![వామ్మో..డబుల్ డెక్కరా ! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71400963628_625x300.jpg.webp?itok=U8w4K1Wm)
వామ్మో..డబుల్ డెక్కరా !
తిరుపతిఅర్బన్, న్యూస్‌లైన్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆర్భాటంగా ప్రారంభించిన డబు ల్ డెక్కర్ రైలు అంటేనే ప్రయాణికులు, టీసీలు జడుసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. రైలు ఈ నెల 14వ తేదీ ప్రారంభమైనప్ప టి నుంచీ రైలులోని అన్ని బోగీల్లో ఏసీలు పనిచేయడం లేదు. దీనిపై ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నా అధికారుల్లో చలనం లేదు. శనివారం ఉదయం 6.45 గంటలకు కాచీగూడ నుంచి తిరుపతికి బయలుదేరింది. రైల్లోని అన్ని బోగీల్లో ఏసీలు పనిచేయలేదు.
దీంతో ప్రయాణికులు టీసీలపైకి దాడికి దిగారు. కర్నూలు, కడప రైల్వే స్టేషన్లలో టీసీలపై చేయిచేసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. అంతేగాక ఈ రైలు నిర్ణీత వేళల ప్రకారం సాయంత్రం 5.15 గంటలకు తిరుపతికి చేరుకోవాల్సి ఉండగా శనివారం రాత్రి 8.40 గంటలకు చేరుకుంది. ప్రయాణికులు తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ కార్యాలయంవద్దకు ఆందోళన చేశారు.