
సుమ, రాజీవ్ కనకాల
సాక్షి, బంజారాహిల్స్: ప్రజాస్వామ్యం మనకు ఒక గౌరవం, హక్కును కల్పించింది. అలాంటప్పుడు ఆలోచించి ఓటు వేయాలి. ఓటు వేయడం అవసరమా అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఆ భావనను విడనాడాలి. ఓటు వేయకుంటే మనల్ని మనం మోసం చేసుకోవడంతో పాటు ఇతరులకు నష్టం చేసిన వారిగా మిగులుతాం. ఓటు అనేది హక్కు, ఆ హక్కును సరైన దారిలో వినియోగించుకోవాలి. గాలి, తిండి ఎలాగో మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు కూడా అలాంటిదేనని అనుకోవాలి.
నేను, నా భర్త రాజీవ్ తప్పనిసరిగా ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటాం. ఆ రోజు షూటింగ్‌లు ఉన్నా రెండు గంటలు ఆలస్యంగా వెళతాం. ఎన్ని పనులున్నా ఓటు వేయనిదే షూటింగ్‌లకు హాజరయ్యే ప్రసక్తే లేదు. 20 ఏళ్ళ క్రితం రాజీవ్ కనకాల ఓటు వేయలేకపోయారు. ఓటు విలువ అప్పుడు అంతగా తెలియకపోవడంతో ఓటు వేయలేకపోయానని ఆ విలువ తెలిసిన తర్వాత తప్పనిసరిగా ఎన్నికల్లో పాల్గొంటున్నానని వెల్లడించారు. మేము జూబ్లీహిల్స్ నియోజక వర్గం పరిధిలో రాజీవ్‌నగర్‌లో ఉంటున్నాం.
– సుమ, రాజీవ్ కనకాల
జస్ట్ ఫర్ యు
♦ పోలింగ్‌కు 48 గంటల ముందు బహిరంగ సమావేశాలు, పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్లలోపు ప్రచారం నిషేధం.
♦ ప్రజల ఇళ్లముందు పికెటింగ్‌లు, ప్రదర్శనల వంటి వాటితో వారి ప్రశాంతతకు భంగం కలిగించరాదు.
♦ భవన యజమానుల అనుమతి లేనిదే పార్టీ జెండాలు, బ్యానర్లు గోడలపై రాతలు వంటివి చేయరాదు.
♦ పార్టీ సమావేశాలకు సంబంధించి సమయం, వేదిక తదితర వివరాలను తగినంత ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తదితర చర్యలు తీసుకుంటారు. ర్యాలీలు నిర్వహించేప్పుడు బయలు దేరే స్థలం.. ముగిసే స్థలం.. సమయం తెలియజేయాలి.
♦ సభలకు లౌడ్‌స్పీకర్లు, ఇతరత్రా సదుపాయాలు వినియోగించుకునేందుకు ముందస్తు అనుమతి పొందాలి.
Comments
Please login to add a commentAdd a comment