
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం జాతీయ రహదారుల్లో ఫాస్టాగ్ విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. కానీ ఫాస్టాగ్ విధానంపై వినియోగదారులు పెద్దగా మొగ్గు చూపలేదు. ఫలితంగా పలు టోల్‌గేట్ల వద్ద భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫాస్టాగ్‌కు అధిక లైన్లు, నగదు చెల్లింపు లైన్లను తక్కువకు కుదించి, ఫాస్టాగ్‌కు ఎక్కువ లైన్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
యాదాద్రి భువనగిరి: జిల్లాలోని పంతంగి టోల్‌గేట్ వద్ద పెద్దసంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. టోల్‌ప్లాజాలోని ఐదుగేట్ల ద్వారా ఫాస్టాగ్‌కు అనుమతి ఉంది. మరో మూడు గేట్ల ద్వారా నగదు చెల్లించి వాహనాల రాకపోకలు కొనసాగించవచ్చు. ఈ క్రమంలో ఆదివారం ఫాస్టాగ్ లేని గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌గేట్ ఇరువైపులా కిలోమీటర్ మేర వాహన రాకపోకలు స్థంభించిపోయాయి.. ఫాస్టాగ్ విధానం అమలుతో నగదు చెల్లింపు కౌంటర్లు కుదించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు.
కృష్ణా: జిల్లాలోని టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానం మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంచికర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్‌లు పనిచేయలేదు. రెండు లైన్లలో ఫాస్టాగ్ పనిచేయకపోవడంతో టోల్‌గేట్ సిబ్బంది క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేసి వాహనాలను పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment