హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రెండో రోజు కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏఈఓ పోస్టులను అగ్రికల్చర్ విద్యార్థులకే కేటాయించాలని కోరుతూ యూనివర్సిటీలో సుమారు 300 మంది విద్యార్థులు ధర్నా చేసి, అనంతరం ర్యాలీ తీశారు. యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావును విద్యార్థులు అడ్డుకున్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న పరీక్షలను కూడా అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు.
అగ్రికల్చర్ వర్సిటీలో కొనసాగుతున్నఆందోళన
Published Wed, Apr 13 2016 1:53 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement