకి పంపించి వేశారు. ఘర్షణ జరగటంతో డీఎం శివశంకర్ పోలీసులతో చర్చించి మరింత బందోబస్తు ఏర్పాటు చేయించారు. -
టికెట్ తీసుకోలేదని మహిళపై దాడి!
-
బకాయిలు అందవు.. పత్రాలు ఇవ్వరు !
ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థి తాను చదువుకున్న కోర్సు పూర్తికాగానే ఉన్నత చదువు చదవాలన్నా, ఉద్యోగ ప్రయత్నం చేయూలన్నా స్టడీ, కాండాక్ట్‌ప్రొవిజినల్, టీసీ, ఓడి వంటి ధ్రువీకరణ పత్రాలు ఎంతో అవసరం అవుతాయి. ప్రస్తుతం కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పరీక్షల రిజల్ట్ కంటే రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలు మంజూరు కోసం విద్యార్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అధికారులు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు మంజూరు అయితేనే ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు. లేకపోతే ప్రభుత్వం బకాయి పడ్డ సొమ్ములు విద్యార్థులు చెల్లించి రీయింబర్స్మెంట్ సొమ్ము మంజూరు కాగానే వాటిని విద్యార్థులు తీసుకోవాలని మెలిక పెడుతున్నారు. గతంలో సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖలు ఇచ్చిన హామీ పత్రాలతో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవారు .ప్రస్తుతం మాత్రం అధికారులు బకాయిలు ఉన్న విద్యార్థులకు హామీ పత్రాలతో ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటం లేదు.విద్యార్థులుకు ప్రభుత్వం సకాలంలో రీయింబ ర్స్మెంట్, ఉపకార వేతనాలు మంజూరు చేయడంలేదు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో 16 కోర్సులకు చెందిన విద్యార్థులు సుమారు 400 మంది వరకు ఈ ఏడాది రిలీవ్ అయ్యారు. ఏప్రిల్ నెల నాటికే వీరికి రీయింబార్స్ మెంట్, ఉపకార వేతనాల నిధులు విడుదల కావాలి. అయితే విద్యా సంవత్సరం ముగిసి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా నిధులు విడుదల కాలేదు. పీజీ రిజల్స్ వచ్చి పది రోజులు దాటుతోంది. విద్యార్థులు సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల చుట్టూ తిరుగుతున్నారు. ఈ శాఖల అధికారులు ట్రెజరీలకు విద్యార్థుల వివరాలు తెలియజేశామని వారి అకౌంట్లలో డబ్బులు పడతాయని అంటున్నారు. ట్రెజరీ అధికారులు మాత్రం నిధులు తమకు చేరలేదని చెబుతున్నారు. ప్రస్తుతం రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం బీసీ, ఈబీసీ విద్యార్థులు 189, ఎస్సీ విద్యార్థులు 133 మంది ఎదురుచూస్తున్నారు. ఎల్ఎల్బీ వంటి కోర్సు పూర్తి చేసు కున్న విద్యార్థులు బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకోవాలంటే ధ్రువీకరణ పత్రం అవసంరం. ఉపాధికి అవకాశం ఉన్న ఎంబీఏ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, గణితం వంటి పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సైతం జాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు మంజూరు కోసం వారంతా ఎదురుచూపులు చూస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలియజేశాం.. ఈ సమస్యపై ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశాం. రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విద్యార్థుల అకౌంట్లోనే నమోదవుతాయి. వర్సిటీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ముందుగా విద్యార్థుల నుంచి బకాయిల సొమ్ము వసూలు చేస్తున్నాం. - రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, బీఆర్‌ఏయూ -
మహిళా టీసీని తోసేసిన దుండగులు
-
మహిళను రైల్లోంచి తోసేసిన టీసీ
-
గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా
- డీఈఓ విజయభాస్కర్ ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రారంభ అనుమతి లేకుండా కొత్తగా పాఠశాలలను ప్రారంభించరాదు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించరాదని చట్టం చెబుతోంది. అయితే ఈ నిబంధనలన్నింటినీ తోసిరాజని కొందరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి గుర్తింపు, అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తుండటంపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత విద్యాసంవత్సరంలోనే అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలకు భారీగా జరిమానాలు కూడా విధించారు. విద్యాహక్కు చట్టం అమలుల్లోకి వచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలైంది. ఇప్పటికీ ఇంకా ఈ చట్టం నిర్దేశించిన అంశాలను తోసిరాజని కొత్త ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించొద్దు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పిండొద్దని డీఈఓ విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు ఆ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తెలుసుకుని గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరం (2014-15)లో అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చదివి విద్యార్థులు నష్టపోతే దానికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించవద్దని తాము ముందుగానే హెచ్చరిస్తున్నందున విద్యార్థులు నష్టపోతే తమకేమీ బాధ్యత లేదన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు జారీ చేసే స్టడీ సర్టిఫికెట్లు, టీసీలు చెల్లవని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 100కుపైగా ఒక్క ఒంగోలులోనే 27 ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారని, ఆ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. -
వామ్మో..డబుల్ డెక్కరా !
తిరుపతిఅర్బన్, న్యూస్‌లైన్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆర్భాటంగా ప్రారంభించిన డబు ల్ డెక్కర్ రైలు అంటేనే ప్రయాణికులు, టీసీలు జడుసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. రైలు ఈ నెల 14వ తేదీ ప్రారంభమైనప్ప టి నుంచీ రైలులోని అన్ని బోగీల్లో ఏసీలు పనిచేయడం లేదు. దీనిపై ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నా అధికారుల్లో చలనం లేదు. శనివారం ఉదయం 6.45 గంటలకు కాచీగూడ నుంచి తిరుపతికి బయలుదేరింది. రైల్లోని అన్ని బోగీల్లో ఏసీలు పనిచేయలేదు. దీంతో ప్రయాణికులు టీసీలపైకి దాడికి దిగారు. కర్నూలు, కడప రైల్వే స్టేషన్లలో టీసీలపై చేయిచేసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. అంతేగాక ఈ రైలు నిర్ణీత వేళల ప్రకారం సాయంత్రం 5.15 గంటలకు తిరుపతికి చేరుకోవాల్సి ఉండగా శనివారం రాత్రి 8.40 గంటలకు చేరుకుంది. ప్రయాణికులు తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ కార్యాలయంవద్దకు ఆందోళన చేశారు. -
కీచక అవతారమెత్తిన TC