రామయ్య లడ్డూలో తలనీలాలు | Talanilalu in sri rama laddu prasadam | Sakshi
Sakshi News home page

రామయ్య లడ్డూలో తలనీలాలు

Published Sun, Dec 7 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

రామయ్య లడ్డూలో తలనీలాలు

రామయ్య లడ్డూలో తలనీలాలు

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి లడ్డూ ప్రసాదంలో తలనీలాలు ప్రత్యక్షమయ్యాయి. శనివారం ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు లడ్డూ ప్రసాదంలో తలనీలాలు కనిపించడంతో అవాక్కయ్యారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన డి.అర్జున్‌తో పాటు మరో ఐదుగురు మిత్రృబందం శనివారం ఆలయానికి వచ్చారు. 

తిరుగు ప్రయాణంలో ప్రసాదాల కౌంటర్ వద్ద లడ్డూలను కొనుగోలు చేశారు. అందులో తలనీలాలు కనిపించడంతో అర్జున్ అవాక్కయ్యాడు. మరో లడ్డూ కొనుగోలు చేయగా అందులోనూ తలనీలాలు దర్శనమిచ్చాయి. తీవ్ర ఆవేదనకు లోనైన అర్జున్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో ‘సాక్షి’ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. స్వామివారి ప్రసాదాల విషయంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement