
భర్తతో గొడవపడి భార్యను రైల్లోనుంచి తోసేశాడు..
భరంపూర్(పశ్చిమ బెంగాల్): నడుస్తున్న రైల్లోంచి ఓ మహిళను జీఆర్పీ కానిస్టేబుల్ తోసివేశాడు. దీంతో ఆమె తీవ్ర గాయలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల వివరాల ప్రకారం నేసా గిరి (34) అనే మహిళ తన భర్త రమేశ్ గిరి(38)తో కలిసి తీస్తా-తోర్సా ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణం చేస్తోంది.
అజింగంజ్ స్టేసన్లోకి ఎక్కిన ఆ దంపతులు డార్జిలింగ్లో దిగాల్సి ఉంది. ఈ లోగా టికెట్ కలెక్టర్, జీర్పీ పోలీసుకు రమేశ్ గిరికి మధ్య ఓ విషయంలో తీవ్ర వాగ్వాదం చేసుకుంది. సరిగ్గా ఫరక్కా స్టేషన్కు సమీపిస్తుండగా జీఆర్ పీ పోలీసు నేసాగిరిని కిందికి తోసివేశాడు. ఈ మేరకు ఆమె భర్త రమేశ్ గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.