మోర్తాడ్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నెల రోజులు అవుతున్నా రెవెన్యూ అధికారులు మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్‌లలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజ ముద్రనే దర్శనమిస్తోంది. ఆదాయం, కులం, నెటివిటీ త దితర ధ్రువీకరణ పత్రాలతోపాటు పహాని ఇతరత్రా సర్టిఫికెట్‌లు అన్ని మీ సేవ కేంద్రాల ద్వారానే జారీ చేయబ డుతున్నాయి. సర్టిఫికెట్‌ల కోసం దరఖాస్తుదారులు మీ సేవ కేంద్రాలలో సంప్రదించి అవసరమైన జిరాక్సు కాపీలను అందచేస్తే రెండు మూడు రోజుల వ్యవధిలో సర్టిఫికేట్‌లు జారీ అవుతాయి.
మీ సేవ కేంద్రాలకు జారీ చేసిన స్టేషనరీ పాతది కావడంతో పత్రాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పూర్ణ కుం భం తో కూడిన రాజ ముద్రనే ఉంది. తె లంగాణ ప్రభుత్వం కొత్త రాజ ముద్ర ను ఆమోదింపచేసింది. స్టేషనరీ గతంలో ప్రింట్ చేసింది కావడంతో రాజ ముద్ర లో ఎలాంటి మార్పు లేదు. కాగా సర్టిఫికెట్‌లపై తెలంగాణ ప్రభుత్వం అని ఉన్నా, రాజ ముద్ర విషయంలో మా ర్పులు చేయాల్సి ఉంది.
రాజ ముద్ర మారక పోవడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు, ఇతర సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకుం టే ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని దరఖాస్తుదారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నెల రోజుల వుతున్నా సర్టిఫికెట్‌ల స్టేషనరీలో మా ర్పులు చేయక పోవడంపై నిరసన వ్య క్తం అవుతోంది. మీ సేవ కేంద్రాల నిర్వా హకులు సర్టిఫికెట్‌లను జారీ చేయడానికి అవసరమైన స్టేషనరీని హై దరాబాద్‌లోని మీ సేవ కేంద్రాల కంట్రోల్ రూంకు ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ ఉంచితే, డ బ్బులు కట్ అవుతాయి.
దీంతో హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రానికి స్టేషనరీ సరఫరా అవుతుంది. ఆ తరువాత ని ర్వాహకులు తెప్పించుకోవాల్సి ఉంటుం ది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాైటై న వెంటనే స్టేషనరీని మార్చాల్సి ఉంది. అధికారులు పట్టించుకోక పోవడం తో ఏపీ రాజ ముద్రతోనే సర్టిఫికెట్ లు జా రీ అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారు లు స్పందించి సర్టిఫికెట్‌లపై తెలంగా ణ రాజ ముద్ర ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇంకా ఏపీ సింబలేనా !
Published Fri, Jul 4 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement
Advertisement