హైదరాబాద్: చైతన్యవంతమైన బీసీ టీచర్లు బీసీ ఉద్యమాలకు నాయకత్వం వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.కృççష్ణుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులపై ఉన్న క్రీమీలేయర్ వి«ధానాన్ని ఎత్తివేయాలన్నారు. అనంతరం రాష్ట్ర బీసీ టీచర్స్ అసోసియేషన్ 2019 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎ.లక్ష్మణ్‌గౌడ్, కోశాధికారి వి.రమేశ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యాదగిరి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు గురుప్రసాద్ గౌడ్, కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
టీచర్లు ఉద్యమానికి నాయకత్వం వహించాలి
Published Fri, Jan 18 2019 1:20 AM | Last Updated on Fri, Jan 18 2019 1:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment