కేసీఆర్‌ను బర్తరఫ్ చేయాలి
గవర్నర్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును వెంటనే పదవినుంచి తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. స్వయానా ముఖ్యమంత్రే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మంగళవారం వారంతా గవర్నర్‌కు ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి శాసనసభాపక్ష ఉపనేత జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. దేశచరిత్రలో ఏ నేతా చేయని విధంగా కేసీఆర్ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శిం చారు. తమ విజ్ఞప్తికి గవర్నర్‌కు సానుకూలంగా స్పందించారనిజీవన్‌రెడ్డి వివరించారు. తెలంగాణలో ఆత్మత్యాగాలు, బలిదానాలకు ముగింపు పలకాలనే ఏఐసీసీ అధినేత్రి సోనియా ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేశారని పేర్కొన్నారు.
అలాం టిది మీరు ఆమె పార్టీ పట్ల చూపిస్తున్నది కృత జ్ఞతా..కృతఘ్నతా..? అని ప్రశ్నించారు. ‘‘ప్రజల్లో మీకు విశ్వాసం ఉందని భావిస్తే.. మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించండి’ అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడిగా కూడా కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని ఆయన చెప్పారు.