‘ప్రభుత్వం తొండి చేసింది’
హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అనుమతి ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం తొండి చేసిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ధర్నాలో ప్రభుత్వమే హింసకు పాల్పడిందని ఆరోపించారు. పోలీసులు హింసకు పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు అతి తెలివి ప్రదర్శించిందని, లాఠిచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులతో ధర్నా చేయించిన హోంమంత్రికి ఏం చట్టబద్ధత ఉందని తమ్మినేని ప్రశ్నించారు.
ఈ రోజు ధర్నాలో విజయం సాధించామని, ప్రభుత్వే ఘర్షణ వాతావరణం సృష్టించిందని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. ధర్నా చౌక్ వద్ద పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.