
రైల్వే ప్రయాణికుడిపై కానిస్టేబుల్, టీసీ దాడి
రైల్వేగేట్ : రైలు ప్రయాణికుడిపై జీఆర్‌పీ కానిస్టేబుల్, టీసీ దాడిచేసి డబ్బులు లాక్కున్న ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండకు చెందిన మాలోతు వెంకన్న మహబూబాబాద్ నుంచి సోమవారం శిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలులో వస్తున్నాడు. తెలియకుండా రిజర్వేషన్ బోగీలో ఎక్కగా టీసీ రాజు వచ్చి రూ.375 ఫైన్ చెల్లించాలన్నాడు.
తాను అనుకోకుండా ఎక్కానని చెప్పినా వినకుండా ఖమ్మం జీఆర్‌పీ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌రెడ్డిని తీసుకొచ్చి ఇద్దరు కలిసి కొట్టారు. అలాగే, వెంకన్న కూతురు ఫీజు కట్టేందుకు తెచ్చుకున్న రూ.5వేలు బలవంతంగా లాక్కున్నారు. ఇంతలో వరంగల్ రైల్వేస్టేషన్‌కు రైలు రాగా దిగిన వెం కన్న జీఆర్‌పీలో టీసీ రాజు, కానిస్టేబుల్ చంద్రశేఖర్‌రెడ్డిపె ఫిర్యాదు చేశా డు. కాగా, ఈ ఘటనపై ఘటనపై విచారణ జరుపుతున్నామని వరంగల్ జీఆర్‌పీ సీఐ టి.స్వామి తెలిపారు.