రేపు ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా | Talasani Srinivas yadav to quit mla post | Sakshi
Sakshi News home page

రేపు ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా

Published Mon, Dec 15 2014 10:31 PM | Last Updated on Sat, Aug 11 2018 6:56 PM

రేపు ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా - Sakshi

రేపు ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా

హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఉదయం రాజీనామా చేయనున్నారు. న్యాయపరమైన సమస్యల నుంచి తప్పించుకునేందుకు ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవికి ఖాయమైంది.

2014 ఎన్నికల్లో సనత్నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజా కేబినెట్ విస్తరణలో తలసానికి మంత్రి పదవికి ఖాయమైంది. మరోవైపు విప్ ధిక్కరించినందుకు తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), చల్లా ధర్మారెడ్డి (పరకాల)లపై అనర్హత వేటు వేయాలని టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ ముగ్గురికి స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తలసాని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement