- గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, ఎం.ఎస్.ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, రంగారెడ్డి గురువారం గవర్నర్‌ను కలిశారు. 125 గజాల్లోపు స్థలాలకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. దళారులను గుర్తించడానికి సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు. పేదలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్‌ను కాంగ్రెస్ నేతలు కోరారు.