క్వింటాల్ పది వేలకు కొనాలి
మిర్చికి కనీస మద్దతు ధరపై తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: మిర్చి కనీస ధర క్వింటాల్‌కు రూ.10 వేలుగా ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఇందులో కేంద్రం రూ.8వేలు, రాష్ట్రం రూ.2వేలు భరించాలని సూచిం చారు. మే 31గడువును ఎత్తేయాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. రైతులకు కోల్డ్ స్టోరేజీలు, గోదాముల్లో ఉచితంగా మిర్చి పంట నిల్వ చేసుకునే సదుపాయాలు కల్పించి, క్వింటాల్‌కు రూ.8వేలు వడ్డీ లేని రుణమివ్వాలన్నారు. కేంద్రం బుధవారం ప్రకటించిన క్వింటాల్‌కు రూ.5 వేలు ధర ఏ మూలకు సరిపోదన్నారు. మిర్చి రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచు లాడుతూ వ్యాపారుల దోపిడికి అవకాశం కల్పించాయని ధ్వజమెత్తారు.