సమాచారం @ ఆన్‌లైన్ | teachers information available in internet | Sakshi
Sakshi News home page

సమాచారం @ ఆన్‌లైన్

Published Thu, Oct 2 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

teachers information available in internet

సాక్షి, మంచిర్యాల : ఉపాధ్యాయుల సమస్త సమాచారాన్ని అవసరం ఉన్నప్పుడల్లా సేకరించే తిప్పలు తప్పేలా జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుల సర్వీసు వివరాలతోపాటు వారి విద్యాభ్యాసం, పదోన్నతుల అర్హత సమాచారాన్ని వారి నుంచి సేకరిస్తున్నారు. తద్వారా త్వరలో జరగబోయే బదిలీలు, పదోన్నతులు, సర్దుబాట్లకు సమాచారం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం అన్ని కేటగిరీల  ఉపాధ్యాయులను కలుపుకొని దాదాపు 11,000 మంది పనిచేస్తున్నారు.

 బదిలీలు, పదోన్నతులు, ఎన్నికల విధులు, పీఆర్సీ, డీఏ భత్యాల చెల్లింపు వంటి సందర్భాల్లో అప్పటికప్పుడు వివరాల సేకరణ విద్యాశాఖ వర్గాలకు తలకుమించిన భారంగా మారుతోంది. ఈ తిప్పలు తప్పేలా తాజాగా జిల్లా అధికారులు ఒక నమూనా రూపొందించారు. ఇందులో ఉపాధ్యాయుడి విద్యాభ్యాసం, ఉద్యోగంలో చేరిన తేదీ, పొందిన పదోన్నతులు, అందుకుంటున్న జీత భత్యాలు, శారీరక అంగవైకల్యం, పదోన్నతులకు అనుగుణమైన విద్యాభ్యాసం చేసిన వివరాలు, డిపార్ట్‌మెంటల్ టెస్టుల  వివరాలు, ఎంఈడీ, బీఈడీ, డీఈడీ, భాషా పండిత పరీక్షలు ఉత్తీర్ణులు అయితే ఆ వివరాలు, వైవాహిక స్థితి,  జీవిత భాగస్వామి వివరాలు వంటి సమాచారాన్ని పొందుపర్చనున్నారు.

ఈ వివరాలను ఆయా అధికారుల ద్వారా ఆన్‌లైన్‌లో పొందపరుస్తున్నారు. దీంతో పాటు స్కూల్ హెడ్‌మాస్టర్ వద ్ద ఆ స్కూల్‌కు సంబంధించిన సమస్త సమాచారం అప్‌డేట్ చేసేలా పాస్‌వర్డ్‌తో కూడిన అనుమతి ఉంటుంది. పదోన్నతులు, బదిలీలు, నెలవారిగా విద్యార్థుల హాజరు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచే అవకాశం ఉంటుంది. జీతభత్యాలు వీట న్నింటినీ త్వరలో రూపొందించే అవకాశాలున్న ఏకీకృత సర్వీసు రూల్సు, పదోన్నతులు, బదిలీలు, స్కూళ్ల మూసివేత కసరత్తు మార్గదర్శకాలు సిద్ధమయ్యే వరకు సిద్ధం చేయనున్నారు.

 ఆసక్తి పెరగాలి
 అయితే ఉపాధ్యాయుల నుంచి పూర్తిస్థాయిలో స్పందన రావడంలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గడువు ముగిసే స మయానికి దాదాపు సగం మంది ఉపాధ్యాయులే వారి వివరాలను అ ప్‌లోడ్ చేసినట్లు సమాచారం. కొన్ని వివరాలు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. బీఈడీ/డీఈడీ/ఇంటర్మీడియట్ తదితర చదువులకు సంబంధించిన హాల్‌టిక్కెట్ నంబర్లు అందజేయడం కష్టమవుతోందని ఓ ఉపాధ్యాయుడు పేర్కొన్నారు. అయితే వాటి ని అందజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

 అన వసర శ్రమను తగ్గించేందుకే.. - సత్యనారాయణరెడ్డి, డీఈవో, ఆదిలాబాద్
 ఉపాధ్యాయులకు వివరాలు అందజేసేందుకు మండల, జిల్లా విద్యాశాఖ వరకు రావాల్సిన శ్రమను తప్పించేందుకు ఈ ప్రయత్నం. ఆన్‌లైన్‌లో స్కూళ్లవారిగా వివరాలు ఉండటం వల్ల సమచారహక్కు ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయాస కూడా తొలగిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement