grp Constable
-
రైల్వే ప్రయాణికుడిపై కానిస్టేబుల్, టీసీ దాడి
రైల్వేగేట్ : రైలు ప్రయాణికుడిపై జీఆర్పీ కానిస్టేబుల్, టీసీ దాడిచేసి డబ్బులు లాక్కున్న ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండకు చెందిన మాలోతు వెంకన్న మహబూబాబాద్ నుంచి సోమవారం శిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలులో వస్తున్నాడు. తెలియకుండా రిజర్వేషన్ బోగీలో ఎక్కగా టీసీ రాజు వచ్చి రూ.375 ఫైన్ చెల్లించాలన్నాడు. తాను అనుకోకుండా ఎక్కానని చెప్పినా వినకుండా ఖమ్మం జీఆర్పీ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌రెడ్డిని తీసుకొచ్చి ఇద్దరు కలిసి కొట్టారు. అలాగే, వెంకన్న కూతురు ఫీజు కట్టేందుకు తెచ్చుకున్న రూ.5వేలు బలవంతంగా లాక్కున్నారు. ఇంతలో వరంగల్ రైల్వేస్టేషన్‌కు రైలు రాగా దిగిన వెం కన్న జీఆర్పీలో టీసీ రాజు, కానిస్టేబుల్ చంద్రశేఖర్‌రెడ్డిపె ఫిర్యాదు చేశా డు. కాగా, ఈ ఘటనపై ఘటనపై విచారణ జరుపుతున్నామని వరంగల్ జీఆర్పీ సీఐ టి.స్వామి తెలిపారు. -
ఖాకీ కాఠిన్యం..
గ్వాలియర్ః రైల్వే స్టేషన్ లో పిక్ పాకెటింగ్ కు పాల్పడ్డాడన్న అనుమానంతో ఓ బాలుడిపై రైల్వే కానిస్టేబుల్ ప్రతాపం చూపించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లో జరిగిన ఘటన అందర్నీ విస్మయ పరచింది. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో బాలుడి మెడకు టవల్ ను కట్టి, దారుణంగా కొడుతూ ఈడ్చుకెళ్ళడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆగస్టు 27న ప్లాట్ ఫాం నెంబర్ 1 లో జరిగిన ఘటనపై రికార్డయిన వీడియో వైరల్ గా మారింది. గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో బాలుడ్ని తీవ్రంగా హించించిన ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ను వీడియో ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ హరి నారాయణ్ సింగ్ (50) గా గుర్తించారు. అయితే బాలుడ్ని విచక్షణా రహితంగా కొడుతూ, ప్లాట్ ఫాం పై ఈడ్చుకెళ్ళిన కానిస్టేబుల్.. అతడ్ని పోలీస్ స్టేషన్ కు అప్పగించకపోవడంపైనా పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఓ ప్రయాణీకుడు తన జేబు కొట్టేశారని ఇచ్చిన కంప్లైంట్ తో... బాలుడ్ని చిల్లర దొంగగా అనుమానించిన జీఆర్పీ సింగ్.. అతడ్ని పట్టుకొని కొట్టడంతోపాటు ఈడ్చుకుంటూ వెళ్ళడంతో సదరు బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వీడియోను వీక్షించిన రైల్వే పోలీసు అన్నతాధికారులు హెడ్ కానిస్టేబుల్ సింగ్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. -
భర్తతో గొడవపడి భార్యను రైల్లోనుంచి తోసేశాడు..
భరంపూర్(పశ్చిమ బెంగాల్): నడుస్తున్న రైల్లోంచి ఓ మహిళను జీఆర్పీ కానిస్టేబుల్ తోసివేశాడు. దీంతో ఆమె తీవ్ర గాయలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల వివరాల ప్రకారం నేసా గిరి (34) అనే మహిళ తన భర్త రమేశ్ గిరి(38)తో కలిసి తీస్తా-తోర్సా ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణం చేస్తోంది. అజింగంజ్ స్టేసన్లోకి ఎక్కిన ఆ దంపతులు డార్జిలింగ్‌లో దిగాల్సి ఉంది. ఈ లోగా టికెట్ కలెక్టర్, జీర్పీ పోలీసుకు రమేశ్ గిరికి మధ్య ఓ విషయంలో తీవ్ర వాగ్వాదం చేసుకుంది. సరిగ్గా ఫరక్కా స్టేషన్‌కు సమీపిస్తుండగా జీఆర్ పీ పోలీసు నేసాగిరిని కిందికి తోసివేశాడు. ఈ మేరకు ఆమె భర్త రమేశ్ గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.